లగ్జరీ కారు కోసం సల్మాన్ ఖాన్ బావ ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది
మార్కెట్లోకి కొత్తగా లగ్జరీ కారు విడుదల అయిందంటే చాలు క్రికెటర్లు, సెలబ్రిటీలు వెంటనే కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా సినీ తారలకు కార్లంటే క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. దీంతో మార్కెట్లోకి వచ్చే టాప్ కంపెనీలకు చెందిన మోడళ్లను కొనుగోలు చేసి తమ గ్యారేజీలో పెట్టుకుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ ఖరీదైన లగ్జరీ కారును కొని వార్తల్లో నిలిచారు. సల్మాన్ సోదరి అర్పిత భర్తే ఆయుష్ శర్మ. ఈయన కూడా నటుడు. పలు సినిమాల్లో నటించాడు. ఆయుష్ హిమాచల్ ప్రదేశ్ మాజీ కాంగ్రెస్ మంత్రి పండిట్ సుఖ్ రామ్ మనవడు. 2018లో 'లవ్‌యాత్రి' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2014 లో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు అహిల్, అయత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అర్పితా ఖాన్ -ఆయుష్ శర్మ దంపతుల ఇటీవల ముంబైలోని బాంద్రాలో తమ ప్రాపర్టీని రూ.22 కోట్లకు విక్రయించి, తర్వాత వర్లీలో మరింత విలాసవంతమైన, పెద్ద ఇంటికి మారారు. దీని ధర దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. కొద్ది రోజుల క్రితం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు లగ్జరీ కారును కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.

సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ కొత్తగా మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీని(Mercedes-Benz EQS SUV)ని కొనుగోలు చేశారు. ఇది ఎలక్ట్రిక్ కారు. దీనిలో లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ధర ఏకంగా రూ.2.27 కోట్లు(ఎక్స్-షోరూమ్). EQS SUV ఇండియాలో మెర్సిడెస్‌లో ఆరవ ఎలక్ట్రిక్ కారు. దీనిలో ఆల్-వీల్-డ్రైవ్ సెటప్ కోసం డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌లతో జత చేయబడిన 122 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు.
దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 649 bhp పవర్ వద్ద 950 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ SUV కేవలం 4 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ కారులో రోడ్లపై వెళ్తుంటే ఒక పెద్ద కదిలే ప్యాలెస్‌లో వెళ్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. ఈవీ వేరియంట్‌లో ఉన్న ఈ కారు జస్ట్ సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 600 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.

ఖరీదుకు తగ్గట్టుగానే ఈ లగ్జరీ కారులో లేటెస్ట్ ఫీచర్లకు ఎలాంటి కొదవ లేదు. కారు లోపల ప్రయాణికులకు అవసరమయ్యే అన్ని సదుపాయాలు ఉన్నాయి. ముందు భాగంలో 3 స్క్రీన్లను అందించారు. వీటిలో ఒకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ముందు ప్రయాణికుల ముందు మరొక స్క్రీన్ ఉంది. క్యాబిన్‌లో ఉన్న సీట్లు నాప్పా లెదర్‌తో చాలా అందంగా ఉంటాయి.
ఇంకా, మంచి పాటల అనుభూతి కోసం 15-స్పీకర్ బర్మెస్టర్ 4D సరౌండ్ సౌండ్ సిస్టమ్, యాక్టివ్ యాంబియంట్ లైటింగ్, వెనుక ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్స్, రెండు వెనుక సీట్ల మధ్య ఆర్మ్‌రెస్ట్ వెనుక రిఫ్రిజిరేటర్ కంపార్ట్‌మెంట్ కూడా ప్రత్యేకంగా ఉంది. ఇవి కాకుండా, ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్‌లు, వైర్‌లెస్ సెల్ ఫోన్ ఛార్జర్‌లు వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

కారు ముందు భాగంలో ప్రముఖ గ్రిల్, కనెక్టివిటీ LED హెడ్‌లైట్లు, టెయిల్‌ల్యాంప్‌లు, ప్రత్యేకమైన మేబ్యాక్ డిజైన్ ఎలిమెంట్‌లను అందించారు. ఎలక్ట్రిక్ SUV ఎత్తు 1,721 మిమి, పొడవు 5,125 మిమి. వీల్‌బేస్ 3,210 మిమిగా ఉంది. ఎత్తైన ప్రాంతాల్లో కూడా ఈ కారు సులువుగా వెళ్తుంది. కారు ముందు భాగంలో ఉన్న బెంజ్ సింబల్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
నటుడు ఆయుష్ శర్మకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన వద్ద ల్యాండ్ రోవర్ డిఫెండర్‌తో సహా పలు కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ EQS ఎలక్ట్రిక్ కారును కూడా తన కార్ల జాబితాలో చేర్చుకున్నారు.



Click it and Unblock the Notifications








