చావు భయం.. ప్రపంచంలోనే తోపు బుల్లెట్ ఫ్రూఫ్ SUVని తెచ్చుకున్న సల్మాన్ ఖాన్.. ధర ఎంతో తెలుసా?
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ (Baba Siddique Death) హత్యతో దేశ వ్యాప్తంగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) మరోసారి తెరపైకి వచ్చాడు. దసరా వేడుకల్లో అందరి ముందే సిద్ధిఖీని బిష్ణోయ్ అనుచరులను హత్య చేయడం సంచలనం రేపింది. అయితే బాబా సిద్ధిఖీ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు అత్యంత సన్నిహితుడు కావడం అందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్‌కి బిష్ణోయ్ వర్గం నుంచి ముందు నుంచే బెదిరింపులు ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ భాయ్‌కి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి బాబా సిద్ధిఖీను అదే లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు హత్య చేశారు. దీంతో సల్మాన్ ఖాన్‌కి భద్రతను పెంచారు.
బాబా సిద్ధిఖీ హత్యతో ముందుజాగ్రత్త చర్యగా దుబాయ్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ ప్యాట్రోల్ ఎస్‌యూవీని దిగుమతి చేసుకున్నాడు. దీనిని ముంబయిలోని తన నివాసానికి తీసుకొచ్చారు. ఈ కారు ధర రూ.2 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ కోసం ఇండోర్ షూటింగ్‌లో ఉన్నారు. సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఇంటితో పాటు బిగ్‌బాస్ సెట్ వద్ద సెక్యూరిటీని పెంచారు.

1998లో రాజస్థాన్‌లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకను దైవంగా పూజిస్తుంది. దీంతో సల్మాన్‌పై ఆ సామాజిక వర్గం కక్ష పెంచుకుంది. ఆ తర్వాత కోర్టు సల్మాన్‌కి బెయిల్ మంజూరు చేసింది. ఈ బిష్ణోయ్ గతంలో పలు మార్లు సల్మాన్‌ని ఎటాక్ చేసేందుకు సైతం ప్రయత్నించింది.
తాజాగా సిద్ధిఖీ మరణంతో సల్మాన్ తన సేఫ్టీ కోసం దుబాయ్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ ప్యాట్రోల్ ఎస్‌యూవీని దిగుమతి చేసుకున్నాడు. ఈ బాలీవుడ్ కండల వీరుడు తాజాగా ఇంపోర్ట్ చేసుకున్న నిస్సాన్ ఎస్‌యూవీలో హై సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇది భారీ ఫైరింగ్‌ని సైతం తట్టుకోగలదు. ఇందులో బాంబు అలర్ట్ సిస్టమ్ కూడా ఉంది. తద్వారా ఇందులో ప్రయాణించే వారికి ఎటువంటి హాని ఉండదు.

సేఫ్టీ కోసం రూపొందించిన ఈ నిస్సాన్ ప్యాట్రోల్ 1951 నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. అప్పటి నుంచి ఈ కారుకు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ 6th జనరేషన్ ఎస్‌యూవీ వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే కంపెనీ ఈ కారును భారత్‌లో విక్రయించడం లేదు. దేశంలో దీనిని కొనుగోలు చేయాలనుకుంటే కేవలం విదేశాల నుంచి మాత్రమే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కొత్త నిస్సాన్ ప్యాట్రోల్ రెండు శక్తివంతమైన పవర్‌ట్రైన్ ఆప్షన్స్‌తో వస్తుంది. దీని 3.8-లీటర్ V6 పెట్రోల్ ఇంజిన్ 316 bhp పవర్, 386 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే మరో 3.5-లీటర్ V6 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్ 425 bhp పవర్, 700 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ఈ నిస్సాన్ ప్యాట్రోల్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (గేర్ బాక్స్) తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 15 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారు ఎక్స్‌టీరియర్‌లో ఆకర్షణీయమైన డిజైన్, సీ-ఆకారంలో ఉన్న హెడ్‌లైట్స్, పనోరమిక్ పనోరమిక్ సన్‌రూఫ్‌ని కలిగి ఉంది. ఇందులో మొత్తం 8 సీట్లు ఉన్నాయి. రియర్ వ్యూ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ప్యాడిల్ షిఫ్టర్ ఉన్నాయి.
అంతే కాకుండా 12.3 అంగుళాల డిస్ప్లే, ఆఫ్-రోడ్ బంపర్, మెషిన్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గత ఏడాది సల్మాన్ ఖాన్ ఇదే నిస్సాన్ ప్యాట్రోల్ ఎస్‌యూవీని తన సెక్యూరిటీ కోసం కొనుగోలు చేశారు. ఇప్పుడు దుబాయ్ నుంచి రెండో కారుని దిగుమతి చేసుకున్నాడు. గతంలో టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కూడా ఆయన వ్యక్తిగత సేఫ్టీ కోసం ఉపయోగించేవారు.


Click it and Unblock the Notifications








