హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అందరికి సుపరిచయమే, టెన్నిస్ అంటే మొదట గుర్తొచ్చేపేరు సానియా మీర్జా. క్రీడారంగంలో అంతటి ఘనత సాధించిన సానియా మీర్జా టెన్నిస్ ఆడే అందరికి ఆదర్శప్రాయం అనటంలో సందేహం లేదు. ఇటీవల సానియా మీర్జా హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టిలో కనిపించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ తన పోర్ట్‌ఫోలియోలో అనేక మోడళ్లను ఆఫర్ చేసింది. వారు ఇటీవల సరికొత్త వెర్షన్ ఐ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల కంపెనీ యొక్క సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూలో ప్రవేశపెట్టిన ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఐఎమ్‌టి లేదా ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్. ఇది రెగ్యులర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు భిన్నంగా ఉంటుంది. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కొత్త హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టిని నడుపుతూ, తన అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకుంది.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

ఈ వీడియోను హ్యుందాయ్ ఇండియా తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది. ఈ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో హ్యుందాయ్ వెన్యూ ఒకటి. ఇది మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యువి 300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, కియా సోనెట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

ఐఎమ్‌టి అనేది మాన్యువల్ గేర్‌బాక్స్, ఇది డ్రైవర్ నుండి క్లచ్ ఇన్‌పుట్ అవసరం లేని విధంగా సవరించబడింది. ఈ టెక్నాలజీ గేర్ లివర్‌తో ఇంటెన్సివ్ సెన్సార్‌ను ఉపయోగిస్తుందని, ఇది డ్రైవర్ గేర్‌లను మార్చబోతున్నప్పుడు ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ యూనిట్ (టిసియు) కు తెలియజేస్తుందని కంపెనీ తెలిపింది.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

దీని యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, క్లచ్‌ను మాన్యువల్‌గా ఆపరేట్ చేయవలసిన అవసరం లేదు, ఇది నగర ట్రాఫిక్ సమయంలో డ్రైవింగ్ చేయడంలో మీ ఆందోళనను తగ్గిస్తుంది. మైలేజ్ మరియు పనితీరుపై రాజీ పడకుండా సౌకర్యాన్ని పెంచుకోబోతున్నామని హ్యుందాయ్ తెలిపింది.

MOST READ:బర్త్ డే బాయ్ యువరాజ్ సింగ్ లగ్జరీ కార్ కలెక్షన్

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

ఈ గేర్‌బాక్స్ మొదట హ్యుందాయ్ వెన్యూలో తీసుకురాబడింది మరియు ఆ తరువాత కియా సొనెట్‌లో ప్రారంభించబడింది. సంస్థ యొక్క ఈ గేర్‌బాక్స్ కి వినియోగదారుల నుండి మంచి స్పందన వస్తోంది, అంతేకాకుండా మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఎంచుకునే వారు ఐఎమ్‌టిపై ఎక్కువ ఆకర్షితులవుతున్నారు.

ఈ గేర్‌బాక్స్ వెన్యూ యొక్క స్పోర్ట్ ట్రిమ్‌లో అందుబాటులో ఉంచబడింది. హ్యుందాయ్ వెన్యూ స్పోర్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది, దాని పెట్రోల్ వెర్షన్ 1.0 లీటర్ టర్బో ఇంజన్ కలిగి ఉంది, డీజిల్ 1.5 లీటర్ ఇంజన్ కలిగి ఉంది, ఇది 98.4 బిహెచ్‌పి శక్తిని మరియు 240 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్.. తమిళ్ తలైవా కార్లు ఎలా ఉన్నాయో చూసారా !

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

కొంతకాలం క్రితం కంపెనీ హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరను రూ. 5000 నుంచి రూ. 12,000 వరకు పెంచారు, దీని కారణంగా ఇప్పుడు దీని ధర రూ. 6.75 లక్షలు నుంచి రూ. 12.65 లక్షల వరకు ఉంది. హ్యుందాయ్ వెన్యూ ప్రస్తుతం మూడు ఇంజన్ అప్సన్లలో మరియు అనేక గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది, దీని కారణంగా ఇది ఇప్పటికీ వినియోగదారులకు అభిమాన వాహనంగా మారింది

Most Read Articles

English summary
Sania Mirza Drives Hyundai Venue. Read in Telugu.
Story first published: Saturday, December 12, 2020, 13:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X