సూరత్‌లో ఫెరారీ కన్నా ముందు బిఎమ్‌డబ్ల్యూని అమ్మిన సచిన్

"ఇప్పటికీ ఈ కారు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉంది. చూడటానికి ఇది ఇప్పటికీ కొత్తదిగానే ఉంటుంది. ఇది కేవలం 18,000 కి.మీ. దూరం మాత్రమే ప్రయాణించింది. సచిన్‌తో నాకు చిరకాల స్నేహం ఉంది. నేను అడగ్గానే బిసిసిఐ అనుమతితో సూరత్‌లో ఒక ఛారిటీ మ్యాచ్ ఆడటానికి ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఈ స్నేహంతోనే తన కారు నాకు విక్రయించాడ"ని నాగ్‌జీ చెప్పారు. అప్పట్లో సచిన్ ఈ మ్యాచ్‌పై స్పందిస్తూ.. "నాగ్‌జీ భాయ్ నా వ్యక్తిగత స్నేహితుడు. ఛారిటీ మ్యాచ్ కోసం అతను సూరత్ ఆహ్వానిస్తే కాదని ఎలా చెప్పగలను" అని అన్నారు. సచిన్‌తో ఉన్న అనుబంధం గురించి నాగ్‌జీను ప్రశ్నించిగా సచిన్ టెండుల్కర్ గురించి మాట్లాడానికి తాను చాలా చిన్న వ్యక్తినని అన్నారు. ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 సిరీస్ కారు ధర సుమారు రూ. 41 లక్షలు (గుజరాత్‌లో) ఉంది.


Click it and Unblock the Notifications








