సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

అక్కినేని సమంత అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందంలో, అభినయంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న దక్షిణ భారత సినీ నాయకి 'సమంత'. తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన ఈ నటి అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది ప్రజల ఆదరాభిమానాలు పొందింది. కేవలం అందం, అభినయంలో మాత్రమే కాదు మానవత్వంతో కూడా తనకున్న ఉదారతను చాటుకుంది. దీనికి ఉదాహరణే ఇటీవల ఒక మహిళా ఆటో డ్రైవ్ కి ఇచ్చిన కార్ గిఫ్ట్.. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

ఇటీవల కాలంలో సమంత ఒక ఆటో డ్రైవర్ కి కారుని గిఫ్ట్ గా ఇచ్చింది. కానీ దీని గురించి ఆ మహిళా ఆటో డ్రైవర్ కి ఏమాత్రం తెలియదు. హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్ జయభేరి మారుతీ షో రూమ్ నుంచి తమకు కారు గిఫ్ట్ గా వచ్చిందని షోరూమ్ యాజయాన్యం ఆ మహిళా ఆటో డ్రైవర్ కి తెలిపారు.

సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

ఆ మహిళా ఆటో డ్రైవర్ జయభేరి మారుతీ షో రూమ్ కి చేరుకుని తనకు వచ్చిన గిఫ్ట్ చూసి ఎంతగానో సంతోషించింది. ఈ కారు విలువ రూ. 7.50 లక్షలు అని షో రూమ్ యాజమాన్యం ద్వారా తెలిసింది.

MOST READ:2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

మహిళా ఆటో డ్రైవర్ విషయానికి వస్తే, ఈమె పేరు కవిత, ఊరు డోవూర్‌ చందర్‌ నాయక్‌ తండా. కవితకు చిన్నతనంలోనే వివాహం జరిగింది, అయితే ఆమె భర్త తాగుడుకు బానిసైన కారణంగా రోజు చిత్రహింసలు పెట్టేవాడు. కవిత చిన్నతనం నుంచే గృహహింసకు భాదితురాలైంది.

సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

ఇంత కష్టంలో ఉన్న కవిత తల్లి దండ్రులు కూడా చనిపోవడంతో తన ఏడు మంది చెల్లెళ్ళ భారం కూడా తన మీదనే పడింది, కావున కుటుంబ పోషణ మరింత కష్టతరమైంది. ఈ తరుణంలో ఆటో డ్రైవింగ్ నేర్చుకుని హైదరాబాద్ లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. కవిత యొక్క విషాద గాథను ఒక యూట్యూబ్ ఛానల్ వీడియోబీ తీసి విడుదల చేశారు.

MOST READ:భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; కఠినమైన రూల్స్, వీటికి మాత్రమే మినహాయింపు

సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

వీడియో చూసిన అక్కినేని సమంత చలించిపోయి తనకు అండగా నిలవాలనుకుని, తనకు కార్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంది. కారు ద్వారా కవిత మంచి సంపాదనతో, ఆనందమైన జీవితం గడపాలని ఆశించిన సమంత కార్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మారుతున్న కాలంలో అయినవాళ్లే పట్టించుకోని ఈ సమయంలో సమంత నిజంగా కవిత పాలిట దేవతగా నిలిచింది.

సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

జయభేరి మారుతీ షో రూ యాజమాన్యం ఎంతో ఆప్యాయతతో 'మారుతి డిజైర్' కారుని కవితకు అప్పగించారు. మారుతి డిజైర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

MOST READ:ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు భారత్‌లో; ధర & వివరాలు

సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్‌ 1 పెట్రోల్ ఇంజన్ మరియు 1 సిఎన్‌జి ఇంజన్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 1197 సిసి, సిఎన్‌జి ఇంజన్ 1197 సిసి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ యూనిట్ తో లభిస్తుంది. వేరియంట్ మరియు ఫ్యూయెల్ టైప్ ని బట్టి స్విఫ్ట్ డిజైర్ దాదాపు 19.95 కిలోమీటర్ల నుండి 26.55 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

Most Read Articles

English summary
Samantha Akkineni Gifts Expensive Car To A Female Auto Driver. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X