ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా..! అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి?

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం అయిన ఆంటోనోవ్ ఏఎన్-225 'మ్రియా' (Antonov AN-225 Mriya) ను రష్యా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి, వేలాది మంది రష్యా సైనికులను సరిహద్దుల గుండా ఉక్రెయిన్ పంపి యుద్ధం సాగిస్తున్న సంగతి తెలిసినదే. గత నాలుగు రోజులుగా ఉక్రేనియన్ మరియు రష్యా దళాల మధ్య జరుగుతున్న యుద్ధంలో, పౌరులతో సహా వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా..! అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి?

ఈ యుద్ధంలో హోస్టొమెల్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా సైనిక దళం అక్కడ ఉన్న 'ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా విమానం' (largest transport plane in the world) అయిన ఆంటోనోవ్ AN-225 'మ్రియా' ను ద్వంసం చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన కార్గో విమానం. ఇద్దరు ఆంటోనోవ్ ఉద్యోగులు ఉక్రేనియన్ రేడియో స్వోబోడాతో మాట్లాడుతూ దాడిలో హ్యాంగర్‌లో మంటలు చెలరేగి విమానం కాలిపోయిందని తెలిపారు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా..! అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి?

గత నివేదికల ప్రకారం, అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయాన్ని పెద్ద మొత్తంలో రవాణా చేయడానికి ఈ కార్గో విమానాన్ని ఉపయోగించే వారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఈ విమానం యొక్క ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా, ఆయన ప్రస్తావిస్తూ, తాను ఇంకా దేశం వదిలిపెట్టదని పేర్కొన్నారు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా..! అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి?

ఆయన తన ట్వీట్ లో "ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, ఏఎన్-225 'మ్రియా' (ఉక్రేనియన్‌లో 'డ్రీమ్' అని అర్థం). రష్యా మన 'మ్రియా'ని నాశనం చేసి ఉండవచ్చు. కానీ వారు బలమైన, స్వేచ్ఛా మరియు ప్రజాస్వామ్య యురోపియన్ రాజ్యానికి సంబంధించిన మా కలను ఎప్పటికీ నాశనం చేయలేరు. మేము విజయం సాధిస్తాము!" అన్ పేర్కొన్నారు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా..! అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి?

మ్రియా ఓ చారిత్రాత్మక కార్గో వాహనం. దీనిని ఉక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్ రూపొందించారు. విమానయాన సంస్థ విమానాన్ని దీనిని డెడ్ లిఫ్ట్ అని కూడా పిలిచేది. అత్యంత బరువైన వస్తువులను కూడా సులభంగా హ్యాండిల్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది కాబట్టి వారు దీనిని ఏఎన్225 మ్రియా అని పిలుస్తారు. ఈ విమానంలో ల్యాండింగ్ సిస్టమ్ కోసం మొత్తం 32 చక్రాలను ఉపయోగించారు. ఇది 250 టన్నుల వరకు వస్తువులను మోయగలదు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా..! అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి?

అంతేకాకుండా, ఇది ఒక్కసారి గాలిలోకి ఎగిరితే సుమారు 4,500 కి.మీ వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాంటి అద్భుతమైన కార్గో విమానాన్ని రష్యా ధ్వంసం చేసింది. మ్రియా పొడవు 84 మీటర్లు. అంటే విమానం పొడవు 276 అడుగులు. అందుకే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విమానంగా గుర్తింపు పొందింది. ఇది గంటకు 850 కి.మీ వేగంతో గాలిలో దూసుకుపోగలదు. ఉక్రేనియన్ భాషలో 'మ్రియా' అంటే 'కల' (ఇంగ్లీష్ లో డ్రీమ్) అని అర్థం. ఈ గొప్ప కల ఇప్పుడు చెదిరిపోయింది.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా..! అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి?

అయితే, ఈ ధ్వంసమైన విమానం యొక్క చిత్రం మరియు ఎంత మేర నష్టం జరిగిందనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. ఆంటోనోవ్ తన ట్విట్టర్ పేజీలో విమానం "నిపుణుల చేతుల్లో ఉంది. వారు మొత్తం నష్టాన్ని పరిశీలిస్తున్నారు. వివరణాత్మక క్రాష్‌లను త్వరలో విడుదల చేస్తారు" అని పోస్ట్ చేసారు. కీవ్ హాస్టోమెల్ విమానాశ్రయంలో రష్యా విమానాన్ని ధ్వంసం చేసింది. విమానం యొక్క పునరుద్ధరణకు దాదాపు 3 బిలియన్ల వరకు ఖర్చవుతుందని అంచనా.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా..! అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి?

విపత్తుల సమయంలో ఈ విమానం ప్రపంచానికి ఎంతగానో సహాయపడింది. ప్రత్యేకించి, కరోనా మహమ్మారి సమయంలో వివిదే దేశాలు అవసరమైన వైద్య పరికరాలు, మందులు, ఆహారం వంటి వాటిని రవాణా చేయడంలో ఇది కీలక పాత్ర పోషించింది. మ్రియా 1988లో తొలిసారిగా గాలిలోకి ఎగిరింది. సోవియట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ విమానం తయారు చేయబడింది. ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా కొన్నాళ్లుగా విమానం మానవరహితంగా మిగిలిపోయింది.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా..! అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి?

అసలు రష్యాకి మరియు ఉక్రెయిన్‌కి మధ్యం యుద్ధం ఎందుకు జరుగుతోంది?

ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు సిద్ధంగా ఉందని పుతిన్‌కు అనుమానం రావడమే ఈ యుద్ధానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఉక్రెయిన్ దేశంలో ఐరోపా యూనియన్‌తోపాటు నాటోలో చేరే దిశగా చేస్తున్న ప్రయత్నాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్ అలా చేయడం వలన అది పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ నాటోలో చేరకుండా, తటస్థ దేశంగా ఉండాలనేది ఆయన ప్రధాన డిమాండ్.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా..! అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి?

అసలు నాటో అంటే ఏమిటి?

నాటో (NATO) పూర్తి పేరు నార్త్ అట్లాంటిక్ ట్రిటి ఆర్గనైజేషన్. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ దేశాలతో సహా దాదాపు 12 దేశాలతో ఏర్పాటైన ఓ సైనిక కూటమి. ఈ సైనిక కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్ ఉత్సాహంతో ఉంది. అదే ఇప్పుడు పుతిన్‌కు నచ్చడం లేదు. ఇందుకు ఓ బలమైన కారణంగా ఉండి. అదేంటంటే, ఈ సైనిక కూటమిలోని ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా, మిగతా సభ్య దేశాల అన్నీ కూడా దాడి చేయబడిన నాటో సభ్య దేశానికి పూర్తి సహాయం అందించాలన్నది నాటో లో ఉన్న ప్రధాన ఒప్పందం.

Article Published On: Monday, February 28, 2022, 17:02 [IST]
English summary
Russian forces destroyes worlds largest cargo plane antonov 225 mriya reports
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+