సలార్ నటుడి కార్ కలెక్షన్ చూశారా.. బీఎండబ్ల్యూ, బెంజ్, రేంజ్ రోవర్ సహా ఎన్నో..!!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌కు actor prithviraj sukumaran) కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే అనేక లగ్జరీ కార్లను ఈ నటుడు కలిగి ఉన్నాడు. ఈ నటుడు లంబోర్గిని సహా అనేక లగ్జరీ కార్లను తన గ్యారేజీలో కలిగి ఉన్నాడు. అయితే తాజాగా ఈ నటుడు లగ్జరీ BMW 7 సిరీస్ లగ్జరీ సెడాన్‌లో కనిపించారు.
ఈ వీడియోను అజహర్ తన ఇన్‌స్టా పేజీలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆధారంగా నటుడు పృథ్వీరాజ్ బీఎండబ్ల్యూ-7 సిరీస్ కారులో ప్రయాణించడాన్ని గమనించవచ్చు. ఈ సెడాన్ V12 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారును అనేక మంది సెలబ్రిటీలు కలిగి ఉన్నారు. మరియు ఈ సెడాన్ అత్యంత విలాసవంతమైన ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

BMW- 7 సిరీస్ సెడాన్ ధర : ఈ బీఎండబ్ల్యూ 7- సిరీస్ సెడాన్ (BMW 7- series sedan) ధర రూ.2.46 కోట్లు (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఈ సెడాన్ 6592cc ట్విన్ టర్బోఛార్జడ్ V12 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 600bhp శక్తి, 850Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది.
BMW- 7 సిరీస్ ఫీచర్లు : ఫీచర్లు పరంగా పుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, అడ్జస్టబుల్ సీట్లు, లెదర్ సీట్ కవర్, రిమోట్ కంట్రోల్ పార్కింగ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్యాడిల్ షిఫ్టర్లు, సీట్ మసాజ్ ఫంక్షన్, దీంతోపాటు ప్రీమియం ఆడియో సిస్టమ్, ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌ను BMW- 7 సిరీస్ కలిగి ఉంటుంది.

పృథ్వీరాజ్ కార్ కాలెక్షన్ : నటుడు పృథ్వీరాజ్ తొలుత లంబోర్గిని హురాకాన్‌ను కొనుగోలు చేసి ఉపయోగించాడు. అనంతరం విక్రయించాడు. మరొక లంబోర్ఘిని కొనుగోలు చేశాడు. దీంతోపాటు పృథ్వీరాజ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్, మెర్సిడెస్ బెంజ్ AMG SUVని కూడా కొనుగోలు చేశారు. దీంతోపాటు ఫోర్షే 911 GT3 వాహనాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ అని సమాచారం.
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రం ఇటీవల విడుదలైంది. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. తొలి రోజు నుంచి ఈ చిత్రం భారీ కలెక్షన్లతో చూసుకెళ్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








