మెర్సిడెస్‌ బెంజ్‌ AMG GLE 53 కారును కొనుగోలు చేసిన సైనా నెహ్వాల్‌.. ధర ఎంతంటే.!!

సెలబ్రిటీలు ఏం చేసినా స్పెషలే. అందుకు ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌(Saina Nehwal) మినహాయింపు కాదు. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాందించుకుంది. ఈ క్రమంలో సైనాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. అదేంటంటే..

బ్యాడ్మింటన్‌ దిగ్గజ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌.. ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైనా స్వయంగా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా సైనా ఖరీదైన Mercedes-Benz AMG GLE 53 లగ్జరీ కారును సొంతం చేసుకుంది. సైనా తన భర్త పారుపల్లి కశ్యప్‌తో కలిసి కొత్త మెర్సిడెస్ కారును డెలివరీ తీసుకోవడం వీడియోలో చూడవచ్చు.

Saina-Nehwal-Mercedes-Benz-AMG-GLE

ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మెర్సిడెస్‌ బెంజ్‌ కారును కొనుగోలు చేయడంతో సైనాకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా భారతీయ మార్కెట్లో ఈ కారు ధర రూ.1.71 కోట్లు( ఎక్స్-షోరూమ్). కొత్త Mercedes-Benz AMG GLE 53 ఫీచర్లు, డిజైన్‌, ఇంజిన్‌ పనితీరును పరిశీలిస్తే..

Mercedes-Benz AMG GLE 53 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 12.3-అంగుళాల డిస్‌ప్లేలు (ఇన్ఫోటైన్‌మెంట్ కోసం టచ్‌స్క్రీన్, డ్రైవర్ డిస్‌ప్లే) ఉంటుంది. ఇంకా ఆకర్షణీయమైన సన్‌రూఫ్ ఫీచర్‌, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, హెడ్-అప్ డిస్‌ప్లే మరియు 64-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Saina-Nehwal-Mercedes-Benz-AMG-GLE

సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే Mercedes-Benz AMG GLE 53 కారులో మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), బ్రేక్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా యాంగిల్‌, బ్లైండ్-స్పాట్ అసిస్ట్ వంటి డజన్ల కొద్దీ భద్రతా ఫీచర్లతో ఈ కారును మరింత పటిష్ఠంగా రూపొందించారు. మార్కెట్లో ఇది పోర్షే కయెన్ కూపే కారుకు గట్టి పోటీనిస్తోంది.

Mercedes-Benz AMG GLE 53 3-లీటర్ 6-ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 430 PS గరిష్ట శక్తిని, 520 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ లగ్జరీ SUV 9 - స్వీడిష్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో జత చేయబడి ఉంటుంది.

Saina-Nehwal-Mercedes-Benz-AMG-GLE

Mercedes-Benz AMG GLE 53 AWD (ఆల్ వీల్ డ్రైవ్) టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ కారు కేవలం 5.3 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇంకా గరిష్ఠంగా గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 5 సీట్‌ కాన్ఫిగరేషన్‌తో కస్టమర్లకు అందుబాటులో ఉంది.

ఇదే కాకుండా సైనా నెహ్వాల్‌కు ఖరీదైన లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. సైనా BMW 3 సిరీస్ కారును కలిగి ఉండగా.. దేశీయ మార్కెట్లో దీని ధర రూ.71.50 లక్షలు(ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ కారు 3-లీటర్ 6-టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేతో సహా ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది.

వీటితో పాటు సైనా నెహ్వాల్‌ వద్ద మినీ కూపర్ కారు కూడా ఉంది. ఈ కారును కస్టమర్లు 3 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. అవి మినీ కూపర్ కంట్రీమ్యాన్, మినీ కూపర్‌ 3 డోర్‌, మినీ కూపర్‌ SE. కాగా మార్కెట్లో వీటి ధర రూ. 48 లక్షల నుంచి రూ. 53.50 లక్షల వరకూ ఉన్నాయి. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి.

More from DriveSpark

Article Published On: Saturday, November 18, 2023, 12:24 [IST]
English summary
Saina nehwal buys mercedes benz amg gle 53 luxury car worth rs 1 71 crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+