గోవాలో ఈ కారు కొన్న మొదటి ఫ్యామిలీ ఇదే!.. దీని రేటెంతో తెలుసా?

కొత్త కారు కొనాలని చాలా మందికి ఉంటుంది, కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే వాహనాలను కొనుగోలు చేయడం ధనవంతులకు పెద్ద విషయమేమి కాదు. ఈ నేపథ్యంలో భాగంగానే.. ఇటీవల గోవాకు చెందిన ఒక ఫ్యామిలీ ఓ బెంజ్ కారును కొనుగోలు చేసింది. నిజానికి ఈ మోడల్ కారు గోవాలో ఇంతకు ముందు లేదు. కాబట్టి 'మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్' (Mercedes Benz S-Class) ఫస్ట్ ఓనర్‌గా వారు రికార్డ్ క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. రండి.

గోవా ఫ్యామిలీ మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్ కొనుగోలు చేసిన తరువాత.. దానిని డీలర్‌షిప్ డెలివరీ చేయడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కస్టమర్ రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నట్లు ప్రారంభమయ్యే ఈ వీడియోలో.. కారు మీద ఉన్న గుడ్డను తొలగించడం, కేక్ కట్ చేయడం వంటివి చూడవచ్చు. ఆ ఫ్యామిలీ మొత్తం సంతోషంతో డ్రింక్స్ వంటివి తీసుకోవడం కూడా ఇక్కడ చూడవచ్చు.

Mercedes Maybach Sedan Delivery in Goa

వీడియోలో కనిపించే కారు ధర రూ. 3.5 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటం చూడవచ్చు. ఈ కారును డెలివరీ చేసిన తరువాత యజమానికి మేబ్యాచ్ కారుకు సంబంధించిన తాళం అందించారు. ఆ తరువాత కారు ఓనర్ కారు డోర్ ఓపెన్ చేసి.. లోపలి వెళ్లారు. సేల్స్ రిప్రజెంటేటివ్ వెహికల్.. దాని ఫీచర్లు మరియు దాని విధుల గురించి వివరించారు.

కారు లోపల నిలువగా ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉండటం చూడవచ్చు. యాంబియంట్ లైటింగ్‌తో అందమైన క్యాబిన్‌.. డిజిటల్ లైట్స్, సెకండ్ రో సీట్లు, ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మొదలైనవన్నీ ఇక్కడ చూడవచ్చు. ఈ కారు యొక్క వెనుక సీటులో ఓనర్ బ్యార్య కూడా ఉండటం ఇక్కడ గమనించవచ్చు. వీడియోలో కారు యొక్క ఫీచర్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా ఆస్వాదించవచ్చు.

Mercedes Maybach Sedan Delivery in Goa

ఇక మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ విషయానికి వస్తే.. ఇది ఎస్580 మరియు ఎస్680 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 2.7 కోట్లు మరియు రూ. 3.43 కోట్లు. ఇవి రెండూ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అద్భుతమైన పనితీరును అందించేలా రూపొందించబడి ఉంటాయి. కాబట్టి ఈ లగ్జరీ కార్లను సెలబ్రిటీలు సైతం ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్580 ఈక్యూ బూస్ట్‌తో కూడిన 4.0-లీటర్ వీ8 ట్విన్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ పొందుతుంది. ఇది 496 Bhp పవర్ మరియు 700 Nm టార్క్ అందిస్తుంది. ఇక ఎస్680 వేరియంట్ 6.0-లీటర్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 604 Bhp పవర్ మరియు 900 Nm టార్క్ అందిస్తుంది. రెండు వేరియంట్‌లు 9-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

బెంజ్ కార్లకు భారతీయ మార్కెట్లో డిమాండ్ భారీగానే ఉంది. ఈ కారణంగానే చాలామంది ధర ఎక్కువైనా ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కార్లను లేదా అప్డేటెడ్ కార్లను మార్కెట్లో లాంఛ్ చేస్తూ.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. అదే సమయంలో మరింతమంది కస్టమర్లను ఆకర్షిస్తోంది. కంపెనీ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా తన హవా చూపిస్తోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, June 3, 2024, 11:30 [IST]
English summary
Rs 3 5 crore mercedes maybach sedan delivery in goa
Read more on: #off beat #new car #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+