కాలి బూడిదైపోయిన రూ.25 కోట్ల విలువైన కారు.. కంపెనీ ఏం చేసిందో తెలుసా?
అప్పుడప్పుడు కార్లు ప్రమాదానికి గురవ్వడం.. ఆ ప్రమాదాల్లో పూర్తిగా ధ్వంసమవ్వడం జరుగుతూ ఉంటాయి. ఇందులో ఎక్కువగా అగ్ని ప్రమాదాల వల్ల కార్లు పూర్తిగా నాశనమవుతూ ఉంటాయి. దీనికి కారణాలు కోకొల్లలుగా ఉంటాయి. వాహనాల్లో ఏర్పడే సాంకేతిక లోపాల వల్ల కార్లలో మంటలు చెలరేగుతూ ఉంటాయి. ఇది ఎక్కువగా సూపర్ కార్లలో జరుగుతూ ఉంటాయి. ఇటీవల ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సుమారు రూ. 25 కోట్ల విలువైన కారు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది. అయితే కంపెనీ కాలిపోయిన కారుకు బదులుగా మళ్ళీ అలంటి కారును ఉచితంగా వినియోగదారునికి అందించనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..
నివేదికల ప్రకారం కోయినిగ్‌సెగ్ జెస్కో (Koenigsegg Jesko) సూపర్ కారు అనుకోకుండా మంటల్లో చిక్కుకుంది. వాహన వినియోగదారుడు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా మంటలు చెలరేగటం వల్ల కారు ప్రమాదంలో చిక్కుకుంది. మొత్తం కాలి బూడిదైపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కారు మంటల్లో కాలిపోవడం వల్ల కంపెనీ కస్టమర్‌కు ఉచితంగా మరో కారును అందించనుంది.

కోయినిగ్‌సెగ్ జెస్కో అనేది ఓ లిమిటెడ్ ఎడిషన్ హైపర్‌కార్. నిజానికి జెస్కో అబ్సోలట్ ప్రస్తుతం అత్యంత వేగవంతమైన కారుగా ప్రపంచ రికార్డును కలిగి ఉంది. ఈ హైపర్‌కార్ కేవలం 18.82 సెకన్లలో గంటకు 0 నుంచి 400 కిమీ వరకు వేగవంతం అవుతుంది. వేగం మాత్రమే కాకుండా ఇది 400 నుంచి 0 కిమీ/గం చేరుకోవడానికి 28.27 సెకన్ల సమయం మాత్రమే పట్టింది.
మంటల్లో చిక్కుకున్న కారు కోయినిగ్‌సెగ్ జెస్కో నూర్ ఎడిషన్. జెస్కో నూర్ ఎడిషన్ కార్బన్ ఫైబర్ బాడీవర్క్‌ను గోల్డ్ కలర్ యాక్సెంట్స్, కార్బన్ వీల్స్ మరియు గోల్డ్ బ్రేక్ కాలిపర్‌లతో ఉంది. కారు హైవేపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే, కంపెనీ దీనికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏ హాని జరగలేదు. కారు మాత్రం కాలి బూడిదైపోయింది.

కారులో మంటలు చెలరేగటానికి ప్రధాన కారణం.. హైపర్‌కార్‌లో వెనుక భాగంలో ఉన్న ప్రెషరైజ్డ్ హైడ్రాలిక్ గొట్టంలో ఏర్పడిన లోపం అని కోయినిగ్‌సెగ్ సీఈఓ క్రిస్టియన్ వాన్ కోయినిగ్‌సెగ్ ప్రకటించారు. కాబట్టి కంపెనీ ఈ కార్లను తనిఖీ చేయడానికి సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా 28 మంది మాత్రమే ఈ కారును కలిగి ఉన్నారు. కంపెనీ వీరిని స్వయంగా కలిసి, కార్లను చెక్ చేస్తుంది. లోపం ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే పరిష్కరించడం జరుగుతుంది.
కోయినిగ్‌సెగ్ జెస్కో 5.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్ పొందుతుంది. ఇది 1280 పీఎస్ పవర్ మరియు 1500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది మిడ్ ఇంజిన్ హైపర్‌కార్. కాబట్టి ఇంజన్ 9 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
స్వీడిష్ కార్ల తయారీ సంస్థ అయిన కోయినిగ్‌సెగ్ యొక్క కార్లు భారతదేశంలో అందుబాటులో లేదు. అయితే గతంలో.. కొన్ని సంవత్సరాల క్రితం కంపెనీ అగెరా కారును తీసుకువచ్చింది. దీనిని భారతీయ మీడియా సమక్షంలో ప్రదర్శించింది. అప్పట్లో ఈ కారు ధర రూ. 11.5 కోట్లు. అయితే కంపెనీ తీసుకువచ్చిన ఈ కారును ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. దీంతో కంపెనీ మళ్ళీ వెనుదిరిగింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








