పుతిన్ ఆవిష్కరించిన ఈ విమానం 2 గడియల్లో భూమ్మీద ఏ మూలకైనా చేరుకోగలదు

By Anil

తమ దేశ ప్రజల రక్షణను పెంచుకునేందుకు కొన్ని దేశాలు చేసే ప్రయత్నాలు ప్రపంచాన్నే నాశనం చేసే స్థాయిలో ఉన్నాయి. అందుకు నిదర్శనం ఈ కథనం. రష్యా ప్రధాని పుతిని ఆవిష్కరించిన హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్ విమానం కేవలం రెండు గంటల్లోనే ప్రపంచంలోని ఈ మూలకైనా చేరుకోగలదు. అంతరిక్షం నుండి నిర్ధేశించిన భూభాగం మీద ఖచ్చితంగా అణుదాడులను నిర్వహించే లక్షణాలను కలిగి ఉంది ఈ విమానం.

పెఎకె-డిఎ గా పిలువబడే ఈ టెస్ట్ విమానాన్ని ఇప్పటికే పరీక్షించారు, దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

ఈ భూమ్మీద అంతరిక్షాన్ని కొద్ది కొద్దిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్న దేశాలలో రష్యా ఒకటి. అందుకు ముఖ్య కారణం ఆ దేశ ప్రధాని వ్లాదిమిర్ పుతిన్. కేవలం భూ మరియు సముద్రం మార్గం ద్వారా మాత్రమే కాకుండా తమ సైన్యానికి అంతరిక్షం నుండి మరింత బలాన్ని చేకూర్చుతున్నాడు.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

అంతరిక్షం ఆధారంగా రష్యా అభివృద్ది చేస్తున్న అధునాతన విమానాలలో హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్ ఒకటి. దీని ద్వారా అంతరిక్షం నుండి ఖచ్చితంగా నిర్దేశించిన భూ మండలం మీద అణు దాడులను జరపవచ్చు.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

శబ్దం ప్రయాణించే వేగం కన్నా ఐదు రెట్ల అధిక వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ హైపర్‌సోనిక్ రాకెట్ జెట్ కేవలం రెండే గంటల్లో భూమ్మీద ఉన్న ఏ ప్రాంతానికైనా చేరుకుంటుంది.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా పురుడు పోసుకున్న ఇది ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఇది న్యూక్లియర్ వార్‌హెడ్‌ను జారవిడిస్తే అది భూమిని చేరో లోపు ఈ విమానం రష్యా స్థావరానికి చేరుకుంటుంది.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

దీనికి కావాల్సిన ఇంజన్‌ పూర్తి స్థాయిలో 2020 నాటికి అభివృద్ది చేయనున్నట్లు, ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్న కోలోనెల్ సోలోడోవ్‌నికోవ్ అనే ఇంజనీరు తెలిపాడు.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

ఈ ప్రాజెక్ట్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇది భూ మండలం నుండి ఒక్కొక్క విభాగాన్ని దాటుకుంటూ భూమికి అతి దూరంగా అంతరిక్షంలోకి కూడా వెళ్లగలదని తెలిపాడు.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

పిఎకె-డిఎ బాంబర్ విమానంలో వినియోగించనున్న ఇంజన్‌ను మాస్కో సమీపంలో 2016 అక్టోబరులో జరిగే అంతర్జాతీయ మిలిటరీ టెక్నాలజీ ఫోరంలో ప్రదర్శించనున్నారు.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

రష్యా యొక్క వ్యూహాత్మక క్షిపణి దళాల కమాండర్‌ మాట్లాడుతూ దీనిని ఒక అంచనా కోసం ప్రయోగించి పరీక్షించాము. అయితే దీనిని మరింత అభివృద్ది చేయాల్సి ఉంది. 2020 నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

వ్యూహాత్మక క్షిపణి దళం అకాడమీ వారి కథనం ప్రకారం, ఇది రెండు రకాలుగా ఆపరేట్ చేయబడుతుంది. సాధారణ విమానాలు రీతిలో తిరిగే సమయంలో కిరోసిన్‌ను ఇంధనంగా వినియోగించుకుంటుంది. అయితే భూమి మీద ఉన్న కక్ష్యలను దాటి అంతరిక్షంలో వెళ్లేటపుడు మీథేన్ మరియు ఆక్సిజన్‌ను ఇంధనంగా వినియోగించుకుంటుంది.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

ప్రపంచంలోని ఏ మూలకైనా కేవలం రెండు గంటల్లోపే ప్రయాణించే వీలున్న విమానానికి ఇంజన్ తయారు చేయడానికి బ్రిటిష్ కూడా సుమారుగా 7.5మిలియన్ పౌండ్లను పెట్టుబడిగా పెట్టింది.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

వేగం పరంగా ఇది మ్యాక్ 5 వేగంతో ప్రయాణిస్తుంది. అంటే శబ్దం యొక్క వేగం కన్నా ఐదు రెట్లు అదికంగా లేదంటే అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

రష్యా అభివృద్ది చేస్తోన్న హైపర్‌సోనిక్ జెట్‌కు అతి సమీప పోలికలు ఉండే స్టెల్త్ బాంబర్‌ను బ్రిటన్‌ కూడా రూపొందిస్తోంది.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

ఈ ప్రాజెక్ట్ మీద బ్రిటన్ సుమారుగా 200 మిలియన్ పౌండ్లను పెట్టుబడిగా పెట్టినట్లు తెలిసింది.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

అత్యాధునికంగా రూపొందుతున్న దీనిని బిఎఇ సిస్టమ్స్ వారు డెవలప్ చేస్తున్నారు.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

రెండు గంటల్లోపు ప్రపంచంలోని నలుమూలలకు వెళ్లే ఈ విమానం ద్వారా అణు బాంబుల దాడులు నిర్వహించే బదులు ఆకలితో అలమటించి మరణించే వారికి సరైన సమయంలో ఆహారాన్ని అందించి వారి ప్రాణాలు కాపాడటానికి ఇలాంటి వాటిని వినియోగిస్తే ఎంతో బాగుటుంది. తద్వారా ఆకలి చావులయినా తగ్గుతాయి. దీనికి మీరేమంటారు.

హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

  • ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం
  • హైపర్‌సోనిక్ స్టెల్త్ బాంబర్

    • ISIS తీవ్రవాదుల అంతానికి ఇవే సరైన విమానాలు అంటున్న అమెరికా

Most Read Articles

English summary
Putin Reveals Hypersonic Stealth Bomber That Can Travel Anywhere In The World In Two Hours
Story first published: Tuesday, July 19, 2016, 16:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X