15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు
విమానాలు ద్వారా అతి తక్కువ సమయంలో ఎంతటి దూరాన్ని అయినా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా చేరుకోవచ్చు. అయితే వీటిలో ప్రయాణ ధర భారీగానే ఉంటుంది. కాని ఇందులో రెండు రకాల టికెట్‌లు అందుబాటులో ఉంటాయి. అవి సాధారణ మరియు ఎకానమీ శ్రేణి టికెట్లు, సాధారణ టికెట్ ప్రయాణంతో పోలిస్తే ఎకానమీ తరగతి ప్రయాణంలో ఎన్నో సౌకర్యాలు ఉంటాయి.
విమాన ప్రయాణమే గగనం అనుకుంటే అందులో రెండు రకాల టికెట్లా..? అనుకుంటున్నారు కదా. ఎకానమీ క్లాస్ ప్రయాణం చాలా మంది కలలా భావిస్తే చాంగ్ హాంగ్ అనే వ్యక్తి ఏకంగా 15 లక్షలు విలువ చేసే ప్రయాణాన్ని కేవలం 7,000 రుపాయలతో అనుభవించాడు. అది ఎలా సాధ్యం అనుకుంటున్నా్రా ? అయితే మీరు క్రింది కథనం చదవాల్సిందే.

హై-క్లాస్ విమాన ప్రయాణం
ఈ మధ్యనే ప్రపంచపు అతి పెద్ద విమానం ఎయిర్ బస్ ఎ380 విమానం ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రయాణ ధర గరిష్టంగా రూ. 15 మిలిన్లుగా ఉంది, అయితే ఇందులో కేవలం 7,000 రుపాయలతో ప్రయాణం చేశాడు. మరిన్ని విషయాలకు ముందుకు వెళ్లడానికి స్లైడ్ల మీద క్లిక్ చేయండి.

డబ్బులు కాదు, పాయింట్లను సంపాధించేవాడు
ఇతను క్రెడిట్ కార్డు ద్వారా పాయింట్లను సాధించి రివార్డులను పొందేవాడు. ఇలా వచ్చిన పాయింట్లను ప్రయాణానికి వినియోగించుకోగా ఇతను కట్టాల్సిన మొత్తం ఏడు వేల రుపాయలుగా ఉంది. ఇతను ఇలా ఎప్పుడు దగ్గరి ప్రాంత ప్రయాణాలకు మాత్రమే ఇలా చేసే వాడు అని తెలిపాడు.

కోరిక
ఎథిహాద్ ఎయిర్ లైన్స్ ఎయిర్‌బస్ ఎ380 విమానంలోని లగ్జరీ తరగతి శ్రేణిలో ప్రయాణించాలి అనేది ఇతని కోరిక . ఇతను రివార్డు ద్వారా కలెక్ట్ చేసిన పాయింట్లకు గాను 108 డాలర్లు విలువ చేసే అపార్ట్‌మెంట్ తరగతిలో విమాన టికెట్‌ను దక్కించుకున్నాడు.

తక్కువ ధరతో
ఇందులోని అపార్ట్‌మెంట్ శ్రేణిలో టికెట్ ధర 6,500 డాలర్లు మరియు రెసిడెన్స్ శ్రేణిలో టికెట్ ధర 23,000 డాలర్లుగా ఉంది. అయితే ఇతను అపార్ట్‌మెంట్ శ్రేణిలోని రిజర్వేషన్, రెసిడెన్స్ లో అనుభవించాలనే కోరికతో ఉన్నట్లు తెలిపాడు. ఈ విమానంలో శృగారం కూడా చేసుకోవచ్చు అని ఎథిహాద్ నుండి అధికారిక మెయిల్ ఇతనికి వచ్చింది.

