కార్ జాక్‌ను ఉపయోగించేందుకు సురక్షితమైన చిట్కాలు, పద్ధతులు
కారును ఉపయోగించే వారిలో ఎంత మందికి కార్ జాక్ గురించి పూర్తిగా తెలుసు? పోనీ మీరు ఎప్పుడైనా కార్ జాక్‌ను ఉపయోగించారా..? అసలు కార్ జాక్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసా..? మనం ఈ రోజు చదువుకోబోయే కథనంలో కార్ జాక్‌ను సురక్షితంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి.
ఇది కూడా చదవండి: కారు బ్యాటరీ షాక్ కొడితే చచ్చిపోతారా?
కారులో రోడ్డుపై వెళ్తున్నప్పుడు హఠాత్తుగా మీ టైరు పంక్చర్ అయినా లేదా టైరులో గాలి తగ్గిపోతూ ఉన్నా అలాంటప్పు టైరును మార్చుకోవాల్సి వస్తుంది. టైరును మార్చడానికి కార్ జాక్‌ను, టూల్‌కిట్‌ను ఉపయోగిస్తాం. కార్ జాక్‌ను మరియు స్పేర్ టైరును కారు కొనుగోలు చేసేటప్పుడు కంపెనీ ఆఫర్ చేస్తుంది.
కారు జాక్‌ను ఉపయోగించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి ఈ సందర్భంలో పాటించాల్సి సేఫ్టీ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం రండి..!

మీ కారును తాత్కాలికంగా భూమి నుంచి కొత్త ఎత్తులో ఉంచేందుకు మాత్రమే కారు జాక్‌ను ఉపయోగించాలే తప్ప. కారును సుధీర్ఘ కాలం పాటు జాక్‌పై ఉంచడం కోసం దీనిని ఉపయోగించకూడదు.

మీ కారు క్రింది భాగంలో ఏదైనా తనిఖీ చేయాల్సివచ్చినప్పుడు లేదా ఏదైనా మరమ్మత్తు చేయాల్సి వచ్చినప్పుడు సాధారణ కార్ జాక్‌లు (కంపెనీ వారు ఇచ్చేవి) కాకుండా బలమైన జాక్ స్టాండ్‌లను ఉపయోగించడం ఉత్తమం. కార్ జాక్‌ను సరిగా ఉపయోగించకుండా, కారు క్రింది భాగంలో పనిచేసే వారు తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి వైఫల్యాల వలన ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

ఒకవేళ మీ కారు పంక్చర్ అయితే, టైరును మార్చాల్సి వచ్చినప్పుడు కారును లెవల్‌గా (ఎత్తు పళ్లాలు లేని) రోడ్డుపై నిలిపి ఫస్ట్ గేర్ (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) వేసి, పార్కింగ్ బ్రేక్ (హ్యాండ్ బ్రేక్)ను కూడా అప్లయ్ చేయాలి. ఈ విధానం పాటించిన తర్వాత మాత్రమే కారు జాక్‌ను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాలి.

ఒకవేళ కొండ ప్రాంతం, ఏటవాలు ప్రాంతంలో పంక్చర్ అయి, కారును నిలిపేందుకు లెవల్‌గా ఉండే ప్రాంతం లేదా చక్రాలు దొర్లిపోకుండా ఉండేందుకు రాళ్లు, చెక్కలు దొరక్కపోయినట్లయితే, మీ కారును ఫుట్‌పాత్ (కర్బ్)కు దగ్గరగా పార్క్ చేసి, ముందు చక్రాలు ఫుట్‌పాత్ వైపు ఉండేలా తిప్పండి. ఇలా చేయటం వలన ప్రమాదవశాత్తు కార్ జాక్ జారిపోయినా, కారు క్రింది జారిపోయి ఇతర కార్లను ఢీకొట్టడం లేదా పాదచారులను, బైకర్లను ఢీకొట్టం జరగదు.

ఎట్టి పరిస్థితుల్లోను హైవేపై టైరును మార్చే ప్రయత్నం చేయకండి. హైవేపై మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలు అదుపు తప్పి మీ వాహనాన్ని ఢీకొట్టడం లేదా మీపైకి దూసుకు రావటం జరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వీలైనంత వరకు వాహనాన్ని రోడ్డుకు చాలా పక్కగా లేదా ఖాలీ స్థలానికి తీసుకువెళ్లండి.
కార్ జాక్‌ను ఉపయోగించే విధానం:
తర్వాతి స్లైడ్‌లలో కార్ జాక్‌ను సురక్షితంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి.

మీ కారు సబ్ ఫ్రేమ్ క్రింద జాక్‌ను ఉంచిన తర్వాత మెల్లి మెల్లిగా జాక్‌ని పైకి లేపండి. పాత కార్లలో అయితే ధృడమైన సబ్-ఫ్రేమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చే కొత్త కార్లు యునిబాడీ ఫ్రేమ్‌లను కలిగి ఉంటాయి, కాబట్టి వాటిలో ఉపయోగించే మెటల్ సున్నితంగా ఉండొచ్చు. అలాంటి స్థలంలో జాక్‌ని ఉపయోగిస్తే ఆ మెటల్ బాడీ వంగిపోవటం లేదా డ్యామేజ్ కావటం జరుగుతుంది.
సాధారణంగా దాదాపు అన్ని కార్లలో టైరు క్రింది భాగంలోనే ధృడమైన మెటల్ బాడీ ఉంటుంది. చేతి స్పర్శతో సదరు ప్రాంతాన్ని గుర్తించి జాక్ సరిగ్గా నిలిచి ఉండేలా చూసుకున్న తర్వాత జాక్‌ను లిఫ్ట్ చేయాలి. ఈ ప్లేస్‌ను గుర్తించడంలో మీకేమైన సమస్య ఎదురైతే కార్ మాన్యువల్‌ను పరిశీలించండి లేదా నెక్స్ట్ టైమ్ మీరు కారును సర్వీస్‌కి ఇచ్చేటప్పుడు మెకానిక్‌ని ఈ విషయం గురించి అడగండి.

