తేజ్ సినిమాలో స్టన్నింగ్ బైక్ స్టంట్‌లు చేసిన సమీరా రెడ్డి

జై చిరంజీవ సినిమాలో చిరంజీవి సరసన చిందులేసిన ముద్దుగుమ్మ సమీరా రెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది. తన అమాయకపు నటన, అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ యాక్షన్ సినిమాలో భారీ బైక్ స్టంట్‌లు చేసి భలే అనిపించుకోనుంది.

ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న 'తేజ్' (Tezz) అనే సినిమాలో అజయ్ దేవగన్, అనీల్ కపూర్, జయిద్ ఖాన్‌లు కూడా అబ్బరపరచే యాక్షన్ సన్నివేశాలను చేశారు.

Samera Bike Stunt

ఈ సినిమా కోసం సంతకం చేసేటప్పుడు తాను ఇవన్నీ (స్టంట్‌లు) సులువుగానే చేయగలనని అనుకున్నాని, అయితే బైక్ స్టంట్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా భయపడ్డానని, కానీ దీన్ని సవాల్‌గా తీసుకుని నటించానని సమీరా రెడ్డి తన మనసులో మాట బయట పెట్టింది.

"ఈ స్టంట్ నేను చేయాలననుకున్నాను. దాదాపు దీన్ని వదిలేద్దామనుకున్నా, కానీ నాకే తెలియకుండా ఈ స్టంట్ చేశాసా. చాలా ఆశ్చర్యంగా ఉంద"ని సంబరపడిపోతుంది ఈ అమ్మడు. ఈ యాక్షన్ సన్నివేశాన్ని హారీ పోట్టర్, ది బోర్న్ ఐడెంటిటీ తచిత్రాలకు పనిచేసిన గారెత్ మిల్న్, పీటర్ పెడ్రెరోలు డైరెక్ట్ చేశారు.

ఈ బైక్ స్టంట్ సమీరా రెడ్డి ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుందట. ఎంతో జాగ్రత్తతో ఈ స్టంట్‌ను ప్రదర్శించినప్పటికీ సమీరకు కొద్దిపాటి గాయాలు కూడా అయ్యాయట. ఇక ఈ సినిమాలో మల్లికా షెరావత్‌తో తీసిన 'లైలా' ఐటమ్ నెంబర్ మరొక హైలైట్‌గా నిలువనుంది. ఈ చిత్రాన్ని మళయాలంలో కూడా సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 27 ఇది విడుదల కానుంది.

More from DriveSpark

Article Published On: Monday, April 23, 2012, 16:56 [IST]
English summary
Actress Sameera Reddy turned as action heroine with 'Tezz' film directed by Priyadarshan. She performed a daring dashing bike stunts in this movie.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+