Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సైనికుల కోసం బుల్లెట్ బైక్‌లనే మొబైల్ అంబులెన్స్‌లుగా మార్చేశారు..
అత్యవసర సమయాల్లో క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటంలో అంబులెన్స్‌లు కీలక పాత్రను పోషిస్తుంటాయి. ఒకప్పుడు అంబులెన్స్ అంటే మారుతి సుజుకి ఓమ్నీ మరియు టెంపో ట్రావెలర్ వంటి బ్రాండ్లకు చెందిన వాహనాలే గుర్తొచ్చేవి.

అయితే, మారుతున్న కాలంతో పాటే అంబులెన్స్‌లు కూడా తన రూపాన్ని మార్చుకుంటున్నాయి. ఆపదలో ఉన్న వారిని / గాయపడిన వారిని వీలైనంత వేగంగా ఆస్పత్రికి చేర్చేందుకు వీలుగా ప్రస్తుతం అనేక రకాల అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి.

తాజాగా, భద్రతా దళాల సిబ్బంది కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిళ్లనే మొబైల్ అంబులెన్స్‌లను మార్చారు. ఈ బుల్లెట్ అంబులెన్స్‌లను ఫెడరల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
MOST READ:3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ కాసే జవాన్లకు సత్వర వైద్యం అందేందుకు వీలుగా వీటిని రూపొందించారు. నాలుగు చక్రాల వాహనాలు ప్రయాణించలేని దారుల్లో సైతం ఇవి అలవోక చేరుకోగలవు. యుద్ధాలు లేదా ఉగ్రవాద దాడుల్లో గాయపడిన భద్రతా దళాల సిబ్బందిని వేగంగా ఆసుపత్రులకు చేర్చేందుకు వీటిని ఉపయోగించనున్నారు.

అంతేకాకుండా, ఎవరైనా సైనికులకు అత్యవసర వైద్య సహాయం అవసరమైనప్పుడు వీటిని వినియోగిస్తారు. ఈ ప్రత్యేక బైక్ అంబులెన్సులను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్ళను ఉపయోగించి తయారు చేశారు.
MOST READ:కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు

ఇందుకు గాను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్లను ప్రత్యేకంగా మోడిఫై చేశారు. ఈ బైక్ అంబులెన్స్‌లకు 'రక్ష' అనే పేరు కూడా పెట్టారు. ఇందులో పిలియన్ రైడర్ సీట్ స్థానంలో స్ట్రెచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్ట్రెచర్‌ను పేషెంట్ స్థితిని బట్టి సర్దుబాటు చేసేలా ఉంటుంది.

జనవరి 18వ తేదీన ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వీటిని ఆవిష్కరించారు. ఈ స్ట్రెచర్‌ను బైక్‌పై అమర్చడం మరియు తొలగించడం చాలా సులువుగా ఉంటుంది. దీని క్షతగాత్రులను గాయాల తీవ్రతను బట్టి కూర్చోబెట్టడం లేదా పడుకోబెట్టడం చేయవచ్చు. ప్రయాణంలో పేషెంట్ కదలకుండా ఉండేందుకు ఇందులో తల నుంచి కాళ్ల వరకూ సేఫ్టీ బెల్టులు ఉంటాయి.
MOST READ:ఫలించిన కల; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

ఈ రక్ష బైక్ అంబులెన్స్‌లలో ఫస్ట్ ఎయిడ్ కిట్ మరియు అత్యవసర సమయాల్లో ఉపయోగించేదుకు ఆక్సిజెన్ సిలిండర్ వంటి వైద్య పరికరాలు కూడా ఉంటాయి. ఇంకా ఇందులో అంబులెన్స్ సైరన్లు, జిపిఎస్ సౌకర్యంతో కూడిన టాబ్లెట్స్ వంటి పరికరాలు కూడా ఉన్నాయి.

నాలుగు చక్రాల వాహనాలు ప్రయాణించడానికి వీలులేని, సవాలుగా ఉండే ప్రాంతాల్లో, ఈ బైక్ అంబులెన్సులు అత్యవసర వైద్యం కోసం అవసరమైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు రవాణా చేయడానికి ఉపయోగించబడతాయి. ప్రత్యేకించి అడవులు, సరిహద్దు ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉపయోగపడుతాయి.
MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!

గతంలో హీరో మోటోకార్ప్ కూడా ఫస్ట్-రెస్పాండర్స్ కోసం అంబులెన్స్ మోటార్‌సైకిళ్లను ప్రభుత్వానికి అందజేసింది. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోని రోగులను ఆస్పత్రులకు చేర్చడానికి వీటిని ఉపయోగిస్తారు. హీరో ఎక్స్ట్రీమ్ 200 ఆర్ మోడల్‌ను ఫస్ట్-రెస్పాండర్ వాహనాలుగా మార్చారు. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.