బాలయ్య లెజెండ్ మూవీ కోసం రూ.20 లక్షల స్పెషల్ బైక్

By Ravi

టాలీవుడ్ సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో ‘లెజండ్' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో మన హీరో కోసం నిర్మాతలు ఓ లెజెండ్ లాంటి బైక్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. అమెరికన్ ఆటో దిగ్గజం హ్యార్లీ డేవిడ్‌సన్ కంపెనీకి చెందిన ఓ లగ్జరీ బైక్‌ను బాలయ్య కోసం స్పెషల్‌గా కస్టమైజ్ చేయించారు.

ఈ కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్ కోసం సుమారు రూ.20 లక్షలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఫ్యూయెల్, ట్యాంక్, బాడీ పెయింట్‌, సీట్ హైట్ వంటి అంశాలను ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. పసుపు రంగులో ఉండే ఈ హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌పై లెజెండ్ (LEGEND) అని నలుపు రంగులో ఆంగ్ల అక్షరాలతో రాసి ఉంటుంది. అలాగే ఇంజన్ భాగంలో కూడా 'ఎల్' (లెజెండ్ అని అర్థం) అనే అక్షరం కనిపిస్తుంది.
మరిన్ని సెలబ్రిటీ బైక్‌ల కోసం ఈ లింక్‌‌పై క్లిక్ చేయండి

లెజెండ్ చిత్రంలోని ఓ పాట కోసం ఈ బైక్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. మన బాలయ్య ఇష్టపడి మరీ పసుపు రంగు కలర్‌ను ఎంచుకున్నారట. అంతేకాదండోయ్.. ఈ చిత్రంలో బాలక్రిష్ణ కోసం బోయపాటి శ్రీను ప్రత్యేకంగా ఓ సఫారీ కారును కూడా డిజైన్ చేయించాడటు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ విశాఖ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 30 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.

వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 7, 2013, 18:00 [IST]
English summary
A source from the production team of Legend has revealed Balakrishna will be seen riding custom-made Harley Davidson. "Balakrishna will be seen riding a Harley Davidson bike in one of the songs. It has been custom-made especially for the song and it cost the producers Rs.20 lakh. He (Balakrishna) also chose the colour of the bike as yellow for personal reasons," IANS quotes the source as saying.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+