సరైన లిఫ్టింగ్ పాయింట్స్ వద్ద జాక్‌ని ఉంచిన తర్వాత, మెల్లిగా వాహనాన్ని లిఫ్ట్ చేయండి. మనకు అనేక రకాల జాక్‌లు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్‌గా అనేక కార్లలో ఉపయోగించే జాక్‌లు సిజర్ టైప్ జాక్‌లు. ఒకవేళ మీది సిజర్ జాక్ అయితే, దానిని ఆపరేట్ చేసేందుకు ఇచ్చిన రాడ్ లేదా రించ్ సాయంతో జాక్‌ను సవ్యదిశలో (క్లాక్‌వైస్) తిప్పుతూ పైకి లేపండి.

ఒకవేళ మీ వద్ద హైడ్రాలిక్ జాక్ ఉన్నట్లయితే, లిఫ్టింగ్ పాయింట్‌కు దగ్గరగా దీనిని ఉంచి, జాక్ రాడ్‌ను పైకి క్రిందికి నొక్కుతూ జాక్‌ని పైకి లేపండి. జాక్ రాడ్‌ను పైకి క్రిందికి నొక్కేటప్పుడు బలాన్నంతా ఉపయోగించకుండా, మెల్లి మెల్లిగా ఆపరేట్ చేయాలి. అలా చేయటం వలన మీకు అలుపు కూడా రాదు.

జాక్‌ను లిఫ్ట్ చేసి టైరును మార్చిన తర్వాత, మీరు జాక్‌ని రిలీజ్ చేయవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా జాక్ రాడ్‌ను అపసవ్యదిశలో (యాంటీ-క్లాక్‌వైజ్)లో తిప్పటం ద్వారా జాక్‌ను తొలగించవచ్చు (సిజర్ జాక్ అయితే).

అదే మీరు హైడ్రాలిక్ జాక్‌ను ఉపయోగించినట్లయితే, టైరు మార్చే ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రెజర్ రిలీజ్ వాల్వ్‌ను తిప్పేందుకు జాక్ రాడ్‌ను ఉపయోగించండి. ఇలా చేయటం వలన హైడ్రాలిక్ ప్రెజర్ రిలీజ్ అయ్యి, కారు టైరు నేలను తాకుతుంది.
మీ కారు క్రింది భాగంలో ఏదైనా తనిఖీ చేయాల్సివచ్చినప్పుడు లేదా ఏదైనా మరమ్మత్తు చేయాల్సి వచ్చినప్పుడు సాధారణ కార్ జాక్‌లు (కంపెనీ వారు ఇచ్చేవి) కాకుండా బలమైన జాక్ స్టాండ్‌లను ఉపయోగించడం మంచిది.

సాధారణంగా ఎక్కువగా ఉపయోగించే కార్ జాక్‌లు
సిజర్ జాక్ - సిజర్ జాక్‌ను వాహనాన్ని నేలపై నుంచి కొంత ఎత్తుకు లేపేందుకు ఉపయోగించే జాక్. అన్ని కార్లలో దీనిని కంపెనీలు స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తుంటాయి. దీని డయాగనల్ మెటల్ పీస్‌లతో తయారు చేస్తారు కాబట్టి, దీనికి సిజర్ జాక్ అని పేరు (కత్తెర మడుచుకుంటుంది కాబట్టి). సిజర్ జాక్‌లు పరిమాణంలో చిన్నివిగా ఉండి, కారులో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.

సాధారణంగా ఎక్కువగా ఉపయోగించే కార్ జాక్‌లు
హ్యాండ్ ఆపరేటెడ్ హైడ్రాలిక్ ఫ్లోర్ జాక్ - హైడ్రాలిక్స్‌తో పనిచేసే జాక్‌నే ఈ హైడ్రాలిక్ ఫ్లోర్ జాక్ అంటారు. కార్లు మొదలు భారీ ట్రక్కులను సైతం పైకి లేపేందుకు ఈ రకం జాక్‌లను ఉపయోగిస్తారు. వాహనం క్రింది భాగంలో ఎక్కడైనా ఉంచేందుకు వీలుగా దీనికి పొడవైన హ్యాండిల్ ఉంటుంది. అంతేకాదు, దీనిని సులువుగా కదిలించేందుకు వీలుగా ఈ జాక్‌కి అడుగు భాగంలో నాలుగు చక్రాలు కూడా ఉంటాయి. లార్జ్ సిలిండర్ అసెంబ్లీ, హ్యాండ్ ఆపరేటెడ్ పిస్టన్ పంప్‌ల ద్వారా ఇది పనిచేస్తుంది.
భారత్‌లో హైడ్రాలిక్ ఫ్లోర్ జాక్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








