రైడర్ లేకుండా హైవేపై వేగంగా ముందుకెళ్లిన రాయల్ ఎన్‌ఫీల్డ్[వీడియో]

సాధారణంగా మనం కొన్ని దెయ్యాల సినిమాలు చూసినప్పుడు, అందులో కొన్ని వాహనాలు తనను తానుగానే కదలడం లేదా ముందుకు వెళ్లడం చూసే ఉంటాము. ఇవన్నీ దాదాపు సినిమాలకే పరిమితం అనుకుంటూ ఉంటాం. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల సినిమాల్లో కూడా ఇటువంటి సన్నివేశాలు చాలా తక్కువైపోయాయి. అయితే ఇలాంటి సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

రైడర్ లేకుండా హైవేపై వేగంగా ముందుకెళ్లిన రాయల్ ఎన్‌ఫీల్డ్

నివేదికల ప్రకారం, ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని పూణే-నాసిక్ హైవేలో ఈ సంఘటన జరిగినట్లు నిర్దారించబడింది. 2021 ఆగస్టు 9 సాయంత్రం 6.30 గంటల సమయంలో, అసలు రైడర్ లేని ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పూణే - నాసిక్ హైవేపై ప్రయాణిస్తోంది.

రైడర్ లేకుండా హైవేపై వేగంగా ముందుకెళ్లిన రాయల్ ఎన్‌ఫీల్డ్

రైడర్ లేకుండా ముందుకు వెళ్తున్న ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌ను చూడటానికి రోడ్డుపై చాలామంది ప్రజలు గుమిగూడారు. అదే సమయంలో ప్రజలు ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ముందు వస్తున్న ఇతర వాహనదారులను హెచ్చరించడానికి అరవడం వంటివి ప్రారంభించారు. దీనిని మీరు ఈ ఆర్టికల్ లోని వీడియోలో చూడవచ్చు.

రైడర్ లేకుండా హైవేపై వేగంగా ముందుకెళ్లిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఈ సంఘటన జరగటం వల్ల ఆ ప్రాంతంలో కొంత అవాంతర వాతావరణం ఏర్పడింది. అక్కడ కొందరు వ్యక్తులు ఈ బైక్ నడపడానికి ప్రయత్నించారు. అయితే వారి ముందు వాహనాలు వేగంగా వెళ్తున్నందున వారు ఈ బైక్‌ను పట్టుకోలేకపోయారు. ఈ వీడియోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అధిక వేగంతో కదులుతోంది మరియు ఎదురుగా వస్తున్న ఒక వెహికల్ కూడా వేగంగా వస్తోంది.

రైడర్ లేకుండా హైవేపై వేగంగా ముందుకెళ్లిన రాయల్ ఎన్‌ఫీల్డ్

అయితే ఈ కమర్షియల్ వెహికల్ ఆ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని ఢీ కొట్టలేదు. అయితే ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కొంత దూరం ముందుకు వెళ్లి సమీపంలో కిందికి పడిపోయింది. ఎదురుగా వస్తున్న కమర్షియల్ వెహికల్ డ్రైవర్, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై రైడర్ లేకుండా రావడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. కావున తన వాహనాన్ని వెంటనే నిలిపివేశారు.

రైడర్ లేకుండా హైవేపై వేగంగా ముందుకెళ్లిన రాయల్ ఎన్‌ఫీల్డ్

మీరు ఈ వీడియో గమనించినట్లతే ఖచ్చితంగా కమర్షియల్ వెహికల్ ఆ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని ఢీ కొట్టుకుంటుందని భావిస్తారు. కానీ కమర్షియల్ వెహికల్ డ్రైవర్ అలెర్ట్ గా ఉండటం వల్ల రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని ఢీ కొట్టలేదు. ఇక్కడ కనిపిస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ సుమారు 300 మీటర్ల తర్వాత కిందకు పడిపోయింది.

రైడర్ లేకుండా హైవేపై వేగంగా ముందుకెళ్లిన రాయల్ ఎన్‌ఫీల్డ్

నివేదికల ప్రకారం, ఆ రోడ్డుపై నడుస్తున్న ఒక వ్యక్తి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వల్ల స్వల్పంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని హాస్పిటల్ కి చేర్చారు. హైవేపై రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రైడర్ లేకుండా ముందుకు వెళ్లిన సంఘటన రోడ్డుపైన ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయింది.

రికార్డ్ అయిన వీడియో ఆధారంగా స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో కూడా వైరల్ అవుతున్నాయి. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఎలా ముందుకు వెళ్లగలిగింది అనేదానిపై దర్యాపు జరుగుతోంది. అంతే కాకుండా ఈ బైక్ ఎవరిది అనే ప్రశ్నకు కూడా ప్రస్తుతం సమాధానం లేదు.

రైడర్ లేకుండా హైవేపై వేగంగా ముందుకెళ్లిన రాయల్ ఎన్‌ఫీల్డ్

సాధారణంగా టెస్లా బ్రాండ్ కార్లు ఇప్పుడు ప్రపంచంలో డ్రైవర్ రహిత కార్లు అని అందరికి తెలుసు. అయితే ఇప్పటివరకు కూడా ప్రపంచంలో ఎవరూ డ్రైవర్ రహిత బైక్‌లను అభివృద్ధి చేయలేదు. అంతే కాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బైక్‌లలో డ్రైవర్‌లెస్ రైడింగ్ టెక్నాలజీలను అసలు అందించదు.

రైడర్ లేకుండా హైవేపై వేగంగా ముందుకెళ్లిన రాయల్ ఎన్‌ఫీల్డ్

భౌతికశాస్త్ర నియమాల ప్రకారం, ఈ బైక్ ఆటోమేటిక్‌గా 300 మీ. ముందుకు వెళ్ళింది కావున, ఈ బైక్ కి దాని యజమాని ఏటవాలుగా ఉండే ప్రాంతంలో పార్క్ చేసి ఉండవచ్చు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సమయంలో ఈ బైక్ బ్యాలెన్స్ కోల్పోయి ముందుకు వేగంగా వచ్చి ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రైడర్ లేకుండా హైవేపై వేగంగా ముందుకెళ్లిన రాయల్ ఎన్‌ఫీల్డ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఎలాంటి రైడర్లు లేకుండా అతివేగంగా వెళ్లిందని అక్కడున్న ప్రజలు చెబుతున్నారు. బైక్ గేర్ మార్చకుండా అధిక వేగంతో స్విచ్ ఆన్ చేయవచ్చు. ఈ సంఘటనలో కూడా అదే జరిగింది. ఏటవాలుగా ఉండే ప్రాంతంలో పార్క్ చేసిన బస్సులు మరియు కార్లు ముందుకు కదిలిన సంఘటనలు కూడా గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి.

రైడర్ లేకుండా హైవేపై వేగంగా ముందుకెళ్లిన రాయల్ ఎన్‌ఫీల్డ్

వాహనాలు ఏటవాలుగా ఉండే ప్రాంతాల్లో పార్క్ చేసినప్పుడు, అవి ఒక వేళా ముందుకు కదిలితే అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి సంఘటనలు గురించి చాలా విషయాలు మీరు మునుపటి వ్యాసాల్లో తెలుసుకుని ఉంటారు. కానీ ఇలాంటి సంఘటనలు చాలా ప్రమాదం. కావున వాహనదారులు తమ వాహనాలను చదునుగా ఉండే ప్రాంతాల్లోఈ పార్కింగ్ చేయాలి. అప్పుడే ఇలాటి సంఘటనలు జరగకుండా చూడవచ్చు.

Note:ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
Royal enfield bike moves without rider on pune nashik highway video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X