లగ్జరీ కారు స్టైల్‌ను ఓవర్‌టేక్ చేసిన సారా టెండూల్కర్.. అందానికి మరింత అందం అంటుకుంది
సెలబ్రిటీలు ఎక్కువగా లగ్జరీ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. బయట కనిపించినప్పుడు వాటితోనే కెమెరాల కంట పడుతారు. అలాగే వారి పిల్లలు కూడా లగ్జరీ కార్లలో తిరగడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. వాళ్ల గ్యారేజీలలో BMW, మెర్సిడెస్-బెంజ్, రేంజ్ రోవర్ వంటి హై-ఎండ్ కార్లు సర్వసాధారణంగా ఉంటాయి. అలాంటి లగ్జరీ లైఫ్‌స్టైల్‌కి తాజాగా మరో ఉదాహరణగా నిలుస్తోంది క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుటుంబం. తాజాగా నెటింట్లో బాగా షేర్ అవుతున్న ఒక వీడియోలో ఆయన కుమార్తె సారా టెండూల్కర్, ఆమె తాత, అమ్మమ్మ, సచిన్ భార్య అంజలి టెండూల్కర్ తల్లిదండ్రులు అయిన ఆనంద్ మెహతా, అన్నాబెల్ మెహతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. సారా వారి చెయ్యి పట్టుకుని లగ్జరీ కారులోకి ఎక్కించడం ఈ వీడియోలో చూడవచ్చు. తరువాత మరో లగ్జరీ కారులో ఆమె ఎక్కడం కనిపిస్తుంది.
సెలబ్రిటీ స్టేటస్ ఎంత ఉన్నా, కుటుంబానికి ఉన్న అనుబంధం మాత్రం ఎప్పటికీ మారదు అనేది ఈ వీడియో ద్వారా మరోసారి రుజువైంది. సారా తన కుటుంబంతో కలిసి గడిపే సమయాన్ని ఆస్వాదిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఆటో ప్రేమికులు ఆ వీడియోలో కనిపించిన కారు గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఈ లగ్జరీ కారు జర్మన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ BMW 3 సిరీస్ లగ్జరీ సెడాన్ మోడల్.

దీని ధర ఇండియాలో రూ. 72.64 లక్షల నుంచి రూ. 79.21 లక్షల వరకు ధర ఉంటుంది. ముంబైలో దీని ధర సుమారు రూ. 76.22 లక్షలు. ఇవన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చేసి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది విశాలమైన ఇంటీరియర్, అధునాతన ఫీచర్స్, సున్నితమైన రైడ్‌కు ప్రసిద్ధి చెందింది. BMW సిరీస్ లగ్జరీ సెడాన్ కారు ఎక్స్‌టీరియర్ చూపును కట్టిపడేస్తుంది.
ముందుగా, అందరి దృష్టిని ఆకర్షించే బ్లాక్-అవుట్ కిడ్నీ గ్రిల్ దాని స్పోర్టీ డిజైన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీని వెనుక భాగం నుంచి ముందు భాగం వరకు కారు రూపాన్ని ఒక కొత్త లెవల్‌కు తీసుకెళ్లే అడాప్టివ్ LED హెడ్‌ల్యాంప్‌లు రాత్రి డ్రైవింగ్‌ను మరింత సేఫ్టీగా, స్టైలిష్‌గా మార్చుతాయి. కారు వెనుక భాగం బ్లాక్ కలర్‌లో మెరిపోతుంది. ఫ్రంట్ డార్క్ షాడో మెటాలిక్ ఫినిషింగ్ మరింత అందంగా కనిపిస్తుంది.

M-స్పెసిఫిక్ ఇన్సర్ట్‌లతో కూడిన కార్ కీ, ఇది కారును స్టార్ట్ చేసే సమయంలో రేసింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక గాలి ప్రవాహాన్ని నియంత్రించి, డ్రైవింగ్‌ను మరింత డైనమిక్‌గా మార్చే M-స్పెసిఫిక్ ఏరో ప్యాకేజీ స్పోర్ట్స్ డ్రైవింగ్‌ను మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కారులో విలాసవంతమైన ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి. ఇంటీరియర్‌లో ప్రధాన ఆకర్షణ 14.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.
ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఇంటిగ్రేషన్‌తో స్మార్ట్‌ఫోన్ డేటాను కారు డిస్‌ప్లే మీద నేరుగా యాక్సెస్ చేయొచ్చు. అదే విధంగా, టచ్ లేదా వాయిస్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయగల త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది. కారు లోపలికి అడుగు పెట్టగానే, ప్రతి ఫీచర్ లేటెస్ట్ టెక్నాలజీతో పలకరిస్తుంది. ఇది iDrive 8 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది, దీంతో మరింత స్మార్ట్, సులభమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

ఇది 2.0-లీటర్ పెట్రోల్, 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌లో లభిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 258 bhp పవర్, గరిష్టంగా 400 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. పెట్రోల్ మోడల్ 6.2 సెకన్లలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. మైలేజ్ 15.39 kmpl గా ఉంది. డీజిల్ వేరియంట్ 7.6 సెకన్లలో 0-100 kmph వేగాన్ని చేరుకుంటుంది. ఇది 19.61 కి.మీల మైలేజ్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








