మారుతి ఆల్టో 800 లో కనిపించిన పాపులర్ బాలీవుడ్ బ్యూటీ 'సారా అలీఖాన్' [వీడియో]

సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కువ ఖరీదైన కార్లను మరియు బైకులను వినియోగిస్తారని తెలుసు. అయితే ప్రముఖ బాలీవుడ్ సెలబ్రటీ 'సారా అలీఖాన్' (Sara Ali Khan) ఇటీవల మారుతి సుజుకి యొక్క ఆల్టో 800 (Alto 800) కారులో కనిపించింది. ఇంతకీ సారా ఈ కారులో కనిపించడం వెనుక ఉన్న కారణం ఏమిటి? ఆల్టో800 కారు గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

మారుతి ఆల్టో 800 లో కనిపించిన పాపులర్ బాలీవుడ్ బ్యూటీ 'సారా అలీఖాన్' [వీడియో]

బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ మారుతి ఆల్టో800 కారులో కనిపించిన వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది. ఈ వీడియోలో సారా అలీ ఖాన్ ఒక భవనం నుండి బయటకు వస్తుంది. ఆ సమయంలో అక్కడ ఫోటోలకు ఫోజులు కూడా ఇస్తుంది. ఆ తరువాత కారులో కూర్చుని ముందుకు వెళ్ళిపోతుంది.

మారుతి ఆల్టో 800 లో కనిపించిన పాపులర్ బాలీవుడ్ బ్యూటీ 'సారా అలీఖాన్' [వీడియో]

మనం ఈ వీడియోలో గమనించినట్లయితే సారా అలీఖాన్ వెళ్లిన కారు ఆల్టో800 అని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో ఆమె కో ఫ్యాసింజర్ సీటులో కూర్చుంటుంది. డ్రైవర్ కారుని డ్రైవ్ చేస్తాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

మారుతి ఆల్టో 800 లో కనిపించిన పాపులర్ బాలీవుడ్ బ్యూటీ 'సారా అలీఖాన్' [వీడియో]

ఇక మారుతి సుజుకి యొక్క ఆల్టో800 విషయానికి వస్తే, ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీ హ్యాచ్ బ్యాక్. ఇది దాదాపు 2 దశాబ్దాలు ఆటో మొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం తరం ఆల్టో800 నిజానికి 2012 లో ప్రారభించబడింది. ఆ తరువాత ఫీచర్స్ పరంగా డిజైన్ మొదలైన వాటిలో అప్డేట్స్ పొందింది.

మారుతి ఆల్టో 800 లో కనిపించిన పాపులర్ బాలీవుడ్ బ్యూటీ 'సారా అలీఖాన్' [వీడియో]

మారుతి ఆల్టో 800 యొక్క హై ఎండ్ మోడల్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతాయి. అంతే కాకుండా ఇందులో డ్యూయెల్ ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లతో పాటు ఎబిఎస్ కూడా అందుబాటులో ఉంటాయి. అయితే సారా అలీఖాన్ కనిపించిన కారు బేసిక్ మోడల్ కావడం విశేషం.

మారుతి ఆల్టో 800 లో కనిపించిన పాపులర్ బాలీవుడ్ బ్యూటీ 'సారా అలీఖాన్' [వీడియో]

సారా అలీఖాన్ ఈ కారుని ఎంచుకోవడానికి ప్రధాన కారణం రోడ్డుపైన ఎక్కువమంది గుమికూడకుండా ఉండటానికి అని తెలుస్తుంది. ఎందుకంటే ఒక సెలబ్రెటీ అలంటి బేస్ మోడల్ కారుల ప్రయాణిస్తుంది అని ఎవరూ ఊహించరు. అలీఖాన్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీమణుల్లో ఒకరైన శ్రద్ధా కపూర్ కూడా మారుతి కారులో కనిపించారు.

మారుతి ఆల్టో 800 కారులో మాత్రమే కాకుండా సారా అలీ ఖాన్ గతంలో పాత తరం హోండా సిఆర్-వి మరియు జీప్ కంపాస్ వంటి కార్లలో కూడా కనిపించింది. అయితే దిశా పటానీ హోండా సివిక్ మరియు చేవ్రొలెట్ క్రూజ్ వంటి వాటిలో కనిపించింది. అదే సమయంలో మలైకా అరోరా తన ఇన్నోవా క్రిస్టాలో కనిపించింది. దీన్నిబట్టి చూస్తే సెలబ్రెటీలు కూడా సాధారణ కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతారని తెలుస్తోంది.

మారుతి ఆల్టో 800 లో కనిపించిన పాపులర్ బాలీవుడ్ బ్యూటీ 'సారా అలీఖాన్' [వీడియో]

ఇదిలా ఉండగా, ఇటీవల మారుతి సుజుకి 2022 ఆల్టో కే10 కారుని విడుదల చేసింది. 2022 ఆల్టో కె10 ప్రారంభ ధరలు రూ. రూ. 3.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, టాప్ ఎండ్ మోడల్స్ ధర రూ. 5.84 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

మారుతి ఆల్టో 800 లో కనిపించిన పాపులర్ బాలీవుడ్ బ్యూటీ 'సారా అలీఖాన్' [వీడియో]

2022 మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 5,500ఆర్‌పిఎమ్ వద్ద 66 బిహెచ్‌పి పవర్ మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 5 స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

మారుతి ఆల్టో 800 లో కనిపించిన పాపులర్ బాలీవుడ్ బ్యూటీ 'సారా అలీఖాన్' [వీడియో]

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి అత్యంత ప్రజాదరణ పొందిన కారు. ఇది సచిన్ టెండూల్కర్ యొక్క మొదటి కారు కూడా. మారుతి ఆల్టో800 కేవలం సాధారణ ప్రజలను మాత్రమే కాదు, సెలబ్రెటీలను కూడా ఎంతగానో ఆకర్శించగలిగింది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆల్టో కె10 కారు పైన కంపెనీ రూ. 25,000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఇది పండుగ సీజన్లో మారుతి ఆల్టో కె10 కొనేవారికి గొప్ప శుభవార్త అనే చెప్పాలి.

Most Read Articles

English summary
Sara ali khan spotted in maruti alto 800 hatchback details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X