తప్పు చేసేది సెలబ్రిటీలు, బలయ్యేది సామాన్యులు, డ్రైవర్లు

Salman Sohail
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గడచిన 2002 సంవత్సరంలో ర్యాష్ డ్రైవింగ్ కేసులో అరెస్టయ్యి, ఆ వెంటనే విడుదలయ్యాడు. కాగా.. ఇప్పుడు ఆయన తమ్ముడు సోహైల్ ఖాన్ కారు కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సల్మాన్ అరెస్టయినప్పుడు అతని కారు వలన ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయాల పాలయ్యారు.

అయితే, ఆ సమయంలో కారును తాను డ్రైవ్ చేయలేదని, తన బాడీగార్డ్ కారు నడుపుతుండగా ప్రమాదం జరిగిందని కోర్టులో సల్మాన్ ఖాన్ లాయర్ వాదించటం జరిగింది. దీంతో ఈ కేసు నుంచి సల్మాన్ ఖాన్ ఎస్కేప్ అయ్యాడు. కాగా.. ప్రస్తుతం అతడి తమ్ముడి కారు ప్రమాదం కేసులో అసలు సోహైల్ ఖాన్ కారులోనే లేడని, తన డ్రైవ్ కారు నడుపుతుండగా ప్రమాదం జరిగందనే వాదనలు వినిపిస్తున్నాయి.

రాత్రి పదకొండు గంటల సమయంలో సోహైల్ ఖాన్‌కు చెందిన "MH 06 W 546" అనే రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన 'లెక్సస్' లగ్జరీ ఎస్‌యూవీ కారును ఢీకొని ఓ వృద్ధురాలు ప్రాణాలు వదిలింది. ఆ సమయంలో లెక్సస్ కారు సోహైల్ ఇంటివైపు వెళ్తున్నట్లు సమాచారం. అసలే అర్థరాత్రి, ఆపై ట్రాఫిక్ తక్కువగా ఉన్న కారణంతో కారును వేగంగా నడిపినందు వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ కారు ప్రమాదం జరిగినప్పుడు కూడా, మితిమీరిన వేగంతో టర్న్ చేయబోయి, ఫుట్‌పాత్ మీద నిద్రిస్తన్న వారిపైకి కారు వెళ్లటం జరిగింది. ఏదేమైనప్పటికీ, ఈ రెండు ప్రమాదాల్లో కూడా డ్రైవర్లదే తప్పు అనే వాదనలు వినిపిస్తుండటంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా సెలబ్రిటీలు ఫారిన్ కార్లను, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన అత్యంత విలాసవంతమైన కార్లను వినియోగిస్తుంటారు. ఇలాంటి కార్లను నైపుణ్యం లేని డ్రైవర్లు నడిపితే ప్రమాదాలు జరగటం ఖాయం. కాబట్టి, ఇటువంటి మోడ్రన్ కార్లకు డ్రైవర్‌ను ఎంచుకునే ముందుకు వారు ఆచి తూచి వ్యవరించాల్సి ఉంటుంది. చాలా వరకూ సినీ సెలబ్రిటీలు సందర్భాన్ని బట్టి తమ లగ్జరీ కార్లను తామే డ్రైవ్ చేయటాన్ని మనం ఎక్కువగా గమనిస్తుంటాం. ఇలాంటప్పుడు ప్రముఖులు చేసే తప్పులకు డ్రైవర్లు, సామాన్య ప్రజలు బలవుతుంటారని విమర్శకులు అంటున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, July 2, 2012, 16:53 [IST]
English summary
In 2002, Salman Khan's Land Cruiser ran over pavement dwellers in Bandra, Mumbai, killing one and injuring three others. The actor was booked for rash driving. Now his brother Sohail Khan's car does the same. In a tragic incident, a 60-year old pavement dweller was crushed to death in Bandra by his car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+