సూరత్‌కు వెళ్లిపోయిన సచిన్ టెండుల్కర్ ఫెరారీ కారు

రాజ్ హన్స్ గ్రూప్ చైర్మన్ జయేశ్ దేశాయ్ ఒక నెల క్రితం ఈ ఫెరారీ కారును తనకే విక్రయించాల్సిందిగా సచిన్ టెండుల్కర్‌ను కోరాడు. ఫెరారీ కారును సొంతం చేసుకోవడం తన కల అని, నేడు అది తీరిందని జయేశ్ చెప్పారు. సచిన్ ఫెరారీ కారుకు తొమ్మిదేళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు.. ఆ సమయంలో ఇది వివాదాల కారుగా కూడా వార్తల్లోకెక్కింది. రేసింగ్ లెజెండ్ మైఖేల్ సుముచార్ ఈ ఫెరారీ కారును సచిన్‌కు బహుమతిగా ఇచ్చాడు. అప్పటికే సచిన్ వద్ద ఉన్న లగ్జరీ కార్లలో ఇది మొదటి రేసింగ్ కారు. అయితే ఈ కారును ఎంత వెచ్చించి కొనుగోలు చేశారనేది చెప్పడానకి మాత్రం జయేశ్ నిరాకరించారు.


Click it and Unblock the Notifications








