సల్మాన్ ఖాన్ మెంటల్ చిత్రంలో సుజుకి కొత్త 250సీసీ బైక్!
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్, దేశీయ విపణిలో ఓ సరికొత్త 250సీసీ స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇటీవలి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. భారత్‌లో సుజుకి మోటార్‌సైకిల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఈ సరికొత్త బైక్‌పై సవారీ చేస్తూ కెమెరాకు చిక్కాడు.
సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'మెంటల్' (తెలుగులో మన చిరంజీవి నటించిన స్టాలిన్‌కు రీమేక్ వెర్షన్)లో ఈ కొత్త సుజుకి 250సీసీ బైక్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న 'సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250' (Suzuki Inazuma GW 250) మోటార్‌సైకిల్‌ను ఈ ఏడాదిలోనే భారత మార్కెట్లోను విడుదల చేయాలని సుజుకి యోచిస్తోంది. ఈ చిత్రం విడుదల సమయంలోనే (సెప్టెంబర్ 2013లో) ఈ బైక్ కూడా విడదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 స్పోర్ట్స్ బైక్‌కు మరింత ప్రచారం కల్పించేందుకు గాను సల్మాన్ ఖాన్ నటిస్తున్న మెంటల్ చిత్రంలో ఈ బైక్‌ను ఉపయోగించనున్నారు. తాజా పరిణామాలను గమనిస్తుంటే, అతి త్వరలోనే ఇది దేశీయ విపణిలో వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పీడ్, స్టయిలిష్, స్పోర్టీ రైడ్ కోరుకునే ఆధునిక యువతను దృష్టిలో ఉంచుకొని సుజుకి మోటార్‌సైకిల్ ఈ మోడల్‌ను అభివృద్ధి చేసింది. మరిన్ని వివరాలను ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సుజుకి ఇనాజుమా బైక్‌ను రైడ్ చేస్తున్న సల్మాన్ ఖాన్
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్, దేశీయ విపణిలో విడుదల చేయనున్న సరికొత్త 250సీసీ స్పోర్ట్స్ బైక్ 'సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250'ను సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం 'మెంటల్'లో ఉపయోగించారు.

సుజుకి ఇనాజుమా బైక్‌ను రైడ్ చేస్తున్న సల్మాన్ ఖాన్
భారత్‌లో సుజుకి మోటార్‌సైకిల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఈ సరికొత్త బైక్‌పై సవారీ చేస్తూ కెమెరాకు చిక్కాడు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'మెంటల్' (తెలుగులో మన చిరంజీవి నటించిన స్టాలిన్‌కు రీమేక్ వెర్షన్)లో ఈ కొత్త సుజుకి 250సీసీ బైక్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం.

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250
నేక్డ్ స్టయిలింగ్ కలిగిన ఈ స్ట్రీట్ ఫైటర్ బైక్‌ను ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయటం ద్వారా సరసమైన ధరకే దీనిని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250
సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 బైక్‌ను విదేశాల నుంచి విడిభాగాల రూపంలో దిగుమతి (సికెడి రూట్లో) చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనున్నారు.

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250
దీని పేరుకు తగినట్లుగానే ఇందులో శక్తివంతమైన 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 26 బిహెచ్‌పిల శక్తిని, 24 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250
ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెను వైపు మోనోషాక్ సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్), ముందు వెనుకల డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250
ఇక స్టయిలింగ్ విషయంలో ఇది జపనీస్ డిజైన్‌ను ప్రతిభింభింపజేస్తుంది.

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250
బ్రిటన్‌లో ఈ బైక్ ధర 3400 పౌండ్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.2.84 లక్షలు)గా ఉంది.

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250
సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్ 250ఆర్, కవాసకి 250, కెటిఎమ్ డ్యూక్ 250, హ్యోసంగ్ జిటి250ఆర్ వంటి మోడళ్లకు సవాలుగా నిలువనుంది.



Click it and Unblock the Notifications








