కార్లు, బస్సులు, రైళ్లు, విమానాల్లో ఏ సీట్లలో కూర్చుంటే మంచిదో తెలుసా? మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!!
మానవ జీవితంలో రావాణా అనేది చాలా కీలంగా ఉంది. పూర్వ కాలం నుంచి మానవులు ఈ రవాణా ద్వారా తమ జీవనోపాధిని మెరుగుపరచుకుంటున్నారు. మారుతన్న కాలానికి అనుగుణంగా రవాణా కోసం వాహనాల ఆవిష్కరణలతో ప్రయాణం అనేది మరింత చేరువ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచ రావాణాకు కావాల్సిన పురోగతి సాధించింది. అయితే వాహనం భద్రత ఇప్పుడు సమస్యగా మారింది. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న ఆటోమోటివ్ మార్కెట్ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. రైలు, కారు, బస్సు, విమానం, నౌకాయాణం ఇలా అనేక రకాల ప్రయాణ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటన్నింటిలో ప్రయాణించేటప్పుడు ఏ సీటు, ఏ వైపు కూర్చుంటే భద్రత ఎక్కువగా ఉంటుందో తెలుసా?
ఫ్లైట్: అత్యంత సేఫ్టీ ప్రయాణాలలో విమాన ప్రయాణం ఒకటి. వేగంగా గమ్యాలను చేరుకోవడానికి ఇది ప్రధాన రవాణాగా ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఫ్లైట్స్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. విమానం ఎక్కాల్సి వచ్చినప్పుడు ముందు భాగంలో కాకుండా వెనుక సీట్‌లో కూర్చోవడానికి ప్రయత్నించాలి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం విమానం వెనుక కూర్చున్న ప్రయాణీకుల మరణాల రేటు 32 శాతంగా ఉందని వెల్లడైంది.

విమానం ముందు భాగంలో ఉన్న ప్రయాణికుల కంటే వెనుక కూర్చున్న ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఫ్లైట్ జర్నీ ఇతర రకాల రవాణా కంటే చాలా సురక్షితం. విమానాల్లో బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్ అనే రెండు క్లాసులు ఉంటాయి. విమానం వెనుక భాగంలో ఎకానమీ క్లాస్‌ని అందిస్తున్నారు.
రైలు: బస్సు ప్రయాణాల మాదిరిగా కాకుండా, రైలు ప్రయాణాలలో పెద్దగా అలసట ఉండదు. అందుకే రైలు కదులుతున్న దిశకు వ్యతిరేక దిశలో సీట్లను ఏర్పాటు చేస్తారు. కానీ, సాధ్యమైనంత వరకు అలాంటి సీట్లకు దూరంగా ఉండి నేరుగా రైలు దిశలో సీట్లను కూర్చోబెట్టడానికి ప్రయత్నించండి. అలాగే రైలు మధ్య బోగీల్లో కూర్చుంటే ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.

కారు: ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లో ఓ కారు ఉండాలనే అని జనాలు అనుకుంటున్నారు. అయితే మీరు కారు నడుపుతున్నట్లయితే సీటులో సౌకర్యవంతంగా కూర్చోండి. ముఖ్యంగా బ్రేక్ మరియు యాక్సిలరేటర్ పెడల్స్‌కి మీ పాదాలు తగినంతగా ఉండేలా చూసుకోండి. మీరు రహదారిని పూర్తిగా చూడగలిగేలా సీటు ఎత్తును సర్దుబాటు చేయండి. ఒక వేల మీరు డ్రైవింగ్ చేయకపోతే, డ్రైవర్ వెనుక సీటులో కూర్చోవడానికి ట్రై చేయండి.
బస్సు: దేశంలో మినీ బస్సులతో పాటు బస్సులు అధిక సంఖ్యలో ప్రయాణికులను గమ్యాలకు చేర్చుతున్నాయి. ఇది అందరికి అనువైన రవాణా మార్గం కావడంతో చాలా మంది బస్సు ప్రయాణాన్ని ఇష్టపడతారు. బస్సు ఎడమ సీటు వరుసలో కూర్చోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు పెద్ద నష్టం జరగదు. ఎందుకంటే, భారత్‌లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ విధానాన్ని అనుసరించడమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

షిప్పింగ్: ఇది పెద్ద నౌక అయినప్పటికీ, సముద్రంలో ప్రయాణించడం కొత్తవారికి పెద్ద అసౌకర్యంగా ఉంటుంది. ఓడలో ప్రయాణించేటప్పుడు కొంతమంది వాంతులు, మూర్ఛ మరియు జ్వరంతో బాధపడటం మీరు చూసి ఉంటారు. ఓడల దిగువ క్యాబిన్లలో ప్రయాణించడం వల్ల ఎటువంటి అసౌకర్యాలు కలగవు. చిన్న నౌక అయితే మధ్యలో ఏర్పాటు చేసిన సీట్లలో ప్రయాణించండి.
సీటింగ్ పొజిషన్ మాత్రమే కాకుండా ఒకవేళ మీరు డ్రైవింగ్ చేయాల్సి వస్తే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. సేఫ్ డ్రైవింగ్ కోసం మీరు చేయాల్సిన మొదటి పని ట్రాఫిక్ నిబంధనలు పాటించడం. వేగ పరిమితికి కట్టుబడి ఉండటం, సిగ్నల్స్ వద్ద వాహనాన్ని ఆపడం మరియు లేన్ మారుతున్నప్పుడు లేదా తిప్పుతున్నప్పుడు టర్న్ సిగ్నల్స్ ఉపయోగించడం కొన్ని ప్రాథమిక అంశాలుగా గుర్తుంచుకోవాలి. ఇది ముఖ్యంగా కారు డ్రైవింగ్‌లో పాటించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