సిడ్ని నుండి అబు దాబి వరకు
హాంగ్ చాంగ్ ఎథిహాద్ ఎయిర్‌లైన్స్ వారి ఎయిర్ బస్ ఎ380 విమానంలోని అపార్ట్‌మెంట్ శ్రేణిలో సిడ్నీ నుండి అబుదాభి వరకు ప్రయాణించాడు.

పట్టరాని ఆనందంలో హాంగ్
హాంగ్ మాట్లాడుతూ, ఇలాంటి తరగతిలో కనీసం అరగంటసేపు ప్రయాణించినా చాలు అనుకునే వాన్ని అయితే ఏకంగా సిడ్నీ నుండి అబుదాభి వరకు ప్రయాణించినందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు.

రెసిడెన్స్ క్లాస్ సౌకర్యాలు
ఇందులో సోఫా బెడ్, సౌకర్యవంతమైన బెడ్ మరియు స్విచ్‌లు, ప్రత్యేకమైన విశ్రాంతి గది, 27 అంగుళాల పరిమాణం గల ఎల్‌ఇడి టీవీ మరియు ఎథిహాద్ అత్యంత నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుంది.

మరపురాని అనుభవం
ఎథిహాద్ ఎయిర్‌లైన్స్ వారి ఎయిర్‌బస్ ఎ380 లోని రెసిడెన్స్ క్లాస్‌లోని ప్రయాణం మరపురాని అనుభవం మిగిల్చిందని హాంగ్ చెప్పుకొచ్చాడు. ఇందులో ప్రయాణిస్తున్నపుడు స్నానం, టిఫిన్ చేయడం, టీవీ చూడటం అన్ని కూడా అదో కలలా ఉన్నట్లు తెలిపాడు.

టాప్ మైల్స్
హాంగ్ చాంగ్ ఇంతటి ఖరీదైన విమానం ప్రయాణం చేయడానికి కారణ, పాయింట్లను సేకరించడం. ఇందుకోసం హాంగ్ టాప్ మైల్స్ అనే వెబ్‌సైట్‌ను వినియోగించుకున్నట్లు తెలిపాడు. మీరు ఇందులో సూచనలు పాటిస్తూ టాప్ మైల్స్ వెబ్‌సైట్‌ను అనుకరిస్తే చాలు. మీరు ఇలాంటి ప్రయాణాన్ని పొందవచ్చు.

కాస్త కష్టమే
2008 లో చైనాలో జరిగిన ఒలపింక్స్‌లో ఇతను పాల్గొన్నాడు అప్పుడే నిర్ణయించుకున్నాడు, ఎలాగైనా రివార్డు పాయింట్ల ద్వారా విమాన ప్రయాణం చేయాలని. అంతే కాదండోయ్ ఇతను దాదాపుగా 15 వరకు క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నాడు, ఇలా మెయింటెన్ చేయడం చాలా కష్టం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు నేడు పాఠకుల కోసం నేల మరియు నీటి మీద నడిచే ఆంపిబియస్ బస్ గురించి ప్రత్యేక కథనం అందిస్తోంది. అత్యంత ప్రత్యేకమైన ఈ బస్సు గురించి ప్రత్యేకమైన సమాచారాన్ని ఫోటోలతో సహా అందిస్తున్నాము. పూర్తి వివరాలకు తరువాత స్లైడర్ల మీద క్లిక్ చేయగలరు.

మోడల్ వివరాలు
టెర్రా విండ్ అనేది ఈ బస్సు యొక్క మోడల్ పేరు. ఇది పర్యాటక ప్రాంతాలలో ఎంతో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది.

సీటింగ్
ఇందులో దాదాపుగా 49 మంది వరకు ప్రయాణికులు ప్రయాణించే విధంగా వీలు కల్పించింది. సిఎఎమ్ఐ (CAMI) సంస్థ.

