గంటకు రూ.1000 పార్కింగ్ ఫీజు.. అవాక్కయ్యారా!.. ఎక్కడో తెలుసుకోండి!
వెహికల్ పార్కింగ్ ఫీజు అనగానే వంద లేకుంటే రెండొందలు రూపాయలు ఉంటుందని అనుకుంటారు. కానీ ఇటీవల వెలుగుకి వచ్చిన సంఘటనలో గంటకు ఏకంగా రూ.1000 పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
నివేదికల ప్రకారం.. యూబీ సిటీ బెంగళూరులో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్స్ (ట్విటర్) యొజ్జర్ షేర్ చేసిన ఫోటోలలో గమనించినట్లయితే.. ప్రీమియం పార్కింగ్ ఫీజు గంటకు రూ. 1000 అని ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే గత పదేళ్లుగా అక్కడ ఇదే చార్జెస్ వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఇది బెంగళూరులోని యూబీ సిటీ షాపింగ్ మాల్‌లో ఈ నిర్వాకం బయటపడింది. నెట్టింట్లో వైరక్ అవుతున్న ఈ పోస్ట్ మీద పలువురు నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబ్బు సంపాదించాలనే వ్యూహంలో భాగంగానే మాల్ యాజమాన్యం ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఇందులో ఓ వ్యక్తి ఈ పార్కింగ్ ప్రదేశంలో నా నానో కారు పార్క్ చేయొచ్చా అని కామెంట్ చేశారు.
ఎక్స్ వేదికగా మరో వ్యక్తి ఫోర్స్చే, ఫెరారీ, లంబోర్ఘిని వంటి కార్ల యజమానులు గంటకు రూ. 1000 చెల్లించే అవకాశం ఉంది. కానీ ఆల్టో, వ్యాగన్ఆర్ వంటి చిన్న కార్లు పార్క్ చేసినప్పుడు పార్కింగ్ ఫీజు రూ.1000 చెల్లించాలంటే అది చాలా కష్టం, అలాంటప్పుడు కారును ఇంట్లో వదిలి బస్సులో రావడం మంచిదని ట్వీట్ చేశారు. మరొకరు బెంగళూరు శాన్‌ఫ్రాన్సిస్కోగా మారడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.

గత కొంత కాలంగా యూబీ సిటీ మాల్‌లో రూ. 1000 పార్కింగ్ ఫీజు అలాగే కొనసాగుతూనే ఉంది. 2012 నుంచి కూడా పలువురు ఈ ఘటన మీద వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఖరీదైన లగ్జరీ కార్లు, లేదా సూపర్ కార్లు సురక్షితంగా ఉండటానికి కారు ఓనర్లు ఇలాంటి పార్కింగ్ ఎంచుకుంటారు. చిన్న కార్లను కలిగి ఉన్న వ్యక్తులు ఇలాంటి పార్కింగ్ ఎంచుకోరు, ఎంచుకునే అవకాశం లేదు.
బెంగళూరు రోజు రోజు అభివృద్ధి చెందుతోంది. వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. వాహనాలు పెరగటం వల్ల షాపింగ్ మాల్స్ వద్ద పార్కింగ్ కూడా కొంత కష్టమైపోతోంది. దీనిని గమనించిన కొందరు షాపింగ్ మాల్ యాజమాన్యం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బు సంపాదించుకుంటున్నారు. పార్కింగ్ ఫీజులు ఎక్కువ కావడంతో కొందరు కార్లను ఇంటిదగ్గరే వదిలి మెట్రో లేదా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
ప్రీమియం పార్కింగ్ స్పాట్ కాకుండా.. మాల్ యాజమాన్యం సాధారణ కస్టమర్ల కోసం తక్కువ ఫీజుతో పార్కింగ్ అవకాశం అందిస్తున్నట్లు సమాచారం. అయితే బెంగళూరు వంటి నగరంలో కూడా గంటకు రూ. 1000 పార్కింగ్ ఫీజు చెల్లించడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. కానీ అత్యవసర సమయంలో ఎవరైనా ఉపయోగించుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఢిల్లీలో సైతం పార్కింగ్ ఫీజు నాలుగు గంటలకు 60 నుంచి 90 మాత్రమే కావడం గమనార్హం.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








