స్కూటర్ ఖరీదు రూ.45,000, నెంబర్ ప్లేట్ రూ.12 లక్షలు
వేలంపాటలో పది రూపాయల విలువ చేసే వస్తువును ఎవరైనా పది లక్షల రూపాయాలకు కొంటారా..? ఇలాంటివి సినిమాల్లోనే సాధ్యమవుతాయంటారా..? సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతుంటాయి. పంజాబ్‌లోని ఓ వ్యక్తి కేవలం రూ.45,000 విలువ చేసే అతని స్కూటర్ కోసం రూ.12 లక్షల ఖరీదైన ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కొనుగోలు చేసి అందరినీ విస్మయానికి గురి చేశాడు.
పంజాబ్‌లోని ముక్స్తర్‌కు చెందిన రికీ బ్రార్ అనే యువ రైతు "PB 30 J 0003" అనే విఐపి నెంబర్ కోసం వేలంలో రూ.12 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు. ప్రిస్టీజ్ కోసం రికీ తన చేతులు కాల్చుకున్నాడు. రికీ ప్రత్యర్థి తన మెర్సిడెస్ బెంజ్ కారుకు ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం వేలంలో పాల్గొన్నాడు. ఈ నెంబర్ కోసం అతను పది లక్షల వరకూ పలిగి ఆగిపోవటంతో రికీ తన రూ.45,000 ఎల్ఎమ్ఎల్ స్కూటర్ కోసం రూ.12 లక్షలు చెల్లించాల్సి వచ్చింది.
నెంబర్ 3, 7 లంటే తనకు చాలా క్రేజ్ అని, తన స్కార్పియో కార్ కోసం ఇప్పటికే 0007 నెంబర్‌ను సొంతం చేసుకున్నానని రికీ బ్రార్ చెప్పుకొచ్చాడు. వెర్రి వేయి విధాలంటారు. అందులో ఇది కూడా ఒకటేమో.


Click it and Unblock the Notifications









