Video Viral RTC బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి 15 అడుగుల కిందకు పడిన బస్సు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం పరిధిలోని ఢిల్లీ - మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర ప్రదేశ్‌ ఆర్టీసీ బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం 15 అడుగుల కింద పడిపోయింది. గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో బస్సులో 50కి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సుమారు 20కిపైగా గాయపడినట్లు సమాచారం. ఎక్స్‌ప్రెస్‌ వే పైన ప్రయాణం చేస్తున్న ఆర్టీసీ బస్సు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టింది. అప్పటి వరకు సాఫీగా సాగిన ప్రయాణం ఒక్కసారిగా ప్రయాణికుల అరుపులతో ముగిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

RTC Bus falls from Delhi Meerut expressway

ఈ ప్రమాదం అనంతరం స్థానికులు రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడారు. అనంతరం కాసేపటికే పోలీసులు వచ్చి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. అప్పటి వరకు సురక్షితంగా ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా లేన్ మారింది. అలా క్రమంగా ఎడమవైపునకు వెళ్లిపోవడం వీడియోలో గమనించవచ్చు. అనంతరం రోడ్డు డివైడర్‌ను ఢీకొని పక్కకు పడిపోయింది.

ఈ బస్సు ప్రమాద ఘటనపై పోలీసుల ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మద్యం మత్తులో లేడని తెలిపారు. అయితే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలుస్తోంది. మీరట్‌ డిపో నుంచి ఘజియాబాద్‌లోని కౌశాంబికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

RTC Bus falls from Delhi Meerut expressway

ఈ ఘటనలో డ్రైవర్‌, కండక్టర్‌లకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. బస్సు ఎక్కి పడుకున్నా అని, కొంత సేపటికి కిటికీ నుంచి నా చెయ్యి బయటకు వచ్చిందని, బస్సు ప్రమాదం జరిగిందని అప్పుడే తెలిసిందని, అంతలోనే తొటి ప్రయాణికులు అరుపులు వినిపించాయని ఓ ప్రయాణికులు తెలిపారు.

అయితే ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ తనకు గుండెపోటు వచ్చినా.. భారీ ప్రమాదం జరగకుండా డ్రైవర్‌ బస్సును నియంత్రించినట్లు తెలుస్తోంది. లేకుంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. అదే జరిగితే బస్సులు ఉన్న ప్రయాణికులు భారీగా గాయపడి ఉండేవారు. ప్రస్తుతం 20 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది.

RTC Bus falls from Delhi Meerut expressway

ఢిల్లీ- మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై బస్సు ప్రమాదం సమయంలో అదే రోడ్డుపై రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. అయితే బస్సు నేరుగా ఎడమవైపునకు తిరుగుతున్న సమయంలో వెనుక ఉన్న వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగానే వ్యవహరించారు. తమ వాహనాల వేగాన్ని నియంత్రించారు. ఫలితంగా ప్రమాద తీవ్రత తగ్గింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, September 15, 2023, 12:51 [IST]
English summary
Rtc bus falls from delhi meerut expressway video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+