లారా రా బండెక్కు, అవును నీ హెల్మెట్ ఏది?: సచిన్ టెండూల్కర్

ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు దానిని నడిపే వ్యక్తి (రైడర్) మరియు వెనుక కూర్చునే వ్యక్తి (పిలియన్ రైడర్) ఇద్దరూ హెల్మెట్‌ను ధరించడం తప్పనిసరి. ఇలా చేయటం ఇద్దరికీ మంచిది, ఈ నిబంధనను ఉల్లంఘించడం చట్టరీత్యా నేరంగా పరిగణంచడం జరుగుతుంది.

లారా రా బండెక్కు, అవును నీ హెల్మెట్ ఏది?: సచిన్ టెండూల్కర్

ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది చాలా రకాలు ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరియు లెజెండ్రీ క్రికెటర్ బ్రియాన్ లారాలు కూడా రోడ్డు భద్రతను, హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు.

లారా రా బండెక్కు, అవును నీ హెల్మెట్ ఏది?: సచిన్ టెండూల్కర్

ఈ వీడియోలో సచిన్ టెండూల్కర్ స్కూటర్ నడపటానికి ముందు బ్రియాన్ లారాకు రైడ్‌ని ఆఫర్ చేస్తారు. ఆ తర్వాత లారాని అతని హెల్మెట్ ఎక్కడ అని ప్రశ్నిస్తారు. అందుకు లాగా హెల్మెట్ ఎందుకు అంటారు. అనంతరం స్కూటర్‌కి తగిలించి ఉన్న క్రికెట్ హెల్మెట్‌ను చూసిన సచిన్, ఇది ఇక్కడ ఎవరు పెట్టారు, నా అసలు హెల్మెట్ ఇవ్వండని కోరుతారు.

అప్పుడు ఓ వ్యక్తి సచిన్ కోసం కూడా ఓ హెల్మెట్‌ను తెచ్చిస్తాడు. ఇలా వారిద్దరూ హెల్మెట్‌ను ధరించి స్కూటర్‌పై కూర్చుంటారు. వీరు సంభాషణ ద్వారా టూవీలర్ నడిపేటప్పుడు రైడర్, పిలియన్ రైడర్ ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే విషయాన్ని, దాని ప్రాముఖ్యతను ఈ ప్రముఖలు ప్రజలకు తెలియజేశారు.

లారా రా బండెక్కు, అవును నీ హెల్మెట్ ఏది?: సచిన్ టెండూల్కర్

మన దేశంలో ప్రజలు సాధారణంగా హెల్మెట్లను ధరించడం విస్మరిస్తుంటారు. నేను బాగానే నడుపుతాను, నాకేం కాదులే అనే మొండి ధైర్యంతో ద్విచక్ర వాహనాలను నడుపుతుంటారు. ఇక పిలియన్ రైడర్ హెల్మెట్ విషయానికి వస్తే, అసలు వారు హెల్మెట్ ధరించడమే చాలా అరుదుగా కనిపిస్తుంది.

లారా రా బండెక్కు, అవును నీ హెల్మెట్ ఏది?: సచిన్ టెండూల్కర్

మనం ఎంత కాన్ఫిడెంట్‌గా రైడ్ చేసినప్పటికీ, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగానో లేక అవతలి నుండి వచ్చే వాహనాలను నడిపే వ్యక్తుల తప్పిదాల కారణంగానో నిత్యం ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కంటే, జరగకముందే జాగ్రత్త తీసుకోవటం ఎంతో ఉత్తమం.

లారా రా బండెక్కు, అవును నీ హెల్మెట్ ఏది?: సచిన్ టెండూల్కర్

హెల్మెట్ ధరించడం అంటే కేవలం దానిని శిరస్సుపై ఉంచడం మాత్రమే కాదు, హెల్మెట్ చిన్ స్ట్రాప్స్‌ను ఉపయోగించి అది జారిపోకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. టూవీలర్ యాక్సిడెంట్స్‌లో అనేక సందర్భాల్లో హెల్మెట్ వలన ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తులు చాలా మందే ఉన్నారు.

కాబట్టి మిత్రులారా, మరొక్కసారి ఆలోచించుకోండి. టూవీలర్ నడిపేటప్పుడు మీరు మరియు మీ వెనుక సీటుపై కూర్చునే వ్యక్తి ఇద్దరూ హెల్మెట్ ధరించేలా జాగ్రత్తలు తీసుకోండి.

లారా రా బండెక్కు, అవును నీ హెల్మెట్ ఏది?: సచిన్ టెండూల్కర్

హెల్మెట్ల విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో ఫుల్ ఫేస్, మాడ్యులర్ మరియు ఓపెన్ ఫేస్ అని మూడు రకాల హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫుల్ ఫేస్ హెల్మెట్లు పేరుకు తగినట్లుగా మొత్తం తలను ముందు నుండి వెనుక వరకు కవర్ చేస్తాయి మరియు ఇవి చాలా సురక్షితంగా ఉంటాయి.

లారా రా బండెక్కు, అవును నీ హెల్మెట్ ఏది?: సచిన్ టెండూల్కర్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఉత్తమమైన బ్రాండ్‌లు చాలావరకు ఫుల్ ఫేస్ హెల్మెట్ల తయారీకే ప్రాధాన్యత ఇస్తాయి. ఓపెన్ ఫేస్ హెల్మెట్లు తల భాగాన్ని మాత్రమే కవర్ చేస్తాయి, ముఖానికి కేవలం వైజర్ మాత్రమే అడ్డుగా ఉంటుంది. ఇది తలపైన మరియు వెనుక తగిలే గాయాలకు రక్షణ కల్పిస్తుంది కానీ ముఖానికి తగిలే గాయాల నుండి పెద్దగా రక్షణ కల్పించలేదు.

లారా రా బండెక్కు, అవును నీ హెల్మెట్ ఏది?: సచిన్ టెండూల్కర్

ఫుల్ ఫేస్ హెల్మెట్‌కి మరియు ఓపెన్ ఫేస్ హెల్మెట్‌కి మధ్యలో ఉండేలా మాడ్యులర్ హెల్మెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మాడ్యులర్ హెల్మెట్లు చూడటానికి ఫుల్ ఫేస్ హెల్మెట్ల మాదిరిగానే కనిపిస్తాయి. కావాలంటే, వీటిని ఓపెన్ ఫేస్ హెల్మెట్లుగా కూడా మార్చుకోవచ్చు.

Most Read Articles

English summary
Please Wear Helmet, Sachin And Brian Lara Promotes Road Safety: Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X