రష్యా ఆయుధగారంలోకి వచ్చి చేరిన శక్తివంతమైన యుద్ద వాహనం
వాహన రంగం ప్రపంచానికి పరిచయం అయిన తరువాత రక్షణ రంగంలో వీటిని అనేక రకాల వినియోగించడం మొదలు పెట్టారు. రకరకాలుగా డిజైన్ చేసుకు చాలా దేశాలు తమ సైన్యానికి అందిస్తున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు నూతన వాహనాల తమ దేశ రక్షణ సైన్యానికి అందిస్తున్నవాటిలో రష్యా ఒకటి మరియు మొదటిది కూడా. ఎందుకంటే సరికొత్త డిజైన్‌తో తయారైన కాంబాట్ యుద్ద వాహనాలను పుతిని పరీక్షించి మరీ సైన్యానికి అందించాడు.
రష్యా సమకూర్చుకున్న ఆధునిక యుద్ద వాహనాల గురించి క్రింది శీర్శిక ద్వారా తెలుసుకుందాం రండి.

రష్యా సమకూర్చుకున్న వాటిలో అత్యంత శక్తివంతమైనది ఈ కమజ్ ట్రక్ (Kamaz). అయితే ఢకార్ ర్యాలీలోని ట్రక్కులను గుర్తు చేసే డిజైన్‌ను పోలి ఉంది ఇది. కాని దీనిని ముందు నుంచి చూస్తే వికింగ్ పేరుతో మనకు కనపడుతుంది.

ఈ కమజ్ ట్రక్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ తో చేశారు. దీనిని KAMAZ-4911 ఎక్ట్ర్సీమ్ ఆధారంతో రూపొందించారు. అయితే దీనిని రూపాన్ని అంతర్జాతీయ ట్రక్ ర్యాలీ కోసం డిజైన్ చేశారు, కాని రష్యా దీనికి మరిన్ని మార్పులు చేసి రష్యా సైన్యం కోసం డిజైన్ చేసుకున్నారు.

పుతిన్ పరిశీలించిన రెండవ వాహనం జడ్‌ఐఎల్ కరాటెల్ ZDIL (karatel), దీనిని పనిషర్ అని కూడా నామకరణం చేశారు. మీరు దీని డిజైన్ తీరును గమనిస్తే చాలు సైనికుల భద్రత పరంగా ఎంతో అడ్వాన్స్‌డ్‌గా రూపొందించారని తెలుస్తుంది.

ఈ పనిషర్ యుద్ద వాహనం క్లాస్ 6ఎ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. మరియు వి ఆకారంలో గల దీని బాడీ డిజైన్ శత్రువుల మీద బాంబు దాడి చేయడానికి ఎంతో అనువుగా ఉంటుంది.

ఈ వాహనంలో దాదాపుగా 10 మంది వరకు సైనికులు కూర్చోవచ్చు. అంతే కాకుండా 360 డిగ్రీల కోణంలో గల బాహ్య ప్రపంచాన్ని గమనించడానికి సైనికులు ప్రత్యేక వ్యూవ్‌ను కల్పించి మరీ దీనిని డిజైన్ చేశారు. తద్వారా శత్రువులు అలజడిని స్పష్టంగా పరిశీలించవచ్చు.

పనిషర్‌లోని వెనుక వైపున ప్రత్యేకమైన రంధ్రాలను అందించారు. దీని ద్వారా సైనికులు తుపాకుల ద్వారా శత్రువులను అంతం చేయవచ్చు. అంతే కాకుండా దీని రూఫ్ పైన రివాల్వింగ్ హ్యాచ్ గన్నర్ కలదు ఇది కూడా కాల్పులు జరుపుతుంది.

ఆధునిక యుద్ద వాహనాలను పరిశీలించడానికి వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఎఫ్‍ఎస్‌బి డైరెక్టర్ అలెగ్జాండర్ బార్ట్‌నికోవ్ మరియు రష్యా రక్షణ మంత్రి సెర్జీ షోయిగ్ లు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, రష్యా మీదకు దాడులకు తెగబడుతున్న తీవ్రవాదులను అరికట్టడంలో ఎఫ్‌ఎస్‌బి చాలా బాగా పనిచేస్తోందని తెలిపాడు.

- ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం....?
- న్యూక్లియర్ సబ్‌మెరైన్‌తో మరింత బలమైన భారత్
- మానవ రహిత బోటును ప్రారంభించిన ఇజ్రాయెల్ దీనితో ఎప్పటికైనా ముప్పే అంటున్న నిపుణులు
- ఊహలకందని రోడ్లు, వంతెనలు భారతీయ ఇంజనీర్ల సామర్థ్యం.....!!
- యుద్దానికి సిద్దమైన ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ మరియు నేవీ



Click it and Unblock the Notifications