వర్షపు నీటిలో చిక్కుకున్న డెలివరీకి సిద్ధంగా ఉన్న టాటా కార్లు; ఎక్కడంటే?

భారతదేశంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోతున్నాయి. వర్షాల వల్ల చాలా రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లన్నీ జలమయమైపోయిన కారణంగా, వాహనదారుల పరిస్థితి మరింత వర్ణనాతీతంగా మారిపోయింది.

వర్షపు నీటిలో చిక్కుకున్న డెలివరీకి సిద్ధంగా ఉన్న టాటా కార్లు; ఎక్కడంటే?

కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు వరదలా పారుతోంది. ఈ కారణంగా రోడ్లపై ఆపి ఉంచిన వాహనాలు కూడా వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. వర్షపు నీటిలో వాహనాలు చిక్కుకోవడం వల్ల వాహనాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోడ్లపై ఆపి ఉంచిన వాహనాలు మాత్రమే కాదు, షోరూమ్‌లలో నిలిపిన కార్లు కూడా వర్షపు నీటిలో చిక్కుకున్నాయి.

వర్షపు నీటిలో చిక్కుకున్న డెలివరీకి సిద్ధంగా ఉన్న టాటా కార్లు; ఎక్కడంటే?

వర్షపు నీరు షోరూమ్‌ పరిసర ప్రాంతాల్లో ప్రవహించకుండా ఉండేందుకు యజమానులు సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది. ఈ సంఘటన హర్యానాలో జరిగినట్లు నివేదికల ద్వారా తెలిసింది. హర్యానా షోరూమ్‌ ప్రాంగణంలో ఆపి ఉంచిన టాటా కార్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి.

వర్షపు నీటిలో చిక్కుకున్న డెలివరీకి సిద్ధంగా ఉన్న టాటా కార్లు; ఎక్కడంటే?

హర్యానా బైపాస్ సమీపంలో ఉన్న షోరూమ్‌ వద్ద వర్షపు నీరు ఎక్కువ నిలిచిపోవడం, అందులో కొత్త వాహనాలు చిక్కుకున్న వీడియో కూడా ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. వర్షపు నీరు షోరూమ్‌లోకి వెళ్లడం వల్ల షోరూమ్‌ యజమానులకు కలవరం ఏర్పరిచింది.

వర్షపు నీటిలో చిక్కుకున్న డెలివరీకి సిద్ధంగా ఉన్న టాటా కార్లు; ఎక్కడంటే?

ఈ వీడియోలో మీరు గమనించినట్లైయితే, ఇందులో ఇటీవల దేశీయ మార్కెట్లో ప్రారంభించిన టాటా సఫారి మరియు టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు వర్షపు నీటిలో ఉండటం మీరు చూడవచ్చు. ఈ వర్షపు నీటిలో వైట్ కలర్ కార్లు వినియోగదారులకు పంపిణీ చేయడానికి నిలిపి ఉంచారు. కానీ ఈ కార్లు ఇప్పుడు వర్షపు నీరు కారణంగా వినియోగదారులకు పంపిణీ చేయలేకపోతున్నారు.

ఇక్కడ వైట్ కలర్ టాటా సఫారి మరియు టాటా ఆల్ట్రోజ్‌ మాత్రమే కాకుండా రెడ్ కలర్ టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను కూడా గుర్తించవచ్చు. భారీ వర్షాల వల్ల ఇవి ఎంతవరకు దెబ్బతిన్నాయో ప్రస్తుతానికి తెలియదు. ఈ కార్లను తనిఖీ చేసిన తర్వాత ఇందులో ఏ భాగాలూ దెబ్బతిన్నాయి అన్న సంగతి తెలుస్తుంది.

వర్షపు నీటిలో చిక్కుకున్న డెలివరీకి సిద్ధంగా ఉన్న టాటా కార్లు; ఎక్కడంటే?

వర్షపు నీరు కారణంగా వాహనంలో ఇంజిన్ తప్ప ఇతర పార్టులు దెబ్బతింటే తక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. కానీ ఇంజిన్ దెబ్బతింటే మాత్రం అధికమొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే వర్షపు నీరు వల్ల ఎక్కువ శాతం వాహనాల్లో ఇంజిన్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
New Tata Safari, Altroz Submerged In Rain Water. Read in Telugu.
Story first published: Saturday, July 24, 2021, 9:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X