తయారీ
ఈ అత్యంత విలాసవంతమైన ఆంపిబిస్ బస్సును కూల్ ఆంపిబియస్ మ్యాన్యుఫ్యాక్చురర్స్ ఇంటర్నేషనల్ సంస్థ తయారు చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో లగ్జరీ సదుపాయాలతో బస్సులను ఉత్పత్తి చేస్తోంది. అంతే కాకుండా ఇది రకరకాల ఆంపిబియస్ వాహనాల తయారీకి బాగా పేరు గాంచింది.

వాహనం ఇల్లుగా
దీనిని పర్యాటక ప్రదేశాలలో వ్యక్తిగతంగా మరియు ఎక్కువ మంది కూడా ప్రయాణించవచ్చు. అందుకోసం (CAMI) సంస్థ వీటిని జంటల హనీమూన్ కోసం మరియు పర్యాటక ప్రియులు కలిసి ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా రూపొందిస్తోంది.

వేగం
ఈ ఆంపిబియస్ బస్సు నేల మీద గంటకు 80 కిలోమీటర్ల వేగంతో మరియు నీటిలో 7 నాటికల్ మైళ్ల చొప్పుడు పరుగులుపెడుతుంది.

కాక్‌పిట్
విమాన తరహాలో ఇందులో కాక్‌పిట్ పరికరాన్ని అందించారు. దీని ద్వారా నేల మరియు నీటి మీద ప్రయాణించడానికి ముందు బస్సు యొక్క లోడ్ సమార్థ్యం మరియు ప్రత్యేకంగా న్యావిగేషన్ సమాచారాన్ని ఇవ్వగలదు.

కదలిక
దీనిని నీటిలో నడపడం ఎంతో తేలిక. తాకే తెర ద్వారా నేల నుండి నీటి మీద ప్రయాణించేందుకు వీలుగా ట్రావెల్ మోడ్‌ను ఎంతో సులభంగా మార్చుకోవచ్చు.

అనుకూలీకరించబడిన సదుపాయాలు
ముందు వైపు వ్యూవ్ కోసం పెద్ద క్లాస్‌ను అందించారు. తద్వారా బాహ్య ప్రదేశాలను చూసి బాగా ఆనందించవచ్చు. మరియు సౌకర్యవంతంగా కూర్చోవడానికి చక్కటి సీటింగ్ సౌలభ్యతను కల్పించారు.

ఇతర సదుపాయాలు
ఇందులో టీవీ, వంట గది సదుపాయాలు, బస్సు బాహ్య భాగం వైపు టెంటును వేసుకునే సదుపాయం మరియు ఇంటీరియర్ లోపల చాలా చెక్కతో తయారు చేయబడి ఉంది.

చక్కటి నిద్ర కోసం
ఇందులో చక్కగా నిద్రకు ఉపక్రమించడానికి హోటల్ తరహాలో ఉండేటటువంటి బెడ్ కలదు. ఇది పూర్తిగా సౌకర్యవంతంగా మరియు భద్రతతో ప్రమాణాలతో తయారై ఉంది.

చల్ల చల్లటి వాతారణం కోసం
వేసవి కాలంలో ఈ ఆంపిబియస్ బస్సులో నేల లేదా నీటి మీద ప్రయాణం చేసినపుడు ఇందులో చల్లటి వాతావరణం కల్పించడం కోసం ఏ/సి ను సౌకర్యాన్ని కల్పించారు.

చేపలు పట్టే సదుపాయం
గాలం వేసి చేపలు పట్టడం అనేది చాలా మంది ఇష్టం, అలాంటి వారు ఇందులో ప్రయాణిస్తున్నపుడు చేపలు పట్టాలి అనుకుంటే. ఇందులో ఉన్న ప్రత్యేకమైన ఫిష్షింగ్ సదుపాయాల ద్వారా చేపలు పట్టవచ్చు.

నిరంతరం విద్యుత్
ఇందులో పవర్ కట్ సమస్య రాకుండా నిరంతరం విద్యుత్‌ను ఇవ్వడానికి జనరేటర్‌ను అందుబాటులో ఉంచారు.

