జై హో చిత్రంలో సుజుకి బైక్‌లతో సల్మాన్ ఖాన్ సందడి
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'జై హో'. గతంలో ఇదే సినిమాకు తొలుత 'మెంటల్' అనే పేరును పెట్టారు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఈ పేరును జై హోగా మార్చారు. తెలుగులో పాపులర్ అయిన మన మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రానికి రీమేక్ వెర్షనే ఈ జై హో చిత్రం. యాక్షన్ ఫ్లిక్‌గా రానున్న జైహో చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కావచ్చని తెలుస్తోంది.
సరే అదంతా అటుంచితే, ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్నెట్‌లో లీక్ అయిన లేటెస్ట్ వర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఎప్పుడు సూపర్ బైక్‌లు నడుపుతూ కనిపించే మన సల్మాన్ ఖాన్ చిత్రంలో సుజుకి స్కూటర్‌పై కనిపిస్తాడు. స్వతాహాగా సుజుకి బ్రాండ్‌కు భారత మార్కెట్లో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ తన జైహో చిత్రంలో పలు సుజుకి బ్రాండ్ వాహనాలను నడుపుతూ కనిపిస్తాడు.
ఆ కథా కమామిషీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో సల్మాన్ ఖాన్ సుజుకి మోటార్‌సైకిల్ బ్రాండ్‌కు ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసినదే.

సల్మాన్ ఖాన్ తన లేటెస్ట్ మూవీ జై హో (తెలుగు స్టాలిన్‌కు హిందీ రీమేకే)లో ఓ రెడ్ కలర్ సుజుకి యాక్సిస్ 125సీసీ స్కూటర్ నడుపుతూ కనిపించనున్నాడు.

జై హో చిత్రంలో సల్మాన్ ఖాన్ కేవలం సుజుకి స్కూటర్‌పైనే కాకుండా, ఓ సుజుకి డర్ట్ బైక్‌పై కూడా కనిపించనున్నాడు. ఈ బైక్‌ను ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ డర్ట్ బైక్ సీన్‌ను చూస్తుంటే, జై హో చిత్రంలో మంచి బైక్/కార్ చేజింగ్ సీన్ ఉన్నట్లు తెలుస్తోంది.

జై హో చిత్రంలో సల్మాన్ ఖాన్, ఇంకా భారత మార్కెట్లో విడుదల ఓ కొత్త సుజుకి బైక్‌పై కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సుజుకి త్వరలో దేశీయ విపణిలో విడుదల చేయనున్న సరికొత్త 250సీసీ స్పోర్ట్స్ బైక్ 'సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250'ను సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం 'జై హో'లో ఉపయోగించారు.

సల్మాన్ ఖాన్ వద్ద పలు సుజుకి సూపర్ బైక్‌లు ఉన్నాయి. అందులో సుజుకి హయబుసా సూపర్ బైక్, సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ లీజర్ బైక్‌లు చెప్పుకోదగినవి.

జై హో చిత్రంలో రెడ్ కలర్ సుజుకి యాక్సిస్ 125సీసీ స్కూటర్ నడుపుతున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.

జై హో చిత్రంలో రెడ్ కలర్ సుజుకి యాక్సిస్ 125సీసీ స్కూటర్ నడుపుతున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.

జై హో చిత్రంలో రెడ్ కలర్ సుజుకి యాక్సిస్ 125సీసీ స్కూటర్ నడుపుతున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.

జై హో చిత్రంలో యల్లో కలర్ సుజుకి డర్ట్ బైక్‌పై చేజింగ్ సీన్ చేస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.

జై హో చిత్రంలో యల్లో కలర్ సుజుకి డర్ట్ బైక్‌పై చేజింగ్ సీన్ చేస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.

జై హో చిత్రంలో యల్లో కలర్ సుజుకి డర్ట్ బైక్‌పై చేజింగ్ సీన్ చేస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.

Click it and Unblock the Notifications