హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..

ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. దేశంలో ప్రతి ఏటా లక్షల మంది రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భారీ జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోయినా, సీటు బెల్టు మర్చిపోయినా.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సిందే అంటూ పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల విశాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ జీసీ రాజరత్నం సరికొత్త నిభందనలు ప్రవేశపెట్టారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

విశాఖపట్టణంలో ప్రమాదాలను తగ్గించాలనే సదుద్దేశ్యంతో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేశారు. దీనికోసం ఆర్టీఏ బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ విషయాన్ని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన కేసులు ఏకంగా 1162 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ సంఖ్య మరింత తగ్గించడానికి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.

Without Helmet Rs 1000 Fine And Licences Will Be Suspended

నగరంలో ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా అమలు అయ్యేలా పోలీసులు చర్యలు తీసుకోవడం ఎప్పుడో స్టార్ట్ చేశారు. ముఖ్యంగా యువతలో చాలామంది హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయిందని వైజాగ్ పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ఇకపై హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తే రూ. 1000 జరిమానా విధించబడుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే రూ. 1000 జరిమానా మాత్రమే కాకుండా.. వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ చర్య బైక్ రైడర్లు బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బైక్ రైడర్లు తప్పకుండా హెల్మెట్ ధరించినట్లయితే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి రైడర్లు తప్పకుండా హెల్మెట్ ధరించాలి.

Without Helmet Rs 1000 Fine And Licences Will Be Suspended

విశాఖపట్టణం పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం కొంచెం కఠినంగా ఉందని కొందరు చెబతున్నారు. అయితే ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించేలా చూడాలంటే ఈ మాత్రం శిక్ష అవసరమే అని మరికొందరు చెబుతున్నారు. ఎవరైతే హెల్మెట్ ధరించలేదో వారిపట్ల పోలీసులు కనికరం లేకుండా ప్రవర్తించాలి. అప్పుడే అందరిలో మార్పు వస్తుంది. ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య కూడా తగ్గుతుందని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఇది సమాజహితమే ఆమె పలువురు ప్రశంసిస్తున్నారు.

యువత హెల్మెట్ ధరించడాన్ని కొంత ఇబ్బందిగా ఫీలవుతారు. నిజానికి హెల్మెట్ అనేది ప్రాణాలను రక్షించే ఓ అస్త్రం లాంటిది అని అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా.. ప్రమాదం జరిగితే, ఆ సమయంలో పెద్ద గాయలవుతాయి. ఆ సమయంలో తలకు బలమైన గాయమైతే.. అక్కడే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రైడర్ తప్పకుండా హెల్మెట్ కలిగి ధరించాలి.

హెల్మెట్ బైక్ రైడర్ యొక్క తల మరియు మెడ వంటి భాగాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఒకవేలా ప్రమాదం జరిగితే ఆ సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల తలకు గాయం అయ్యే అవకాశం 70 తక్కువ. మరణం నుంచి కూడా 42 శాతం తప్పించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే హెల్మెట్ ఎలా పని చేస్తుంది. ప్రమాదంలో ఎలా ప్రాణాలను కాపాడుతుంది అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, July 26, 2024, 12:30 [IST]
English summary
Rs 1000 fine and licence will be suspended for 3 months when you ride without helmet
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+