కోట్ల విలువ చేసే కారులో సచిన్ టెండూల్కర్.. ధర ఎవరూ ఊహించని స్థాయిలో ఉంది!

క్రికెటర్స్ లైఫ్‌స్టైల్ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా లగ్జరీ కార్లలో వారి ప్రయాణం అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాంటి వారిలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరు ముందువరుసలో ఉంటుంది. ఆయన వద్ద ఇప్పటికే కోట్ల విలువ చేసే అరుదైన కార్ల కలెక్షన్ ఉందని అందరికీ తెలిసిందే. ఏ కారు నడిపినా అది ఆటోప్రేమికుల దృష్టిని ఆకర్షించకుండా ఉండదు. తాజాగా సచిన్ గురించి సోషల్ మీడియాలో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఆయన జిమ్‌ నుంచి బయటికొచ్చినప్పుడు, పోర్షే కయెన్ లగ్జరీ కారులో కనిపించారు. దానిని కెమెరాల్లో బంధించగా, వెంటనే వైరల్ అయ్యాయి. బయటకు వచ్చిన వెంటనే సచిన్ వైపు అభిమానులు కెమెరాలు తిప్పగా, ఆయన కూడా సంతోషంగా ఫోటోలు తీయడానికి అవకాశం ఇవ్వడం అభిమానులను మరింత ఆనందపరిచింది.

కానీ, ఈ సారి అందరి దృష్టిని ఆకర్షించినది ఆయన ప్రయాణించిన లగ్జరీ కారు. పోర్షే కయెన్(Porsche Cayenne) అనేది స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్, ప్రీమియం ఇంటీరియర్స్‌తో ప్రసిద్ధి చెందింది. సచిన్ లాంటి వ్యక్తి ఈ కారు ఎంచుకోవడం సహజమే. ఆ క్షణాలను చూసిన ఆటోప్రేమికులు మాత్రం ఆ కారు గురించి మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కారు కేవలం ప్రయాణానికి కాదు, ఒక స్టేటస్ సింబల్‌గా కూడా గుర్తింపబడుతుంది.

Sachin Tendulkar Spotted With Luxury Car Porsche Cayenne Goes Viral

అభిమానులకు సచిన్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో, ఆయన నడిపే కారు అంటే అంతే ఆసక్తి ఉంటుంది. జిమ్‌ నుండి బయటికొచ్చి, సాధారణంగానే కనిపించిన సచిన్, తన లగ్జరీ రైడ్‌తో మళ్లీ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ కారు దాదాపు రూ.2 కోట్లు ఎక్స్-షోరూమ్. పన్నులు, బీమా, ఇతర ఖర్చులు కలిపి ముంబైలో రూ.2.37 కోట్లు వరకు ఖర్చవుతుంది.

కయెన్ GTS అదిరిపోయే స్థాయిలో ఉంటుంది. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత స్మూత్‌గా, శక్తివంతంగా ఉంటుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజిన్ 493 bhp శక్తిని, 660 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతటి శక్తిని కలిగి ఉండటంతో, ఈ SUV కేవలం లగ్జరీ రైడ్ మాత్రమే కాదు, ఒక స్పోర్ట్స్ మెషీన్‌గానూ నిలుస్తుంది.

Sachin Tendulkar Spotted With Luxury Car Porsche Cayenne Goes Viral

డిజైన్ విషయానికి వస్తే, రోడ్డుపై నడుస్తుంటే అందరి చూపులు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. దీని స్పోర్టీ డిజైన్, విలక్షణమైన ఫ్రంట్ ఎండ్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సిగ్నేచర్ LED హెడ్‌లైట్ సెటప్ రాత్రి సమయంలో ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. ముందు భాగంలో ఉన్న పెద్ద ఎయిర్ డ్యామ్‌లు, హెవీ స్కిడ్ ప్లేట్‌తో కూడిన పియానో ఫినిష్ గ్రిల్ SUVకి మరింత బలమైన, స్టైలిష్ లుక్‌ను అందిస్తాయి.

ఈ SUVలో వైర్‌లెస్ కార్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. దీనికి తోడు, మౌంటెడ్ కంట్రోల్ బటన్లతో కూడిన మల్టీ-ఫంక్షనల్ 3-స్పోక్ స్టీరింగ్ వీల్ డ్రైవర్‌కు సౌకర్యాన్ని కలిగిస్తుంది. అదనంగా, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కారు అంతర్గత వాతావరణాన్ని మరింత ఆధునికంగా మార్చేస్తుంది. సీటింగ్ కంఫర్ట్‌లో కూడా కయెన్ GTS ప్రత్యేకతను చూపుతుంది.

Sachin Tendulkar Spotted With Luxury Car Porsche Cayenne

లోపల ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల స్పోర్ట్స్ సీట్లు, లాంగ్ డ్రైవ్‌లోను, హై-స్పీడ్ రైడ్‌లోను పూర్తి కంఫర్ట్‌ను ఇస్తాయి. అలాగే, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లు, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సౌకర్యం SUVలో ప్రతి ప్రయాణికుడికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. డ్రైవింగ్ థ్రిల్‌ను పెంచే స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ శక్తివంతమైన ఇంజిన్ సౌండ్ మరింత ఎంగేజింగ్‌గా చేస్తుంది. మ్యూజిక్ లవర్స్ కోసం 14-స్పీకర్ బోస్ వంటి మొదలగుని ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, September 22, 2025, 15:16 [IST]
English summary
Sachin tendulkar spotted with luxury car porsche cayenne goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+