బాడీగార్డ్‌గా పనిచేస్తూ రూ. 1.40 కోట్ల విలువైన లగ్జరీ కారుని కొన్నాడు.. అతని నెల జీతం తెలిస్తే షాక్‌ అవుతారు!

పొలిటీషీయన్స్, వ్యాపార వేత్తలు, నటీనటులు, ఇతర ప్రముఖులు జనాల్లోకి వచ్చినప్పుడు కనీసం ఒక సెక్యూరిటీ గార్డు వారి వెంట ఉంటారు. సెలబ్రిటీలను ఫ్యాన్స్‌, జనాల నుంచి బయటకు తీసుకురావడంలో వీరి పాత్ర కీలకంగా కనిపిస్తోంది. సెలబ్రిటీలను శత్రువుల నుంచి మాత్రమే కాకుండా తమ ప్రేమను చాటుకోవడానికి వచ్చే అభిమానుల నుంచి కూడా రక్షించడం బాడీగార్డుల పని. అందుకే సెలబ్రిటీలు బాడీగార్డులకు అంత ప్రాముఖ్యత ఇస్తారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్ భద్రతలోనూ షేరా అనే బాడీగార్డ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఆయత గత 29 ఏళ్లుగా సల్మాన్ ఖాన్ బాడీగార్డుగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన ఇంటికి ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును సల్మాన్‌ బాడీగార్డ్‌ కొనుగోలు చేశాడు. ఇది ఎస్‌యూవీ కారు మోడల్. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ మోడళ్లలో ఇది ఒకటిగా ఉంది.

Salman Khan Bodyguard Shera Range Rover

ఈ కారు మోడల్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్‌ గ్యారేజీలో వచ్చి చేరింది. 1995 నుంచి సల్మాన్ ఆయన కుటుంబ సభ్యుల సెక్యూరిటీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇతను నెలకు రూ. 15 లక్షలు జీతం అందుకుంటున్నట్లు సమాచారం. దీని ప్రకారం ఏడాదికి రూ. 2 కోట్ల పారితోషికం తీసుకోనున్నాడు. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే బాడీగార్డ్ కూడా షేరానే కావడం గమనార్హం.

షేరా రేంజ్ రోవర్ స్పోర్ట్ లగ్జరీ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే దీని ఒకే ఒక్క యూనిట్ ధర భారతదేశంలో దీని ధర రూ.1.40 కోట్లకు పైమాటే అని చెప్పాలి. దీనికి అధిక ధర ఉన్నప్పటికీ.. భారీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. దీంతో భారత్‌లో సంపన్నులతో పాటు ఇతర వ్యక్తులు ఎక్కువగా కొంటున్నారు.

Salman Khan Bodyguard Shera Range Rover

భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ కారు ఉత్పత్తిని ల్యాండ్ రోవర్ కూడా ప్రతీ షోరూమ్‌లో అందుబాటులో ఉంది. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ డెలివరీలు ఈ నెల మధ్యలో ప్రారంభమయ్యాయి. లగ్జరీ ఫీచర్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కారు మోడల్ అందుబాటులో ఉంది. ఇది 2 ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ఈ ఎస్‌యూవీ 3.0-లీటర్ పెట్రోల్ డైనమిక్ SE, 3.0-లీటర్ డీజిల్ డైనమిక్ SE ఇంజిన్‌తో పనిచేస్తుంది. రేంజ్ రోవర్ స్పోర్ట్ చాలా ఆకర్షణీయమైన కారు మోడల్. పెద్ద చక్రాలు, డోర్ టు డోర్ ఫ్లష్ హ్యాండిల్ బార్లు, DRL ఎనేబుల్డ్ హెడ్ లైట్స్‌, ఈ లగ్జరీ కారు అందాన్ని మరింత పెంచుతాయి. అదేవిధంగా, ఈ కారు అధునాతన ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

ఈ కారులో పీవీ ప్రో OSతో కూడిన 13.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్స్‌అప్ స్క్రీన్, రియర్ ఆక్యుపెన్సీ స్క్రీన్, మెరిడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ డివైజ్, సౌకర్యవంతమైన సీట్ మసాజ్ ఉన్నాయి. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ ఇంత క్వాలిటీ కారు కొనడంతో వైరల్‌ అయ్యాడు. బాడీగార్డు కారు కొనడం సాధారణ విషయమే కానీ లగ్జరీ కారు కావడంతో వార్తల్లో నిలిచాడు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, August 31, 2024, 13:58 [IST]
English summary
Salman khan bodyguard shera buys luxury range rover check price details here in telugu
Read more on: #india #celebrity car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+