అమ్మకానికి సచిన్ టెండూల్కర్ బిఎమ్‌డబ్ల్యూ కారు

అభిమాన తారలు వాడిన వస్తువులు సొంతం చేసుకోవాలని ఆరాటపడే అభిమానులకు అరుదైన అవకాశం. అవును, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఎంతగానో ఇష్టపడే బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు అమ్మకానికి వచ్చింది.

By Anil Kumar

మీరు క్రికెట్ మాంత్రికుడు సచిన్ టెండూల్కర్ అభిమానా...? అయితే, ఈ స్టోరీ ఖచ్చితంగా మీ కోసం... అభిమాన తారలు వాడిన వస్తువులు సొంతం చేసుకోవాలని ఆరాటపడే అభిమానులకు అరుదైన అవకాశం. అవును, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఎంతగానో ఇష్టపడే బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు అమ్మకానికి వచ్చింది.

అమ్మకానికి సచిన్ టెండ్కూలర్ కారు: ఎలా కొనాలంటే...?

నమ్మలేదు కదూ...? మీరే కాదు, మొదట్లో మేమూ నమ్మలేదు. సచిన్ ఇంటి నిండా జర్మన్ లగ్జరీ కార్లతో కిటకిటలాడుతుంటాయి. అలాంటిది, సచిన్ తన కారును అమ్మేయాల్సిన అవసరం ఏం వచ్చిందని భావించాం, కానీ ఇది నిజం.

అమ్మకానికి సచిన్ టెండ్కూలర్ కారు: ఎలా కొనాలంటే...?

సచిన్ టెండ్కూలర్ 2012లో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా మార్కెట్‌కు బ్రాండ్ ప్రచారకర్తగా చేరారు. అయితే దానికి ముందు నుండే బిఎమ్‌డబ్ల్యూ ఇండియాలోకి విడుదల చేసే దాదాపు ప్రతి కారును కొనుగోలు చేసేవాడు. సచిన్ టెండ్కూలర్ తన రోజు వారీ అవసరాలకు ఉపయోగించే 2002 మోడల్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5ఎమ్ కారును గతంలోనే విక్రయించాడు. ఇప్పుడా కారు మళ్లీ అమ్మకానికి వచ్చింది.

అమ్మకానికి సచిన్ టెండ్కూలర్ కారు: ఎలా కొనాలంటే...?

లాంగ్ బీజ్ బ్లూ కలర్‌లో మెరుస్తున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5ఎమ్ ఇండియాలో ఉన్న అత్యంత అరుదైన ఎక్స్5. చాలా మంది కస్టమర్లు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీ రెగ్యులర్ వెర్షన్ ఎంచుకుంటారు. కానీ ఇది ఎమ్-వెర్షన్ ఎక్స్5 ఎస్‌యూవీ. ఎమ్-వెర్షన్ అంటే, రెగ్యులర్ వెర్షన్ కంటే అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ అని అర్థం.

అమ్మకానికి సచిన్ టెండ్కూలర్ కారు: ఎలా కొనాలంటే...?

ప్రస్తుతం ఈ యూజ్డ్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5ఎమ్ ఎస్‌యూవీని అమ్మకానికి ఉంచిన కంపెనీ కథనం మేరకు, ఈ కారు నాలుగో సారి అమ్మకానికి వచ్చింది, అంటే సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో అప్పటికే మూడు సార్లు అమ్ముడయ్యింది.

అమ్మకానికి సచిన్ టెండ్కూలర్ కారు: ఎలా కొనాలంటే...?

సచిన్ టెండ్కూలర్ ఉపయోగించిన ఈ కారు రూ. 21 లక్షలకు అమ్మకానికి ఉంది. ఇది గరిష్టంగా 72,000 కిలోమీటర్లు ఉంది. ఇందులోని ఇంజన్ బుల్లెట్-ప్రూఫ్ మరియు ఇది జీవిత కాలం మన్నుతుంది.

అమ్మకానికి సచిన్ టెండ్కూలర్ కారు: ఎలా కొనాలంటే...?

సాంకేతికంగా ఇందులో 4.6-లీటర్ కెపాసిటి గల వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 347బిహెచ్‌పి పవర్ మరియు 480ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అమ్మకానికి సచిన్ టెండ్కూలర్ కారు: ఎలా కొనాలంటే...?

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎమ్-వెర్షన్ అత్యంత వేగవంతమైనది. ఇది కేవలం 7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్టం వేగం గంటకు 239 కిలోమీటర్లుగా ఉంది. ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ మరియు టార్క్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

అమ్మకానికి సచిన్ టెండ్కూలర్ కారు: ఎలా కొనాలంటే...?

ఈ ధరల శ్రేణిలో చాలా లగ్జరీ ఎస్‌యూవీలే ఉన్నాయి. కానీ, ఏ మోడల్ కూడా సచిన్ ఉపయోగించిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5ఎమ్ కంటే శక్తివంతమైన మరియు వేగవంతమైనవి కాదు. గతంలో సచిన్ టెండూల్కర్ ఈ ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్నపుడు అనేక మార్లు కెమెరా కంటికి చిక్కాడు.

అమ్మకానికి సచిన్ టెండ్కూలర్ కారు: ఎలా కొనాలంటే...?

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5ఎమ్ ఎస్‌యూవీలో పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఆడియో సిస్టమ్, రిమోట్ లాకింగ్, అల్లాయ్ వీల్స్, లెథర్ సీట్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సీట్లు, పవర్ మిర్రర్స్, పార్కింగ్ సెన్సార్లు, ఎయిర్ బ్యాగులు, సన్‌రూఫ్ మరియు లెథర్ సీట్లు ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

అమ్మకానికి సచిన్ టెండ్కూలర్ కారు: ఎలా కొనాలంటే...?

సచిన్ టెండ్కూలర్ వాడిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5ఎమ్ ప్రస్తుతం Acierto Multi Trade Pvt Limited వద్ద అందుబాటులో ఉంది. +91-9969471365 నెంబర్‌ ద్వారా లేదంటే, [email protected] ద్వారా సంప్రదించవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, August 10, 2018, 12:00 [IST]
English summary
Read In Telugu: Sachin Tendulkar’s BMW X5 is on sale, and you can BUY it!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+