నెలతల్లి కోసం జగ్గీ వాసుదేవ్ సాహస యాత్ర.. బైక్‌పై 30,000 కిమీ ప్రయాణం

ప్రపంచంలోని చాలా దేశాల్లో 'సద్గురు జగ్గీ వాసుదేవ్' గురించి తెలియని వారు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే జగ్గీ వాసుదేవ్ 'ఈశా ఫౌండేషన్' సంస్థాపకులు, అంతే కాకూండా ప్రసిద్ధులైన యోగి మరియు సమాజ శ్రేయస్సుకు పాటుపడే గొప్ప వ్యక్తి. ఈశా ఫౌండేషన్ అనేది కేవలం భారతదేశంలో మాత్రమే కాకూండా అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో కూడా ఉంది.

నెలతల్లి కోసం జగ్గీ వాసుదేవ్ సహస యాత్ర.. బైక్‌పై 30,000 కిమీ ప్రయాణం

అనేక సామాజిక ఆభివృద్ధి కార్యక్రమాలలో కూడా ఈ 'ఈశా ఫౌండేషన్' పాల్గొంటూ ఉంటుంది. ఈ కారణంగా ఐక్యరాజ్యసమితి ఆర్ధిక, సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా కూడా నియమించబడింది. సద్గురు సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో భారతదేశంలో ప్రముఖ పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

నెలతల్లి కోసం జగ్గీ వాసుదేవ్ సహస యాత్ర.. బైక్‌పై 30,000 కిమీ ప్రయాణం

ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన మహాశివరాత్రి సందర్భంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక పెద్ద ప్రకటన చేసారు. అక్కడ జరిగిన 12 గంటల వార్షిక సాంస్కృతిక కార్యక్రమంలో, సద్గురు నేలను సంరక్షించడానికి 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

నెలతల్లి కోసం జగ్గీ వాసుదేవ్ సహస యాత్ర.. బైక్‌పై 30,000 కిమీ ప్రయాణం

నేలతల్లి కోసం ఖండాంతర మోటారు సైకిల్ యాత్ర చేయనున్నట్లు వాసుదేవ్ తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయటానికే ఈ బైక్ యాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు. లండన్ నుంచి భారత్ వరకు 100 రోజుల పాటు మోటారు సైకిల్ పై తాను ఒక్కడినే యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.

నెలతల్లి కోసం జగ్గీ వాసుదేవ్ సహస యాత్ర.. బైక్‌పై 30,000 కిమీ ప్రయాణం

ఈ మిషన్ సమయంలో, అతను ప్రపంచంలోని అనేక ప్రసిద్ధ వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది. 100 రోజుల యాత్రలో భాగంగా 27 దేశాల పరిధిలో 30,000 కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణం చేయనున్నారు. ఈ 100 రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రతి రోజు కనీసం 5-10 నిమిషాల పాటు నేల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది.

నెలతల్లి కోసం జగ్గీ వాసుదేవ్ సహస యాత్ర.. బైక్‌పై 30,000 కిమీ ప్రయాణం

ప్రపంచం మొత్తం 100 రోజుల పాటు సద్గురు జగ్గీ వాసుదేవ్ భూమి గురించి మాట్లాడుతారు. ఇప్పటికే భూమి గురించి పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలతో పాటు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు మరో 55 ఏళ్లపాటుమాత్రమే సాగు చేసుకోవడానికి మాత్రమే భూమి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఆహార కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.

నెలతల్లి కోసం జగ్గీ వాసుదేవ్ సహస యాత్ర.. బైక్‌పై 30,000 కిమీ ప్రయాణం

ప్రపంచంలోని చాలా దేశాలు ఆహారకొరతను ఎదుర్కొంటున్నాయి. కావున భూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి భూసారం గురించి ఆహార భద్రత గురించి ఆహారోత్పత్తి గురించి ప్రతీ ఒక్కరు ఆలోచించాలని సద్గురు సూచించారు. కావున ప్రతి ఒక్కరూ దీనిని గుర్తించాలి.

నెలతల్లి కోసం జగ్గీ వాసుదేవ్ సహస యాత్ర.. బైక్‌పై 30,000 కిమీ ప్రయాణం

ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపునిచ్చారు. ప్రకృతిలో భూమి అనేది ఒక అద్భుతం. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా చనిపోయిన తరువాత మట్టిలోనే కలిసి పోవాలి. అంతే కాకూండా మానవ మనుగడకు తప్పకుండా భూమిపైన ఉన్న ఆహారమే జీవాధారం. కావున భూమి తల్లిలాంటిది. కావున భూమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, March 7, 2022, 20:28 [IST]
English summary
Sadhguru to travel 30000 kms from bike to create awareness for soil conservation
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+