సద్గురు మరియు రామ్‌దేవ్ బాబాల బైక్ సవారీ

జగ్గీ వాసుదేవ్ మరియు బాబా రామ్‌‌దేవ్, ఈ ఇద్దరూ భారతదేశపు ఆధ్యాత్మిక ప్రపంచంలో పరిచయం అవసరం లేని వ్యక్తులు. యోగా మరియు అధ్యాత్మికపరమైన జీవన అంశాల బోధన పరంగా ఎంతో ప్రసిద్ధి చెందారు. అయితే, ఈ ఇద్దరు ఆధ్య

By Anil Kumar

జగ్గీ వాసుదేవ్ మరియు బాబా రామ్‌‌దేవ్, ఈ ఇద్దరూ భారతదేశపు ఆధ్యాత్మిక ప్రపంచంలో పరిచయం అవసరం లేని వ్యక్తులు. యోగా మరియు అధ్యాత్మికపరమైన జీవన అంశాల బోధన పరంగా ఎంతో ప్రసిద్ధి చెందారు.

సద్గురు మరియు రామ్‌దేవ్ బాబాల బైక్ సవారీ

అయితే, ఈ ఇద్దరు ఆధ్యాత్మిక గురువులు అత్యంత ఖరీదైన బైకుల మీద రైడింగ్ చేస్తుండగా తీసిన వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. బాబాలు బైకులు నడపడం వెనకున్న అసలు కథేంటో చూద్దాం రండి...

సద్గురు మరియు రామ్‌దేవ్ బాబాల బైక్ సవారీ

సద్గురు శ్రీ జగ్గీవాసుదేవ్ ఎంతో ఉత్సాహంగా డుకాటి స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ బైకును రైడ్ చేశారు. బాబా రామ్‌దేవ్ సద్గురు గారి పిలియన్ రైడర్‌గా బైకు వెనకాలే కూర్చున్నాడు. అలా కొంత సేపు అక్కడున్న ప్రాంగణంలో బైకుతో చక్కర్లుకొట్టారు.

సద్గురు మరియు రామ్‌దేవ్ బాబాల బైక్ సవారీ

ఆ తరువాత ప్రాంగణంలో నుండి బయటికొచ్చిన సద్గురు రోడ్ల మీద తన రైడింగ్ టాలెంట్ చూపించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇద్దరు ఆధ్యాత్మిక గురువులు కూడా హెల్మెట్ ధరించకుండా ఎలాంటి సేఫ్టీని పాటించకపోవడం.

సద్గురు మరియు రామ్‌దేవ్ బాబాల బైక్ సవారీ

వైరల్ అయిన వీడియోలో బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ, పిలియన్ రైడర్‌గా తన అనుభవాన్ని పంచుకున్నాడు. బైకు మీద కూర్చున్నపుడు సరిగ్గా బ్యాలెన్స్ అవ్వలేకపోవడంతో పడిపోతాననిపించినట్లు చెప్పుకొచ్చాడు.

సద్గురు మరియు రామ్‌దేవ్ బాబాల బైక్ సవారీ

ఎంత నెమ్మదిగా వెళ్లినప్పటికీ హెల్మెట్ ధరించడం తప్పనిసరి, పైగా ఇలాంటి శక్తివంతమైన స్పోర్ట్స్ బైకులను నడుపుతున్నపుడు హెల్మెట్‌తో పాటు రైడింగ్ జాకెట్ మరియు గ్లోవ్స్ వంటి రైడింగ్ గేర్ తప్పనిసరిగా ధరించాలి. దీనికి తోడు పబ్లిక్ రోడ్ల మీద హెల్మెట్ లేకుండా ప్రయాణించడం చట్టపరంగా నేరం, ఇందుకు జరిమానా కూడా విధిస్తారు.

సద్గురు మరియు రామ్‌దేవ్ బాబాల బైక్ సవారీ

సద్గురు గారికి బైకులంటే ప్రాణం!!

సద్గురుకి బైకులు అంటే విపరీతమైన ఇష్టం, ఆయన తన కాలేజీ రోజుల నుండే బైక్ రైడింగ్‌ను అమితంగా ఇష్టపడేవారు. అప్పట్లో అత్యంత శక్తివంతమైన యెజ్డి350 బైకును ఉపయోగించేవారు. ఈ మధ్య కాలంలో అత్యంత ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ ఆర్‌జి1200ఎస్ ఇంకా ఎన్నో డర్ట్ బైకులను నడిపారు.

సద్గురు మరియు రామ్‌దేవ్ బాబాల బైక్ సవారీ

నదుల సంరక్షణ కోసం సద్గురు గారు ముంబాయ్ వీధుల్లో నిర్వహించిన "ర్యాలీ ఫర్ రివర్స్" క్యాంపెయిన్ ర్యాలీలో ఇదే డుకాటి స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ బైకును ఉపయోగించారు. మోటార్ సైక్లింగ్ అభిరుచిని మరియు బైకుల మీద ఇష్టాన్ని వయసైపోయినా చంపుకోలేరు అనడానికి సద్గురు ఒక చక్కటి ఉదాహరణ.

సద్గురు మాత్రమే కాదు, బాబా రామ్‌దేవ్ కూడా బైక్ ప్రియుడని గతంలో జరిగిన సంఘటనలు చెబుతున్నాయి. కొన్నేళ్ల కిందట హీరో ఇంపల్స్ అడ్వెంచర్ బైకుతో పబ్లిక్ రోడ్ల మీద నడిపి తనలో ఉన్న రైడర్‌ను బయటకు తీసుకొచ్చాడు. అయితే, బాబా రామ్‌దేవ్ బైకుల కంటే కార్లలోనే ఎక్కువగా ప్రయాణిస్తాడు.

Most Read Articles

English summary
Read In Telugu: Sadhguru & Baba Ramdev on a Ducati Desert Sled superbike: What’s going on? [Video]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X