వైరల్‌గా మారిన సచిన్ టెండుల్కర్ వీడియో.. ఈ సారి ఎందులో కనిపించాడో తెలుసా?

క్రికెట్ అంటేనే మొదటగా గుర్తొచ్చేది 'సచిన్ టెండుల్కర్' అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే భారతీయ క్రికెట్ చరిత్రకే మకుటాయమానంగా నిలిచిన క్రికెట్ దేవుడు 'సచిన్'. క్రికెట్ అంటేనే సచిన్ గుర్తొస్తాడు కాబట్టి పెద్దగా పరిచయం అవసరం లేదు. అయితే సచిన్ కి కార్లంటే కూడా చాలా ఇష్టమని అతి తక్కువమందికి మాత్రమే తెలుసు. గతంలో కూడా లగ్జరీ కార్లను డ్రైవ్ చేస్తూ చాలా సార్లు కనిపించారు. అయితే ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

వైరల్‌గా మారిన సచిన్ టెండుల్కర్ వీడియో.. ఈ సారి ఎందులో కనిపించాడో తెలుసా?

నివేదికల ప్రకారం.. 'సచిన్ టెండూల్కర్' 'పోర్షే 992 టర్బో ఎస్ స్పోర్ట్స్' కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో కనిపించే స్పోర్ట్స్ కారు సచిన్ పేరు మీద రిజిస్టర్ అయిందని, అంతే కాకూండా ఈ కారులో కొన్ని మార్పులు కూడా జరిగినట్టు తెలుస్తోంది. అంటే ఈ కారు కస్టమైజ్ చేయబడిందని స్పష్టంగా అర్థమవుతోంది.

వైరల్‌గా మారిన సచిన్ టెండుల్కర్ వీడియో.. ఈ సారి ఎందులో కనిపించాడో తెలుసా?

కస్టమైజ్ చేయబడిన ఈ పోర్షే 992 టర్బో ఎస్ స్పోర్ట్స్ కారు ముందు మరియు వెనుక భాగంలో డిఫ్యూజర్‌లు అమర్చబడ్డాయి, అలాగే కారు బానెట్‌లో కూడా మార్పులు చేయబడ్డాయి. రియర్ స్పాయిలర్ కూడా విలాసవంతమైన అల్లాయ్ వీల్స్‌తో ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది కారుని మరింత స్పోర్టీగా కనిపించేలా చేస్తుంది.

వైరల్‌గా మారిన సచిన్ టెండుల్కర్ వీడియో.. ఈ సారి ఎందులో కనిపించాడో తెలుసా?

పోర్స్చే 992 టర్బో ఎస్ కారు మంచి పనితీరుని అందిస్తుంది. దీని కోసం కంపెనీ 3.8-లీటర్ 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ అమర్చింది. ఇది గరిష్టంగా 650 బిహెచ్‌పి పవర్ మరియు 800 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్టాండర్డ్‌గా 4X4 డ్రైవ్ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు గరిష్టంగా 330 కిమీ.

వైరల్‌గా మారిన సచిన్ టెండుల్కర్ వీడియో.. ఈ సారి ఎందులో కనిపించాడో తెలుసా?

ఇదిలా ఉండగా సచిన్ టెండుల్కర్ పోర్స్చే కంపెనీ యొక్క కయెన్ టర్బో ఎస్ కూడా కలిగి ఉన్నారు. దీనిని 2021 లో కొనుగోలు చేశారు. పోర్షే కయెన్ టర్బో అనేది ప్రస్తుతం భారతదేశంలోని కెయెన్ లైనప్‌లో టాప్-స్పెక్ వేరియంట్. అంతే కాకుండా ఇది భారతదేశంలోని అత్యంత డ్రైవర్-ఓరియెంటెడ్ SUV లలో ఒకటిగా నిలిచింది.

వైరల్‌గా మారిన సచిన్ టెండుల్కర్ వీడియో.. ఈ సారి ఎందులో కనిపించాడో తెలుసా?

సచిన్ వద్ద ఉన్న టర్బో ఎస్ మోడల్ కంటే Cayenne Turbo S E-హైబ్రిడ్ మరియు Cayenne Turbo GT మరింత శక్తివంతమైన వేరియంట్‌లు. పోర్షే కయెన్ యొక్క ఈ రెండు వేరియంట్‌లు ప్రస్తుతం భారతదేశంలో అధికారికంగా అమ్మకానికి లేవు. కావున వీటిని ప్రత్యేకంగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

పోర్షే కయెన్ టర్బో (Porsche Cayenne Turbo) యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 190 మిమీ వరకు ఉంటుంది. అయితే ఆఫ్-రోడ్ మోడ్‌లో ఈ SUV యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 245 మిమీకి పెరుగుతుంది. కావున భారతీయ రోడ్లపైన డ్రైవ్ చేయడానికి ఇది ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. పోర్షే కయెన్ టర్బో (Porsche Cayenne Turbo) మోడల్ 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. దీని ధర రూ. 1.93 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

వైరల్‌గా మారిన సచిన్ టెండుల్కర్ వీడియో.. ఈ సారి ఎందులో కనిపించాడో తెలుసా?

పోర్షే బ్రాండ్ కార్లతో తో పాటు సచిన్ నిస్సాన్ కంపెనీ యొక్క జిటి-ఆర్, బిఎండబ్ల్యు ఎక్స్5ఎమ్, బిఎండబ్ల్యు 7-సిరీస్ మరియు ఫెరారీ 360 మోడెనా వంటి అత్యంత ఖరీదైన కార్లను కూడా కలిగి ఉన్నారు. అయితే ఇన్ని కార్లు కలిగి ఉన్న సచిన్ టెండూల్కర్ యొక్క మొదటి కారు మారుతి 800 అని చాలామందికి తెలిసి ఉండదు.

వైరల్‌గా మారిన సచిన్ టెండుల్కర్ వీడియో.. ఈ సారి ఎందులో కనిపించాడో తెలుసా?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ లగ్జరీ కార్లలో కనిపించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా సార్లు లగ్జరీ కార్లను డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు కొత్త కార్ల గురించి మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు మీకు కావలసిన సమాచారం తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మా 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Sachin tendulkar spotted driving porsche 992 turbo s details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X