Just In
- 15 min ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 42 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 2 hrs ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 3 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
Don't Miss
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
' డ్రైవర్ లెస్ ' కారు లో సచిన్ టెండూల్కర్.. వీడియో సంచలనం
ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు దేశ వ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. బ్యాట్ పట్టడం మానేసినప్పటికీ ఇతనికి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సచిన్ బిఎమ్‌డబ్ల్యూకి పెద్ద అభిమాని, అంతే కాకుండా సచిన్ బిఎమ్‌డబ్ల్యూకి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నాడు, వీటికి చెందిన కార్లను ఇతని వద్ద చాలానే ఉన్నాయి.

క్రికెట్లో ఆల్-రౌండ్ ప్రదర్శనను చూపించే సచిన్ టెండూల్కర్‌కు లగ్జరీ కార్లంటే భలే ఇష్టం, అందులోను స్పోర్ట్స్ కార్లంటే ఇక చెప్పనవసరమే లేదు. సచిన్‌కు ఫార్ములా వన్ రేస్ కూడా ఇష్టమే. గతంలో భారత్‌లో మొట్టమొదటి సారిగా జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రి లో ప్రారంభించాడు.

అంతేకాదు, ఒకానొక సందర్భంలో సరదాగా సచిన్ ఫార్ములా వన్ కారును నడిపాడు కూడా, ఈ మధ్యనే సచిన్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మరి దాని గురించి వివరంగా తెలుసుకొందాం రండి..

ఇంకా మారుతి 800 నుంచి బిఎమ్‌డబ్ల్యూ ఐ8, బిఎమ్‌డబ్ల్యూ 750ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎంఐ5 వంటి లేటెస్ట్ లగ్జరీ కార్లు ఇతని వద్ద ఉన్నాయి, దీనిని బట్టి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కార్లపై ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తోంది.

ఇప్పుడు, ఈ మాజీ క్రికెటర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తన మొదటి కారులో తీసుకొన్న ఒక వీడియో ను పోస్ట్ చేసాడు. ఇందులో వింతేముంది అనుకొంటున్నారా ఉందండి ఇది ' డ్రైవర్ లెస్ ' కార్, అది స్వయంగా తనంతట తానే చేసుకోగలదు.

ఈ వీడియోలో సచిన్ డ్రైవర్ సీట్ లో కాకుండా పక్క సీట్లో కూర్చొని అది స్వయంగా పార్కింగ్ చేస్తుండగా ఉన్నాడు. ఈ వీడియోను తన అధికారక ట్విట్టర్ లో టెండూల్కర్ ఈ విధంగా పోస్ట్ చేశాడు, "Thrilling experience to witness my car park itself in my garage. It felt like Mr. India (@AnilKapoor) had taken control! I'm sure the rest of the weekend will be as exciting with my friends."

సెల్ఫ్ పార్కింగ్ వేహికల్ తోపాటుగా గ్యారేజీలో రెడ్ బిఎమ్‌డబ్ల్యూ పార్క్ చేసినట్లుగా కనపడుతోంది, అయితే ఏ కారులో సచిన్ టెండూల్కర్ కూర్చొని ఉండేది అనేది ఖచ్చితంగా చెప్పలేం.
వీడియోలో, సహ ప్రయాణీకుల వైపు కూర్చున్న టెండూల్కర్ ను చూడవచ్చు, డ్రైవర్ లేనప్పటికీ కారు స్టార్ట్ అని వివరిస్తూ, పార్కింగ్ ను విజయవంతంగా పూర్తి చేసింది, తరువాత సచిన్ ఈ విధంగా అన్నాడు "నేను మిస్టర్ ఇండియా పక్కన కూర్చోలేదని ఆశిస్తున్నాను."

" ఇది మొదటి డ్రైవర్‌లెస్ పార్కింగ్ కారు, "అద్భుతంగా ఉంది," అని, తన గ్యారేజీ లోపల కారు పార్క్ చేసినట్లుగా టెండూల్కర్ వెల్లడిస్తాడు. అయితే ఈ 41-సెకండ్ ల వీడియోకి ఇప్పటికే 48000 పైగా వ్యూస్, 9000 లకు పైగా ' లైక్ 'లు వచ్చాయి.

ఈ డ్రైవర్ లెస్ కార్ విషయానికి వస్తే బాష్ మరియు డైమెర్ కంపెనీల మధ్య ఒక ఉమ్మడి ప్రయత్నంలో, జర్మన్ ఇంజనీర్లు ప్రపంచంలో మొదటి పూర్తిగా ఆటోమేటెడ్ డ్రైవర్‌లెస్ పార్కింగ్ ఫంక్షన్ ను చేశారు, ఇది అత్యంత క్లిష్టమైన కార్లను సురక్షితంగా పార్కింగ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీలు స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా సర్వీసును యాక్సెస్ చేసే మెర్సిడెస్ బెంజ్ మ్యూజియం పార్కింగ్ గ్యారేజీలో, స్టట్గార్ట్ లో పరీక్షలను నిర్వర్తిస్తున్నాయి.
Source: News18