కుక్క కోసం సైడ్‌కార్‌.. సినిమాను తలపిస్తున్న ఘటన - వీడియో

కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయని అందరికి తెలుసు. కానీ మనిషి జంతువులను ప్రేమించడం మొదలుపెడితే.. అంతకు మించి ఉంటుంది. దీనికి నిలువెత్తు నిదర్శనమే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన 'రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్' 500 (Royal Enfield Classic 500) బైకుకు ప్రత్యేకంగా ఒక సైడ్‌కార్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సైడ్‌కార్‌ మనిషి కోసం కాదు.. తన కుక్క కోసం. ఇదంతా గమనిస్తే.. గత కొన్ని రోజులకు ముందు విడుదలైన 'చార్లీ 777' గుర్తొస్తుంది. నిజానికి ఇది కూడా అలాంటి స్టోరీనా అని అనిపిస్తోంది.

Royal Enfield Classic 500 With Sidecar For Pet Dog

కుక్క మరియు మనిషి మధ్య ఉన్న స్నేహం చూసి నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో కోయంబత్తూర్ మాప్లా అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను లెక్కకు మించిన నెటిజన్లు లైక్ చేశారు. మరి కొందరు నెటిజన్లు దీనిపైనా తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తూ వారి మద్దతు తెలుపుతున్నారు.

కుక్క పేరు ఏమిటంటే..

వీడియోలో గమనిస్తే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 బైక్ రైడర్ దానికి ఏర్పాటు చేసుకున్న సైడ్‌కార్ కవర్‌ ఓపెన్ చేయగానే తనకు ఇష్టమైన కుక్క కనిపిస్తుంది. పడుకోవడానికి కావలసిన ఏర్పాట్లను ఆ వ్యక్తి చేసినట్లు కనిపిస్తోంది. ఇక్కడ కనిపించే ఈ కుక్క పేరు 'సింబా'. సింబా వీడియోకు 4.53 లక్షలకు పైగా లైక్స్, 2300 కంటే ఎక్కువ కామెంట్స్ వచ్చాయి.

Royal Enfield Classic 500 With Sidecar For Pet Dog

మనుసులు కుక్కలకు ప్రేమించడం కొత్తేమీ కాదు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది కుక్కలను పెంచుకుంటున్నారు. వాటితో స్నేహం చేస్తున్నారు. వీటి కోసం లెక్కకు మించిన డబ్బు కూడా ఖర్చు పెడుతున్నారు. నిజానికి కుక్కలు చాలా తెలివైనవి.. మనుషులతో కలిసిపోయి ఎంతో విశ్వాసంగా ఉండటం అంటే అది కేవలం కుక్కకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి.

వీడియోలో కనిపించే సింబా మరియు దాని యజమాని ఎక్కడకు వెళుతున్నారు అనే విషయం తెలియదు. ఇంకా వారి ఎక్కడి ప్రాంతానికి చెందినవారనేది కూడా స్పష్టంగా వెల్లడి కాలేదు. కానీ సింబా, ఆ వ్యక్తిని నెటిజన్లు మాత్రం తెగ మెచ్చుకుంటున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ.. కుక్క కోసం బైకుకు సైడ్‌కార్ రెడీ చేసిన ఘటనలు చాలా అరుదు. కారులో తమతో పాటు కుక్కలను తీసుకెళ్లేవారు ఇప్పటికీ ఉన్నారు.

కేవలం కుక్క కోసం సైడ్‌కార్ ఏర్పాటు చేసాడు అంటే.. ఆ వ్యక్తిని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ విషయానికి వస్తే.. ఇది దూర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. భారతదేశంలోని రోడ్లకు ఈ బైక్ ఖచ్చితంగా సరైపోతుంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల, ఉత్తమ పనితీరుని అందించడం వల్ల ఎక్కువ మంది ఈ బైక్ కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 20, 2024, 9:35 [IST]
English summary
Royal enfield classic 500 with sidecar for pet dog
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+