సచిన్ టెండుల్కర్ పాత 'ఫెరారీ' పోయింది.. కొత్త 'నిస్సాన్' వచ్చింది..!

ఇక నిస్సాన్ జిటి-ఆర్ కారు విషయానికి వస్తే.. ఇది ట్విన్ టర్బో ఇంజన్‌తో 530 హార్స్-పవర్‌ను కలిగి ఉండి ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ సూపర్‌కారు రెండు వారాల క్రితమే బాంద్రాలోని సచిన్ లా మెర్ నివాసానికి డెలివరీ అయింది.
ఈ సూపర్‌కారు విలువ 87,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 40 లక్షలు) ఈ కారుతో పాటుగా, దీనికి సంబంధించిన ఇద్దరు కీలక ఇంజనీర్లు కూడా దుబాయ్ నుంచి భారత్‌కు చేరుకొని ఈ కారు గురించి సచిన్‌కు వివరించినట్లు దుబాయ్‌లోని అరేబియన్ ఆటోమొబైల్స్ వర్గాలు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు వెల్లడించాయి. సచిన్ స్నేహితుడు కూడా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇప్పటికే టెండుల్కర్ వద్ద రెండు బిఎమ్‌డబ్ల్యూ కార్లు మరియు ఒక స్కొడా కారు ఉండగా.. నిస్సాన్ జిటి-ఆర్ రాకతో సచిన్ కార్ల సంఖ్య నాలుగుకు చేరింది.


Click it and Unblock the Notifications








