ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయ్.. ఫస్ట్ ఏ నగరంలో ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలుసా? లోపల ఎంతమంది కూర్చోవచ్చంటే
భారతదేశ రాజధాని ఢిల్లీలో జనవరి 17 నుంచి ప్రారంభమైన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్ ఎంతో ఘనంగా జరుగుతుంది. దీనిలో దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ అవుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలు కార్లు, బైక్స్, వాణిజ్య, ఇతర వాహనాలను ఆవిష్కరించాయి. వీటిలో భవిష్యత్తులో విడుదల కాబోయే కాన్సెప్ట్ మోడళ్లు కూడా ఉన్నాయి. వీటిలో పలు వాహనాలు తమ రూపంతో ఆకట్టుకుంటున్నాయి. వెరైటీ డిజైన్లతో కనిపిస్తూ చూసే వారిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ సరళ ఏవియేషన్ పాల్గొంది. ఈ షోలో కంపెనీ శూన్య అనే కొత్త ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్‌ను ఆవిష్కరించి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం దీనిని ఇంకా వినియోగంలోకి తీసుకురాలేదు.
అతి త్వరలో ఎయిర్ టాక్సీ ప్రోటోటైప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తుంది. శూన్య ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్ (shunya air taxi prototype) ఇండియాలో సరికొత్త సంచలనాలనకు తెరలేపింది. ఇప్పటికి వరకు దేశంలో రోడ్డుపై వెళ్లే ట్యాక్సీలను చూసిన జనాలు భవిష్యత్తులో ఆకాశంలో ఎగిరే ట్యాక్సీలను చూడబోతున్నారు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో కూడా ఎయిర్ ట్యాక్సీల అభివృద్ధిపై అడుగులు పడ్డాయి. దీంతో క్షణాల్లోనే గమ్యస్థానికి చేరుకోవచ్చు.

ఆకాశంలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా హాయిగా విహరిస్తూ తమ గమ్యస్థానికి వెళ్లచ్చు. సమాచారం ప్రకారం, శూన్య ఎయిర్ ట్యాక్సీని మొదటగా బెంగళూరులో ప్రవేశపెడుతారు. ఆ తరువాత దశల వారీగా డిమాండ్‌కు అనుగుణంగా ఇతర ప్రధాన నగరాలకు విస్తరిస్తారు. ఇది 2028లో మొదటి దశలో ప్రారంభం కాబోతుందని తెలిసింది. శూన్య గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని 20-30 కి.మీ తక్కువ దూరం వరకు మాత్రమే వాడుకోవచ్చు.
సరళ ఏవియేషన్ తీసుకొచ్చిన శూన్య ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్‌లో పైలట్‌తో సహా గరిష్టంగా 6 మంది కూర్చోవచ్చు. ఇది గరిష్టంగా 680 కిలోల వరకు మోయగల కెపాసిటీ కలిగి ఉంది. సంప్రదాయ వాహనాలతో పోలిస్తే దీనిలో ప్రయాణించాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నగర రోడ్లపై ఇటీవల కాలంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగాలు, ఇతర పనులకు వెళ్లే వారు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు.

ప్రధానంగా బెంగళూరు వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఆసియా అత్యంత ఎక్కువ ట్రాఫిక్ నగరాల్లో ఇదే టాప్ ప్లేస్‌లో ఉంది. ఇలాంటి నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌లో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే క్రమంగా రోడ్లపై ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. నగరంలోని ప్రధాన ప్రదేశాలు, విమానాశ్రయం మధ్య యిర్ టాక్సీని నడిపే అవకాశం ఉంది.
సాధారణంగా బెంగళూరు నగరంలో రోడ్డు మార్గంలో ఒక ప్రధాన ఏరియా నుంచి విమానాశ్రయానికి ప్రయాణించాలంటే దాదాపు ఒక గంటకుపైనే సమయం పడుతుంది. అదే ఈ ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే ఇది దాదాపు 10 నిమిషాల వరకు పడుతుంది. సరళ ఏవియేషన్ చాలా కాలంగా దీనిపై పనిచేస్తుంది. తమ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం సంస్థ ఇటీవల కొన్ని నిధులను కూడా అందుకుంది.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








