Just In
- 2 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 5 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 6 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 7 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Sports
సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్.. ఐపీఎల్ 2021 నుంచి స్టార్ పేసర్ ఔట్! ఆందోళనలో ఫాన్స్!
- News
కరోనా వేళ అమెరికాతో భారీ ఒప్పందం -‘ఇండియా-యూఎస్ క్లైమెట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా’ ప్రకటించిన ప్రధాని మోదీ
- Finance
Forbes 30 under 30 list: ఇద్దరు హైదరాబాదీలకు చోటు
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పార్కింగ్ సమయంలో కంట్రోల్ తప్పిన పోర్స్చే మాకాన్ ; తృటిలో తప్పిన ప్రమాదం
వాహనాలను పార్క్ చేసేటపుడు అప్పుడప్పుడు అనుకోని కొన్ని సంఘటనల వల్ల అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. కార్లను పార్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఖరీదైన లగ్జరీ కార్లను ఎత్తైన భవనాల్లో పార్కింగ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలు జరుగుతాయి.

పోర్స్చే యొక్క అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి మకాన్. రష్యాకు చెందిన ప్రముఖ ఐస్ హాకీ ఆటగాడు డెనిస్ కజియోనోవ్ ఎత్తైన భవనంలో మకాన్ కారును పార్కింగ్ చేస్తున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. అతను తన భార్య మరియు కొడుకుతో షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. కొడుకు వెనుక సీట్లో ఉండగా డెనిస్ మరియు అతని భార్య కారు ముందు కూర్చున్నారు.

అతను ఆ ఎత్తైన భవనంలోని కార్ పార్కింగ్ స్థలానికి వెళ్ళాడు. మూడవ అంతస్తులో పార్కింగ్ చేస్తున్నప్పుడు పోర్స్చే మకాన్ కారు అకస్మాత్తుగా కంట్రోల్ తప్పిపోయింది. కంట్రోల్ తప్పిపోవడం వల్ల ఆ ఎత్తైన భవనం యొక్క విండో గ్లాస్ పగులగొట్టుకుని బయటకు వచ్చింది. దీని మీరు ఈ ఫొటోలో చూడవచ్చు.

కానీ కారు ముందు భాగం గాజు కిటికీలో నుంచి బయటకు వచ్చింది. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. నివేదికల ప్రకారం డెనిస్ తన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో దీనిని పోస్ట్ చేశారు. తానూ బ్రేక్‌లు నొక్కిపట్టినప్పటికీ కారు కదులుతూనే ఉంది. ఆ సమయంలో ఆ కారు భవనం గ్లాసును పగులగొట్టి బయటకు వచ్చింది. ఆ సమయంలో చాలా ఆందోళన చెందామని ఆయన అన్నారు.
MOST READ:ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

ఈ సంఘటన యొక్క వీడియో మరియు ఫోటోలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, భవనం గ్లాసు నుండి వేలాడుతున్న కారును కనుగొన్నారు.
పోర్స్చే మాకాన్ కారు విషయానికి వస్తే, దీని ధర రూ. 69.98 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 83.95 లక్షలు. ఈ కారు రెండు మోడళ్లలో అమ్ముడవుతోంది. ఈ కారు 180 కిలోవాట్ మరియు 242 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదు. పోర్స్చే మకాన్ యొక్క గరిష్ట వేగం గంటకు 225 కిమీ.

పోర్స్చే మాకాన్ కారు కేవలం 6.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం చేస్తుంది. ఈ కారులో 2.9 లీటర్ ట్విన్ టర్బో వి 6 ఇంజన్ అమర్చారు. ఈ కారును అంతర్జాతీయ మార్కెట్లో నాలుగు మోడళ్లలో విక్రయిస్తున్నారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి కూడా కలిగి ఉంటుంది.
MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?