సచిన్ చేతుల మీదుగా BMW అందుకోనున్న సైనా నెహ్వాల్

లండన్‌లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న సైనా నెహ్వాల్‌కు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 లక్షల నగదు రివార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, సైనా నెహ్వాల్ ఈ రివార్డుతో పాటు మరొక జాక్‌పాట్ ఆఫర్‌ను కూడా కొట్టేసింది. క్రికెట్ క్రీడా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా సైనా నెహ్వాల్ ఓ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ కారును అందుకోనుంది.

సైనా నెహ్వాల్‌ను ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ క్రీడా మంత్రి చాముండేశ్వరీనాథ్ సన్మానించనున్నారు. ఒలంపిక్స్‌లో భారత్ తరఫున పతకాన్ని సాధించినట్లయితే, ఆమెకు ఓ కారును ప్రధానం చేస్తానని ఆయన చెప్పారు. ఇందులోభాగంగానే సైనా నెహ్వాల్‌కు బ్రాండ్ న్యూ బిఎమ్‌డబ్ల్యూ కారును సచిన్ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు.

"సైనా లండన్‌కు వెళ్లడానికి ముందు, మెడల్‌తో తిరిగిన వచ్చినట్లయితే తనకు ఒక కారును ఇస్తానని నేను ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఆమె కాంస్య పతకాన్ని సాధించింది. నేను చేసిన ప్రామిస్‌ను నిలబెట్టుకోబోతున్నాను. సైనా సచిన్ టెండూల్కర్‌కు పెద్ద అభిమాని" అని చాముండేశ్వరీనాథ్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వి. సింధుకి కూడా ఓ మారుతి సుజుకి స్విఫ్ట్ కార్‌ను సచిన్ చేతుల మీదుగా బహూకరించనున్నామని ఆయన చెప్పారు.

కాగా.. సచిన్ టెండూల్కర్ ఇటీవలే సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కారును మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. బహుశా సైనా నెహ్వాల్‌కు కూడా ఇదే కారును బహుకరించే అవకాశాలు ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఇది మొత్తం ఐదు వేరియంట్లలో (1 పెట్రోల్, 4 డీజిల్) లభిస్తుంది.

ఈ సెగ్మెంట్లోని ఆడి ఏ4 సెడాన్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మోడళ్లకు ఇది గట్టి పోటీగా నిలువనుంది. డీజిల్ వెర్షన్ 3 సిరీస్‌ (320డి)లో ఉపయోగించిన 4-సిలిండర్ ట్విన్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ లీటర్ డీజిల్‌కు 18.88 కి.మీ. మైలేజీనిస్తుంది.

అలాగే, పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ (328ఐ)లో ఉపయోగించిన ట్విన్ పవర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 245 బిహెచ్‌పిల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ పెట్రో‌ల్‌కు 14.79 కి.మీ. మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 11, 2012, 18:13 [IST]
English summary
India's latest sensation Saina Nehwal who won a bronze medal at Olympics last week is thrilled about meeting cricketing legend Sachin Tendulkar, as he will be presenting her the keys of a brand new BMW.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+