రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఢీకొట్టిన టయోటా ఫార్చ్యూనర్.. రెండు ముక్కలైన బైక్‌..!

భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై రాత్రి వేళల్లో విద్యుత్‌ దీపాల వ్యవస్థ సరిగా లేదు. ఫలితంగా చీకట్లో డ్రైవింగ్‌ చేస్తూ చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు.

చీకట్లో డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో చాలా మంది హై బీమ్‌ (ఎక్కువ కాంతిని ఇచ్చే) లైట్లను వినియోగిస్తున్నారు. ఫలితంగా ఎదురుగా వస్తున్న వాహనదారులకు రోడ్డు సరిగా కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు డ్రైవర్లు ప్రమాదాల బారిన పడుతున్నారు.

Toyota Fortuner hits royal Enfield

తాజాగా ఇటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. టయోటా ఫార్చ్యూనర్ కారు... రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ భైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను నిఖిల్‌ రానా తన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

అహ్మదాబాద్‌లోని రింగ్‌రోడ్‌ జంక్షన్‌ వద్ద ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి నుంచి వచ్చే వాహనాలకు రింగ్‌ రోడ్‌ వద్ద ఓ చెట్టు అడ్డుగా ఉందని తెలుస్తోంది. అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ డ్రైవర్‌ ఎదురుగా ఉన్న ట్రాఫిక్‌ను సరిగా గమనించకుండా రింగ్‌ రోడ్‌ జంక్షన్‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అదే సమయానికి అటు వైపు టయోటా ఫార్చ్యూనర్ కారు వచ్చింది. దీంతో కారును నియంత్రించే సమయం లేక బైక్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

Toyota Fortuner hits royal Enfield

అనంతరం ఫార్చ్యూనర్ కారు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ఘటనలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ కూడా భారీగా డ్యామేజీ అయింది. బైక్‌ రెండు ముక్కలైంది. ఫార్చ్యూనర్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. కారు మిలిగిన భాగాలు కూడా డ్యామేజీ అయ్యాయి. అయితే ఫార్చ్యునర్‌ కారు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ డ్రైవర్లు ఎవరు వేగంగా వస్తున్నారనేది తెలియలేదు.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు సహా బైక్‌ డ్రైవింగ్‌ చేసిన వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. కారులోని ప్రయాణికులు సీట్‌ బెల్ట్‌ ధరించడం వల్ల ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్‌ అయ్యాయి. అదేవిధంగా బైక్‌ నడిపిన వ్యక్తి కూడా నాణ్యమైన హెల్మెట్‌ ధరించిన కారణంగా క్షేమంగా బయటపడ్డారు. సీట్‌బెల్ట్‌, హెల్మె్‌ట్‌ల అవసరం గురించి చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది.

Toyota Fortuner hits royal Enfield

రోడ్లుపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఎల్లప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా రాత్రివేళ డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలి. రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా.. పోలీసులు, హాస్పిటల్‌కు సమాచారం అందించాలి. బాధితులను దగ్గరలోని హాస్పిటల్‌కు వీలైనంత వేగంగా తరలించాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, July 21, 2023, 15:48 [IST]
English summary
Royal enfield bike divides into two parts after toyota fortuner crashed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+