యమహాగా ఉందిలే.. ఈ బైక్ ఏదో గుర్తుపట్టారా? చెప్పుకోండి చూద్దాం..

ఆధునిక కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. కొంత మంది వాహన ప్రేమికులు తమ బైకులను తమకు నచ్చినట్లు మోడిఫైడ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మోడిఫైడ్ బైకుల గురించి తెలుసుకున్న మనం, ఈ కథనంలో మరో మోడిఫైడ్ బైక్ గురించి వివరంగా తెలుసుకుందాం..

వెలుగులోకి వచ్చిన ఓ వీడియోలో మీరు గమనించినట్లయితే.. 'యమహా ఆర్‌డీ350' (Yamaha RD350) బైక్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన ఇంటర్‌సెప్టర్ 650 అని తెలుస్తోంది. చూడగానే యమహా ఆర్‌డీ350 బైక్ అనుకుంటారు, కానీ దీన్ని తీక్షణంగా పరిశీలిస్తే అసలు విషయం తెలిసిపోతుంది. ఈ బైక్ మోడిఫికేషన్ కర్ణాటకలో జరిగినట్లు తెలుస్తోంది.

Royal Enfield Interceptor 650 Bike Modified

ఈ బైక్ సింగిల్ పీస్ సీటు, కొత్త క్రోమ్ మిర్రర్లు వంటివి RD350 బైకును తలపిస్తాయి. ఈ బైక్ కొత్త పెయింట్ స్కీమ్ కూడా పొంది ఉండటం ఇక్కడ గమనించవచ్చు. అయితే బ్యాడ్జింగ్ గమనించినట్లయితే.. ఫ్యూయెల్ ట్యాంకు, ఎయిర్‌బాక్స్ కవర్ మీద ఇంటర్‌సెప్టర్ మరియు 650 వంటి బ్యాడ్జెస్ చూడవచ్చు. ఇందులో ప్రత్యేకంగా కనిపించే ఎగ్జాస్ట్ నోట్ కూడా కనిపిస్తుంది.

డ్యూయెల్ ఎగ్జాస్ట్ సెట్ కలిగిన ఈ బైక్ ప్రత్యేకమైన 2 స్ట్రోక్ సౌండ్ పొందుతుంది. అయితే ఈ సౌండ్ మొదటిసారి విన్న వారికి ఇది ఇంటర్‌సెప్టర్ 650 బైక్ అని గుర్తించడం కష్టం. ఎందుకంటే సౌండ్ కూడా యమహా ఆర్‌డీ350 బైక్ మాదిరిగానే వినిపిస్తుంది. మొత్తం మీద ఒకప్పుడు భారతదేశంలో ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకర్శించిన బైక్ మోడల్ యమహా ఆర్‌డీ350 మళ్ళీ ఇలా పుట్టుకురావడం చూపరులను తెగ ఆకర్శించేస్తోంది.

Royal Enfield Interceptor 650 Bike Modified

యమహా ఆర్‌డీ350 (Yamaha RD350)

మార్కెట్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన యమహా ఆర్‌డీ350 బైక్ 1973లో ప్రారంభమైందని తెలుస్తోంది. అప్పట్లో విపరీతమైన అమ్మకాలు పొందిన ఈ బైక్ 1983 - 1990 మధ్య ఎస్కార్ట్స్ గ్రూప్ రాజ్‌దూత్350 పేరుతో భారతీయ విపణిలో అసెంబుల్ చేసింది. ఈ బైక్ అప్పుడు హై టార్క్ మరియు లో టార్క్ అనే రెండు మోడళ్లలో అందుబాటులో ఉండేది.

హై టార్క్ వెర్షన్ 30.5 బీహెచ్‌పీ పవర్ అందిస్తే.. లో టార్క్ వెర్షన్ 27 బీహెచ్‌పీ ప్రొడ్యూస్ చేసింది. మెరుగైన ఇంధన పొడుపుకోసం ఇంజిన్ డీట్యూన్ చేయబడి ఉండటం వల్ల తక్కువ పవర్ అవుట్‌పుట్ ఉండేది. కంపెనీ ఈ బైక్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసే సమయానికి భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో వినియోగంలో ఉండేది. ఆ తరువాత వీటి సంఖ్య తగ్గినప్పటికీ.. ఇప్పటికి కూడా అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి.

భారదేశంలో యమహా ఆర్‌డీ350కి అభిమానులు ఉన్నారు అనటానికి నిదర్శనం మహేంద్ర సింగ్ ధోని. ధోని గ్యారేజిలో ఆర్‌డీ350 బైక్ కూడా ఉంది. మహేంద్ర సింగ్ ధోని వల్ల ఉన్న బైకు కస్టమైజ్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఇందులో సింగిల్ పీస్ సీటు, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ బాడీ ప్యానల్ హెడ్‌ల్యాంప్ కౌల్ మరియు రియర్ ఫెండర్‌లు, రౌండ్ అంబర్ టర్న్ ఇండికేటర్ హోసింగ్, ట్విన్ ఎగ్జాస్ట్ పైపులు చూడవచ్చు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, March 11, 2024, 9:57 [IST]
English summary
Royal enfield interceptor 650 bike modified to yamaha rd350
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+