మతి పోగొడుతున్న 'సద్గురు' కార్లు, బైకులు - ఒక్కసారైనా చూసి తీరాల్సిందే..

ప్రముఖ యోగా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో గొప్ప ప్రసంగాలతో అందరికీ చేరువైన ఈయన ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా.. ఈ కథనంలో సద్గురు వద్ద ఉన్న కార్లు, బైకులు గురించి తెలుసుకుందాం.

సద్గురు కార్లు (Car Collection Of Sadhguru)

సద్గురు జగ్గీ వాసుదేవ్ 'ర్యాలీ ఫర్ రివర్స్' అనే కార్యక్రమంలోలో భాగంగా గ్రీన్ కలర్ 'మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎమ్‌జీ' కారుని కన్యాకుమారి నుంచి హరిద్వార్ వరకు డ్రైవ్ చేశారు. ఈ కారు 5.5 లీటర్ ట్విన్-టర్బోఛార్జ్డ్ బీ8 పెట్రోల్ ఇంజిన్ కలిగి 563 bhp పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. చూడగానే ఆకర్శించబడే ఈ కారు అద్భుతమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

sadhguru amg g63

ఈయన వద్ద ఉన్న మరో కారు ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన డిఫెండర్ 110. నలుపు రంగులో అద్భుతంగా కనిపించే ఈ కారు అత్యంత లగ్జరీ ఆఫ్ రోడర్లలో ఒకటి. ఇది 5.0 లీటర్ సూపర్ ఛార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ కలిగి 525 bhp పవర్ మరియు 625 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ కూడా సద్గురు గ్యారేజిలో ఉంది. నీలి రంగులో కనిపించే ఈ కారు పాత కాలపు మోడల్ అని తెలుస్తోంది. ఇది 1960 మరియు 1970లలో మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన పాపులర్ మోడల్. టయోటా ల్యాండ్ క్రూయిజర్ పాతకాలపు మోడల్ అయినప్పటికీ ఇప్పటికి చాలా ఆకర్షణీయంగా ఉండటం చూడవచ్చు. ఈ పాతకాలపు మోడల్ ఇప్పటికే రోడ్ల మీద అక్కడక్కడా దర్శనమిస్తూ కనిపిస్తుంది.

sadhguru ducati

సద్గురు బైక్స్ (Bike Collection Of Sadhguru)

సద్గురు జగ్గీ వాసుదేవ్ గ్యారేజిలో కార్లు మాత్రమే కాకుండా అత్యంత ఖరీదైన బైకులు ఉన్నాయి. ఇందులో ఒకటి 'డుకాటీ మల్టిస్ట్రాడా 1260'. ఇది సద్గురుకు ఇష్టమైన అడ్వెంచర్ టూరర్, ఈ కారణంగానే చాలా సార్లు ఈయన ఈ బైక్ రైడ్ చేస్తూ కనిపించారు. రెడ్ కలర్ స్కీమ్‌లో కనిపించే ఈ బైక్ 1262సీసీ ఇంజిన్ కలిగి 160 పీఎస్ పవర్ మరియు 128 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

జగ్గీ వాసుదేవ్ గ్యారేజిలోని మరో బైక్ 'బీఎండబ్ల్యూ కే 1600 జీటీ' (BMW K 1600 GT). 'సేవ్ సాయిల్' ప్రచారంలో భాగంగా సద్గురు ఈ బైకుపైన అనేక కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ బైకులో 1649 సీసీ సిక్స్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 160 పీఎస్ పవర్ మరియు 175 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

sadhguru honda africa twin

హోండా ఆఫ్రికా ట్విన్ (Honda Africa Twin) కూడా సద్గురు ఉపయోగించే బైకులలో ఒకటి. సేవ్ సాయిల్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రచారం చేయడంలో భాగంగా ఈ బైక్ మీద కూడా రైడ్ చేశారు. ఈ అడ్వెంచర్ బైకులో లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ 1084 సీసీ ఇంజిన్ కలిగి 101 పీఎస్ పవర్ మరియు 105 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బైకులు, కార్లు మాత్రమే కాకుండా.. జగ్గీ వాసుదేవ్ ఇషా ఫౌండేషన్ పరిసరాల్లో తిరగటానికి సెగ్వే మోటార్ సైకిల్ ఉపయోగిస్తారు. దీనికి సంబంధించిన వీడియో వంటివి కూడా గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో జగ్గీ వాసుదేవ్.. సెగ్వే మోటార్ సైకిల్ మీద తిరగటం కూడా చూడవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈయన కార్లలో మరియు బైకుల్లో తిరిగిన వీడియోలు నెట్టింట్లో కనిపిస్తూనే ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 14, 2024, 17:17 [IST]
English summary
Sadhguru jaggi vasudev car and bike collection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+