యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]

ఆధునిక యుగంలో నేటి యువతకు బైక్ మరియు కార్ స్టంట్స్ పట్ల ఎక్కువ వ్యామోహం. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో బైకర్లు చాలా చోట్ల స్టంట్స్ చేయడం కనిపిస్తుంది. అయితే, ఈ స్టంట్ బైకర్లను ఆపడానికి పోలీసులు కఠినమైన ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా బైక్ స్టంట్స్ చాలా ప్రమాదకరమైనవి.

యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]

ఇది బైకర్లకు మాత్రమే కాదు, ఆ సమయంలో అక్కడ ఉన్న ఇతరులకు కూడా ప్రమాదకరం. అలాంటి ఒక స్టంట్ యొక్క వీడియో ఇటీవల ఇంటర్నెట్‌లో కనిపించింది, ఇందులో ఇద్దరు యువకులు బైక్‌పై స్టంట్స్ చేస్తున్నారు.

యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లపై ఇద్దరు యువకులు రైడ్ చేస్తూ, బైక్ స్టంట్ చేయడానికి ప్రయత్నించి, అపశృతి జరిగినట్లు ఇక్కడ మనం వీడియో చూడవచ్చు. ఈ వీడియో ఎక్కడ జరిగింది అనటానికి తగిన సమాచారం లేకపోయినప్పటికీ, ఈ సంఘటన ఎలా జరిగిందో చూడవచ్చు.

MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే

యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]

ఈ బైకర్లు ఇద్దరూ రాంప్ నుండి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లో స్టంట్ చేశారు. ఆ ప్రాంతం మొత్తం మట్టితో నిండి ఉంది. ఈ చిన్న వీడియోలో, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ రైడర్ మరియు పిలియన్ అధిక వేగంతో రావడం, ర్యాంప్‌ను కొట్టి, కొంత ఎత్తులో గాలిలోకి ఎగరటం ఇక్కడ చూడవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ తెలుగు రివ్యూ కోసం ఈ వీడియో చూడండి

స్టంట్‌లో, ల్యాండింగ్ చేసేటప్పుడు మొదటి బైక్ యొక్క ముందు భాగం నేలను తాకి, అది బైక్ రైడర్‌లను దూరంగా విసిరివేస్తుంది. స్టంట్ ఒక భయంకరమైన ప్రమాదంతో ముగుస్తుంది, కానీ ఈప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

MOST READ:టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌లో మరో అడుగు ముందుకేసిన డ్రైవ్‌స్పార్క్ ; వివరాలు

ఈ వీడియోలో మనం గమనించినట్లైతే రైడర్ మరియు పిలియన్ ఇద్దరూ హెల్మెట్ ధరించలేదు. సాధారణ రోడ్ బైక్‌పై ఔత్సాహికులు ఇటువంటి విన్యాసాలు చేయడం చాలా సందర్భాల్లో చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది ప్రాణాలు పోయే పరిస్థితులను కూడా తీసుకువస్తుంది.

యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]

సాధారణంగా మోటార్‌సైకిల్ మోటోక్రాస్ రేసింగ్‌కు సంవత్సరాల ట్రైనింగ్ అవసరం. అలాగే, ఈ సమయంలో ఇటువంటి స్టంట్స్ కోసం ప్రత్యేకమైన మోటార్ సైకిళ్ళు ఉపయోగించబడతాయి, ఇవి ఇలాంటి వాటి కోసం ప్రత్యేకంగా తయారు చేయబడతాయి. ఇది మాత్రమే కాకుండా ఈ సమయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతాయి.

MOST READ:ఇకపై ట్రాఫిక్ ఫైన్ చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా !

Image Courtesy: The mallu's world

Most Read Articles

English summary
Royal Enfield Bullet Bike Stunt Gone Wrong Video Details. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X