ఇంజన్
ఇందులో క్యాటర్‌పిల్లర్ సంస్థ వారి ఇంజన్‌ను వినియోగించారు, ఈ శక్తివంతమైన ఇంజన్‌కు అలిసన్ వారి గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

అగ్నిమాపక పరికరాలు
ఈ ఆంపిబియస్ బస్సులో రెండు అగ్నిమాపక పరికరాలను ఉపయోగించారు. కాబట్టి చాలా వరకు ప్రొటెక్షన్‌ను ఇది ఇస్తుంది.

ధర
ఈ విలాసవంతమైన ఆంపిబియస్ బస్సు సుమారుగా 1.2 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిసింది. అంటే దీని విలువ 12 లక్షల అమెరికన్ డాలర్లు అన్నమాట

మీ వల్ల కాదు.
నిజమే కదా ఇలాంటి ఖరీదైన ఆంపిబియస్ బస్సుల్లో ప్రయాణించాలంటే మన వలన అవుతుందా. అందులోను విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీని చదివి నిరాశ చెందిన వారికి తరువాత స్లైడర్‌లో శుభవార్త కలదు....

గోవా...
గోవా గురించి ఎందుకు అనుకుంటున్నారా ...? గోవాలో గోవా పర్యాటక అభివృద్ది సంస్థ అచ్చం ఇలాంటి ఆంపిబియస్ బస్సును అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు.

అనుమతులు
గోవాలో ఆంపిబియస్ బస్సును అందుబాటులోకి తీసుకురావడానికి కావాల్సిన అనుమతుల కోసం గోవా పర్యాటక అభివృద్ది సంస్థకు తాజాగా అనుమతులు లభించాయి. త్వరలోనే ఈ బస్సు అందుబాటులోకి రానుంది.

మేడిన్ ఇండియా
నేల మరియు నీటి మీద నడవగలిగే ఆంపిబియస్ బస్సులను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయంగా తయారుచేయనున్నారు.

సీటింగ్ సామర్థ్యం
ఇండియాలో తయారు చేయనున్న బస్సులో 29 మంది కూర్చునేందుకు వీలుగా ఉండేటట్లు రూపొందించనున్నారు.

సాధారణ మోడల్
ఇందులో ఉన్న ఫోటోను చూడండి, ఇది సాధారణ ఆంపిబియస్ బస్సులోని చిత్రం, అయితే గోవాలో రానున్న బస్సు గురించి తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ విడుదల చేసే సమయానికి చేరుకుంటే మొత్తం బస్సును సందర్శించవచ్చు.

ప్రయివేట్ సంస్థల చేత
గోవాకు ఆంపిబియస్ బస్సు సర్వీసును ప్రయివేట్‌గా నిర్వహించనున్నారు.

గోవా ఇన్‌స్ట్యూట్
గోవా ఆటోమొబైల్ కార్పోరేషన్, గోవా ఆధారిత సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను దేశీయంగా అభివృద్ది చేస్తున్నారు.

అతి త్వరలో రానుంది.
గోవా పర్యాటక ప్రాంత అభివృద్ది సంస్థ అతి త్వరలో గోవాలో ఆంపిబియస్ బస్సును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. దీనికి సంభందించిన సమాచారం వస్తే వెంటనే పాఠకులతో పంచుకుంటాము, అంత వరకు మాతో కలిసి ఉండండి. పాఠకులకు ఇదొక చక్కటి అనుభూతిని కలిగిస్తుందని మా అభిప్రాయం.

విమాన ప్రయాణంలో పైలట్లు మరియు విమాన సిబ్బంది చేసే 20 ఆసక్తికరమైన పనులు
భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

ఖండాతరాలను చుట్టేస్తున్న 19 నాన్-స్టాప్ విమానాలు
వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!


Click it and Unblock the Notifications








