Just In
- 1 hr ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 1 hr ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 2 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 3 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
Don't Miss
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Lifestyle
రాత్రి ఫోన్ వాడకుండా జాగ్రత్త వహించండి .. డేంజర్ !!
- News
పెళ్లికి పెద్దల ‘నో’: జగిత్యాలలో యువతి, దుబాయ్‌లో యువకుడు బలవన్మరణం
- Sports
విమాన ప్రమాదంలో నలుగురు ఆటగాళ్లు మృతి!!
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]
ఆధునిక యుగంలో నేటి యువతకు బైక్ మరియు కార్ స్టంట్స్ పట్ల ఎక్కువ వ్యామోహం. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో బైకర్లు చాలా చోట్ల స్టంట్స్ చేయడం కనిపిస్తుంది. అయితే, ఈ స్టంట్ బైకర్లను ఆపడానికి పోలీసులు కఠినమైన ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా బైక్ స్టంట్స్ చాలా ప్రమాదకరమైనవి.
![యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]](/img/2020/11/royal-enfield-bullet1-1606196147.jpg)
ఇది బైకర్లకు మాత్రమే కాదు, ఆ సమయంలో అక్కడ ఉన్న ఇతరులకు కూడా ప్రమాదకరం. అలాంటి ఒక స్టంట్ యొక్క వీడియో ఇటీవల ఇంటర్నెట్లో కనిపించింది, ఇందులో ఇద్దరు యువకులు బైక్‌పై స్టంట్స్ చేస్తున్నారు.
![యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]](/img/2020/11/royal-enfield-bullet2-1606196154.jpg)
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లపై ఇద్దరు యువకులు రైడ్ చేస్తూ, బైక్ స్టంట్ చేయడానికి ప్రయత్నించి, అపశృతి జరిగినట్లు ఇక్కడ మనం వీడియో చూడవచ్చు. ఈ వీడియో ఎక్కడ జరిగింది అనటానికి తగిన సమాచారం లేకపోయినప్పటికీ, ఈ సంఘటన ఎలా జరిగిందో చూడవచ్చు.
MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే
![యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]](/img/2020/11/royal-enfield-bullet3-1606196162.jpg)
ఈ బైకర్లు ఇద్దరూ రాంప్ నుండి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లో స్టంట్ చేశారు. ఆ ప్రాంతం మొత్తం మట్టితో నిండి ఉంది. ఈ చిన్న వీడియోలో, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ రైడర్ మరియు పిలియన్ అధిక వేగంతో రావడం, ర్యాంప్‌ను కొట్టి, కొంత ఎత్తులో గాలిలోకి ఎగరటం ఇక్కడ చూడవచ్చు.
రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ తెలుగు రివ్యూ కోసం ఈ వీడియో చూడండి
స్టంట్‌లో, ల్యాండింగ్ చేసేటప్పుడు మొదటి బైక్ యొక్క ముందు భాగం నేలను తాకి, అది బైక్ రైడర్లను దూరంగా విసిరివేస్తుంది. స్టంట్ ఒక భయంకరమైన ప్రమాదంతో ముగుస్తుంది, కానీ ఈప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
MOST READ:టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌లో మరో అడుగు ముందుకేసిన డ్రైవ్స్పార్క్ ; వివరాలు
ఈ వీడియోలో మనం గమనించినట్లైతే రైడర్ మరియు పిలియన్ ఇద్దరూ హెల్మెట్ ధరించలేదు. సాధారణ రోడ్ బైక్‌పై ఔత్సాహికులు ఇటువంటి విన్యాసాలు చేయడం చాలా సందర్భాల్లో చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది ప్రాణాలు పోయే పరిస్థితులను కూడా తీసుకువస్తుంది.
![యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]](/img/2020/11/royal-enfield-bullet6-1606196184.jpg)
సాధారణంగా మోటార్‌సైకిల్ మోటోక్రాస్ రేసింగ్‌కు సంవత్సరాల ట్రైనింగ్ అవసరం. అలాగే, ఈ సమయంలో ఇటువంటి స్టంట్స్ కోసం ప్రత్యేకమైన మోటార్ సైకిళ్ళు ఉపయోగించబడతాయి, ఇవి ఇలాంటి వాటి కోసం ప్రత్యేకంగా తయారు చేయబడతాయి. ఇది మాత్రమే కాకుండా ఈ సమయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతాయి.
MOST READ:ఇకపై ట్రాఫిక్ ఫైన్ చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా !
Image Courtesy: The mallu's world