కొత్త ఆట మొదలుపెట్టనున్న సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్‌!

Sachin Tendulkar
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఓ వెలుగు వెలుగుతున్న మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఇకపై ఓ కొత్త ఆట మొదలుపెట్టనున్నాడు. ఇప్పటి వరకూ క్రికెట్ ఆటలో సుపరచితమైన సచిన్ ఇకపై మోటార్‌స్పోర్ట్‌లో తన హవా చూపించనున్నారు. ఒక్క సచిన్ టెండుల్కర్ మాత్రమే కాదండోయ్ మరో క్రికెట్ యువ కెరటం యువరాజ్ సింగ్ కూడా మోటార్‌స్పోర్ట్‌ విభాగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న ఐ1 సూపర్ సిరీస్ (i1 Super Series) కోసం కార్ రేసింగ్ జట్లను కొనుగోలు చేయడానికి వీరిద్దరూ ఉత్సాహం చూపుతున్నారు.

ఒక్కో జట్టును కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా.. జస్ట్.. 50 లక్షల అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ. 22.6 కోట్లు (రూ. 22,60,50,664.4) మాత్రమే. ఈ రేస్‌లో మొత్తం తొమ్మిది జట్లు (ఒక్కో జట్టుకు రెండు కార్లు)తో ఏడు ఆసియన్ నగరాల్లో, ఏడు రోజుల పాటు 14 రేస్‌లలో పాల్గొంటాయి. "తొమ్మిది ఇండియన్ నగరాలకు చెందిన ఫ్రాంచైజీ జట్లను సొంతం చేసుకునేందుకు క్రికెట్ ఆటగాళ్లు, బాలీవుడ్ తారలు మరియు మరికొంత మంది పారిశ్రామికవేత్తలు స్పష్టమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. క్రికెటర్లు టెండుల్కర్ మరియు యువరాజ్ సింగ్‌లు కూడా సంప్రదించార"ని ఈవెంట్ ప్రమోటర్స్, మచ్‌దార్ మోటార్‌స్పోర్ట్స్ సీఈఓ ఎమ్ దర్శన్ తెలిపారు.

బ్యాటింగ్ దిగ్గజం సచిన్‌కు ఫార్ములా వన్ రేస్ అంటే ఎనలేని అభిమానం. గతంలో ఫెరారీ కంపెనీ సచిన్‌కు ఫెరారీ 350 మోడెనా కారును కూడా బహుమతిగా ఇచ్చింది. ఈ కారును ఇటీవలే సూరత్‌లోని ఓ వ్యాపరవేత్తకు సచిన్ విక్రయించడం కూడా జరిగింది. అయితే, మోటార్‌సైకిళ్లంటే పిచ్చి అభిమానం ఉండే మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ విషయంపై తమను సంప్రదించారా అన్న ప్రశ్నకు దర్శన్ "నో కామెంట్స్" అని సమాధానమిచ్చారు. "ఈ క్రికెటర్లు కావాలనుకుంటే, ఒక సహవ్యవస్థ (కన్సార్టియం)ను ఏర్పాటు చేసి, ఒక ఫ్రాంచైజ్ జట్టును సొంతం చేసుకోవచ్చ"ని దర్శన్ చెప్పారు.

ఈ ఫ్రాంచైజీలను వేలం (ఆక్షన్) ద్వారా కాకుండా ఆహ్వానం (ఇన్విటేషన్) మేరకు 5 మిలియన్ డాలర్ల బేస్ ప్రైస్‌ వద్ద విక్రయించడం జరుగుతుంది. ప్రతి జట్టులోనూ ఒక భారతీయ డ్రైవర్ మరియు ఒక విదేశీ డ్రైవర్ ఉంటారు. అలాగే, ప్రతి ఫ్రాంచైజీ వద్ద రెండు కార్లు ఉంటాయి. ఈ సిరీస్ ఇండియాలోని న్యూఢిల్లీ, చెన్నైలోనూ మరియు అరేబియన్ గల్ఫ్‌లోని అబుదాబి, దోహా మరియు దుబాయ్‌లోనూ, అలాగే మలేషియాలోని కౌలాలంపూర్, థాయ్‌లాండ్‌లోని పట్టయా వంటి ఏడు ప్రధాన ఆసియా నగరాల్లో జరగనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 11, 2011, 14:35 [IST]
English summary
Indian cricket team players master blaster Sachin Tendulkar and Yuvraj Singh have been approached to buy car racing teams, costing USD 5 million each, in the proposed i1 Super Series, scheduled to begin from December 18.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+