Global NCAP ద్వారా 2023లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్ల వివరాలు తెలుసా?
భారత్ ఆటో మొబైల్ మార్కెట్‌లోకి 2023 సంవత్సరంలో అనేక కార్లు విడుదలయ్యాయి. ఆయా కార్లన్ని గ్లోబల్ NCAP (GNCAP- గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం) క్రాష్ టెస్ట్‌ను ఎదుర్కొ్న్నాయి. అయితే కొన్ని నెలల ముందు భారత్ NCAP ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే టెస్టింగ్ ఏజెన్సీ తన కార్యకలాపాలను ప్రారంభించింది.
భారత్ NCAP (BNCAP) ద్వారా తొలిసారిగా టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్, హారియర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు క్రాష్ టెస్టింగ్‌ను ఎదుర్కొ్న్నాయి. ఈ రెండు కార్లు కూడా భద్రతలో 5-స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకున్నాయి. BNCAP నుంచి 5-స్టార్ రేటింగ్ పొందిన తొలి కార్లుగా సఫారీ, హారియర్‌లు నిలిచాయి.

అయితే 2023లో భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కార్లు గ్లోబల్ NCAP (GNCAP) ద్వారా క్రాష్ టెస్ట్‌ను ఎదుర్కొన్నాయి. GNCAP ద్వారా 5 స్టార్ రేటింగ్ పొందిన కార్ల జాబితా మరియు ఆయా కార్ల స్పెసిఫికేషన్లు, ధరలు ఇతర కీలక వివరాలతో కూడిన కథనం మీకోసం.
వోక్స్‌వ్యాగన్ వర్టస్ : వోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్ కారు (Volkswagen Virtus) గ్లోబల్ NCAP ద్వారా క్రాష్ టెస్ట్‌ను ఎదుర్కొంది. అత్యున్నత ప్రోటోకాల్స్‌ను కలిగిన GNCAP పరీక్షల్లో ఈ కారు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. పెద్దలు, చిన్నారుల భద్రతలోనూ మెరుగైన భద్రతను కలిగి ఉంటుందని తేలింది.

2023 సంవత్సరంలో గ్లోబల్ NCAP ద్వారా క్రాష్ టెస్ట్‌కు గురైన తొలి సెడాన్ ఇది. ఈ కారు మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద భారత్‌లో తయారు చేయబడింది. ఈ కారు రూ.11.48 లక్షల నుంచి రూ.19.29 లక్షల (ఎక్స్‌షోరూం) ధర మధ్య లభిస్తుంది.
స్కోడా స్లావియా : GNCAP క్రాష్ టెస్ట్‌లో స్లావియా 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సైడ్ ఇంపాక్ట్ బుల్ ప్రొటెక్షన్, సీట్ బెల్ట్ వార్నింగ్, 6- ఎయిర్‌బ్యాగ్‌లు, చైల్డ్ లాక్ ISOFIX చైల్డ్ యాంకర్, ఓవర్ స్పీడ్ వార్నింగ్, ఆటోమేటిక్ లాకింగ్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హ్యుందాయ్ వెర్నా : వోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా తర్వాత గ్లోబల్ NCAP ద్వారా హ్యుందాయ్ వెర్నా క్రాష్ టెస్టింగ్‌ను ఎదుర్కొంది. ఈ సెడాన్ మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారు చేశారు. అయితే కొత్త తరం వెర్నా కూడా భారత్‌లో విడుదల అయింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), సీట్ బెల్ట్ రిమైండర్ సహా మరిన్ని కీలక ఫీచర్లను కలిగి ఉంది.
టాటా సఫారీ మరియు హారియర్ : ఈ రెండు కార్లు భారత్ NCAP ద్వారానే కాకుండా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో భద్రతలో 5-స్టార్ రేటింగ్‌ను పొందాయి. ఈ కారులో అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 6- ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ సేఫ్టీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్, సీట్ బెల్డ్ రిమైండర్‌ను కలిగి ఉంటాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








